Employees on strike
-
రిలే దీక్ష చేస్తూ మున్సిపల్ కార్మికుడి మృతి
పుట్టపర్తిలో ఘటన సమ్మెపై సర్కారు మొండి వైఖరి మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర చర్చలు హైదరాబాద్/విజయవాడ బ్యూరో: రాష్ట్ర సర్కారు మొండి వైఖరి కారణంగా మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల సమ్మె ఉధృతరూపం దాల్చుతోంది. పట్టణాల్లో చెత్త సమస్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కార్మికులు మంగళవారం ఆందోళన కొనసాగించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో రిలే నిరాహారదీక్ష చేపట్టిన మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికుడు వెన్నమ నాయుడు(32) గుండెపోటుతో మృతి చెందాడు. గుంటూరులో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళన చేస్తున్న కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముస్తాఫా, గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మద్దతు తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో భిక్షాటన, తిరుపతిలో స్కూటర్ ర్యాలీ, ధర్నాలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ఆందోళనకు లోక్‌సత్తా జిల్లా శాఖ సంఘీభావం తెలిపింది. విజయనగరం జిల్లా సాలూరులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పీడిగ రాజన్నదొర కార్మికులను కలిసి మద్దతు ప్రకటించారు. విజయవాడలో మున్సిపల్ కమిషనర్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించిన మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఎం, సీపీఐ రాష్ర్ట కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ అరెస్టు అయిన కార్మికులను పరామర్శించారు. చర్చల ద్వారా కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు నోటీసులివ్వండి: సమ్మె చేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ సిబ్బందితో మనకు సంబంధం లేదని, వారిని పనిలో నియమించిన కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులతో మంత్రి కొల్లు రవీంద్ర చర్చలు జరిపారు. వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. నేడు మున్సిపల్ కార్యాలయాల ముట్టడి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సింగపూర్, మలేషియా, జపాన్లపై ఉన్న ప్రేమ రాష్ట్రంలో సమ్మె చేస్తున్న మున్సిపల్ సిబ్బందిపై లేదని భారతీయ కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) ధ్వజమెత్తింది. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం అన్ని మున్సిపల్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పోలారి తెలిపారు. -
‘ఉపాధి హామీ’ ఇక పంచాయతీలకు!
{V>-Ò$-×ాభివృద్ధి నుంచి తప్పించాలని సర్కారు యోచన ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఉన్నతాధికారుల కసరత్తు 16 వేల మంది ఉద్యోగులకు తప్పని ఉద్వాసన హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) పర్యవేక్షణ బాధ్యతలను ఇకపై పంచాయతీరాజ్ విభాగానికి అప్పగించాలని సర్కారు భావిస్తోంది. కొన్నేళ్లుగా ఉపాధి హామీ పనులను గ్రామీణాభివృద్ధి విభాగం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కూలీలకు ఏడాది పొడవునా కనీసం వందరోజుల పని కల్పించడం ద్వారా గ్రామాల్లో శాశ్వత వనరులు కల్పించడం ఉపాధి హామీ పథకం ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని సక్రమంగా వినియోగించుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలుస్తోంది. తాజాగా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న సుమారు 16 వేల మంది తాత్కాలిక ఉద్యోగులు సమ్మెబాట పట్టిన నేపథ్యంలో పథకం అమలు బాధ్యతలను పంచాయతీరాజ్‌కు బదలాయించాలని ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. దశాబ్దకాలంగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.15 వేలకు పెంచాలంటూ సమ్మె చేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అంతేకాక, సమ్మె విరమించకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. తాజాగా ఈ పథకాన్ని పంచాయతీరాజ్ విభాగానికి అప్పగించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. పంచాయతీలకు అప్పగిస్తే.. ఉపాధి హామీ పథకం అమలు బాధ్యతలను అప్పగించడం ద్వారా పంచాయతీలకు మరిన్ని అధికారాలు ఇచ్చినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామాల్లో అభివృద్ధి పనులను ఎంపిక చేసే బాధ్యతను సర్పంచులకు, వార్డు సభ్యులకు అప్పగిస్తేనే పథకం సక్రమంగా అమలవుతుందని కూడా అధికారులు యోచిస్తున్నారు. ఈ పథకం ద్వారా చేపట్టిన పనులను పర్యవేక్షించేందుకు గ్రామానికి ఒక రోజ్‌గార్ సేవక్‌ను నియమిస్తే సరిపోతుందని ఆలోచిస్తున్నారు. దీని ద్వారా నిర్వహణ వ్యయం కూడా భారీగా తగ్గుతుందని అధికారులు లెక ్కలు వేస్తున్నారు. ప్రస్తుతం అధికారుల స్థాయిలో జరుగుతున్న ఈ కసరత్తు ఈ నెలాఖరులోగా కొలిక్కి వచ్చే అవకాశమున్నట్లు పంచాయతీరాజ్ శాఖలోని కీలక అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఇదే జరిగితే నెలరోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఉద్యోగులకు ఉద్వాసన తప్పదంటున్నారు. -
హోరెత్తిన నిరసనలు
విజయవాడ బ్యూరో: సమస్యల సాధన కోసం మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వంలో కదలిక రావడం లేదు. కార్మికుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో సోమవారం కలెక్టరేట్లను ముట్టడించారు. ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలతోపాటు ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం వంటి నిరసనలు నిర్వహించారు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) నిర్ణయించింది. అత్యవసర సేవలైన మంచినీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయాలని యూనియన్లు ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఈ సమ్మెకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం సంపూర్ణ మద్దతును ప్రకటించింది.