ముగిసిన పీఏసీఎస్ ఉద్యోగుల రిలే దీక్షలు
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్: నాబార్డు చైర్మన్ ప్రకాష్‌బకి్ష కమిటీ సిఫారసులు ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌తో ఈ నెల 16 నుంచి స్థానిక జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎదుట సీఐటీయూ, రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు బుధవారం ముగిశాయి.
రిలే దీక్షల్లో ఉద్యోగుల యూనియన్ నాయకులు ఈవీ.కొండారెడ్డి, పీ.గంగిరెడ్డి, జే.హరికృష్ణ, ప్రతాప్‌రెడ్డి, సీఐటీయూ, రైతు సంఘం నేతలతో పాటు పీఏసీఎస్ అధ్యక్షులు కొందరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొల్లోళ్లచెరువు పీఏసీఎస్ అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నేత లింగాల శివశంకర్‌రెడ్డి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. రైతులు, పేద వర్గాలకు సేవలందిస్తున్న పీఏసీఎస్‌లను నిర్వీర్యం చేసేవిధంగా ప్రకాష్‌బక్షి కమిటీ సిఫారసులు చేశారని నేతలు విమర్శించారు.
అవి అమలులోకి వస్తే పీఏసీఎస్‌లు మూతబడటం ఖాయమని, తద్వారా సహకార ఈ వ్యవస్థ మరింత దారుణంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కమిటీ సిఫారసులు ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాగా గురువారం ఏడీసీసీ బ్యాంకు ఎదుట ధర్నా చేపడుతున్నామని, అనంతరం 23న హైదరాబాద్‌లో నాబార్డు ప్రాంతీయ కార్యాలయం ముట్టడి కార్యక్రమం తలపెట్టామని చెప్పారు. ఉద్యోగులు, పీఏసీఎస్ అధ్యక్షులు, రైతులు మద ్దతు పలకాలని నేతలు కోరారు.