ఉద్యోగ సంక్షోభం పొంచి ఉంది
సిడ్ని: ప్రపంచం ఉద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కోనున్నదని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. అంతర్జాతీయ ఆర్థిక రికవరీ అవకాశాలను ఇది దెబ్బతీయగలదని, దీనిని నివారించగల మంత్రదండమేదీ లేదని పేర్కొంది. ఆస్ట్రేలియాలో జరిగిన జీ20 దేశాల కార్మిక, ఉద్యోగకల్పన మంత్రుల సమావేశంలో దీనికి సంబంధించిన నివేదికను ప్రపంచ బ్యాంక్ మంగళవారం విడుదల చేసింది. అంతర్జాతీయ కార్మిక సమాఖ్య (ఐఎల్ఓ), ఓఈసీడీలతో కలిసి ప్రపంచబ్యాంక్ ఈ నివేదికను రూపొందించింది.
ఈ నివేదిక పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు..,
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 2030 కల్లా 60 కోట్ల ఉద్యోగాలు కల్పించాలి?
జీ 20 దేశాల్లో ఉద్యోగ కొరత తీవ్రత ఉంది.
జీ20 దేశాల్లో వేతన, ఆదాయ అసమానతలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
జీ 20 దేశాల్లో నిరుద్యోగుల సంఖ్య 10 కోట్లకు పైగానే ఉంది.
రోజుకు 2 డాలర్లతో జీవనాన్ని వెళ్లదీస్తున్న దీనుల సంఖ్య 45 కోట్లుగా ఉంది.
మందకొడిగా ఉన్న వృద్ధి ఉద్యోగవకాశాలకు విఘాతం కలిగిస్తోంది.