Employment funds
-
ఉపాధి అభివృద్ధి.. మూడు జాతీయ స్థాయి అవార్డులు
ఉపాధి కూలీలకు జీవనోపాధి కల్పిస్తూ శాశ్వత నిర్మాణాలతో అభివృద్ధిలో జిల్లా దూసుకెళ్తోంది. మెటీరియల్ కాంపోనేట్తో గ్రామీణాభివృద్ధిలో భాగంగా పది రకాల భవనాలు నిర్మిస్తున్నారు. ప్రతి రోజూ సుమారు 60 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ ఏడాదిలో సుమారు 1.20 కోట్ల పని దినాలు కల్పించడం, అభివృద్ధే లక్ష్యంగా జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించారు. అందుకు తగిన విధంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగానికి లక్ష్యాలు నిర్దేశించారు. నెల్లూరు (పొగతోట): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ కూలీలకు పనులు కల్పించడంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి నిధులతో 10 రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. జిల్లాలో 2019 నుంచి ఇప్పటి వరకు ఉపాధి హమీ పథకం ద్వారా రూ.1,419.38 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు రూ.828.95 కోట్లు వేతనా ల రూపంలో చెల్లించారు. మెటీరియల్ కాంపో నేట్ ద్వారా రూ.590.43 కోట్లు ఖర్చు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సీసీరోడ్లు, సీసీ డ్రెయిన్లు, రైతుభరోసా కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, సచివాలయాలు, బల్క్ మిల్క్ సెంటర్స్ తదితర భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఉపాధి హామీ పనులు హాజరయ్యే కూలీలకు రోజుకు ఒక్కొక్కరికి రూ.252 వేతనం చెల్లించాల్సి ఉంది. రూ.252 వేతనం కూలీకి చెల్లిస్తే రూ.171 అభివృద్ధి పనులు చేపట్టేందుకు మంజూరు చేస్తున్నారు. జిల్లాకు మూడు జాతీయ స్థాయి అవార్డులు గ్రామాల్లో అవసరం పనులను ఉపాధి హామీ సిబ్బంది ద్వారా గుర్తించి ప్రతి వారం ఆయా పనులను అప్లోడ్ చేస్తున్నారు. గుర్తించి పనులకు కూలీలు హాజరయ్యేలా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుత నింబంధనల ప్రకారం గుర్తించిన పనులను పూర్తి చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే కొత్త పనులు చేపట్టే అవకాశం ఉంది. ఉపాధి పని దినాలు కల్పించడంలో జిల్లాకు మూడు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 1.29 కోట్ల పనిదినాలు కల్పించారు. కూలీలకు వేతనం ద్వారా రూ 266.96 కోట్లు, మెటీరియల్ కాంపోనేట్కు రూ.132.13 కోట్లు ఖర్చు చేశారు. ఉపాధి పనులు చేసిన కూలీలకు వారి బ్యాంకు అకౌంట్లలో నగదు జమ అవుతుంది. కూలీలు ఉదయం 6 గంటలకు వచ్చి 10.30లోపు ఉపాధి పనులు పూర్తి చేసుకుని వెను తిరుగుతున్నారు. వ్యవసాయ పనులు అధికంగా జరిగే రోజుల్లో ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య తక్కువగా ఉంటుంది. రాపూరు, వింజమూరు, వరికుంటపాడు, ఉదయగిరి తదితర మండలాల్లో ఉపాధి పనులు అధికంగా జరుగుతున్నాయి. ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెంచి నిర్దేశించిన వేతనం మంజూరు చేయించేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు క్రమం తప్పకుండా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి సూచనలు సలహాలు ఇస్తున్నారు. డ్వామా పీడీ , అడిషనల్ పీడీ నిర్మలారెడ్డి నిత్యం మండల సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్‌లో నిర్వహించి ఉపా«ధి పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపడుతున్నారు. 1.20 కోట్ల పని దినాలే లక్ష్యం జిల్లాలోని 37 మండలాల్లో 722 పంచాయతీలు ఉన్నాయి. సుమారు 4.43 లక్షల మంది జాబ్‌కార్డులు కలిగిన కూలీలు ఉన్నారు. ప్రతి రోజు 50 నుంచి 60 వేల మంది ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. గతేడాది 90 వేల నుంచి లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటిలో 82 లక్షల పనిదినాలు జిల్లాకు కేటాయించారు. ఇప్పటి వరకు 79 లక్షల పనిదినాలు పూర్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు 1.10 కోట్ల నుంచి 1.20 కోట్ల పని దినాలు పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య తక్కువగా ఉంది. ఉపాధి పనులతో అభివృద్ధి పనులతో పాటు వ్యవసాయ రంగం అభివృద్ధి చెందేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెంచేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి కూలీకి రూ.252 వేతనం వచ్చేలా పనులు చేయిస్తున్నారు. ఉపాధి పనులు అధికంగా జరిగి కూలీలకు వేతనం అధికంగా చెల్లిస్తే అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగే అవకాశం ఉంది. కూలీలకు నిర్దేశించిన వేతనం చెల్లించేలా చర్యలు జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ప్రతి కూలీలకు రూ.252 వేతనం చెల్లించేలా చర్యలు చేపట్టాం. ఉపాధి పనులు అధికంగా జరిగితే అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది. సీసీ రోడ్లు, ఆర్బీకేలు, అంగన్వాడీ భవనాలు తదితర భవన నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 82 లక్షల పని దినాలు కల్పించమని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటి వరకు 79 లక్షల పనిదినాలు కల్పించాం. ఉపా«ధి పనులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు అధికంగా చేపట్టే అవకాశం ఉంది. – వెంకట్రావ్, డ్వామా పీడీ -
చెరువులకు అమృత్ యోగం
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో అమృత్ సరోవర్ పథకం ద్వారా కొత్త చెరువుల తవ్వకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉపాధి హామీ పథకం ద్వారా వీటి తవ్వకం జరగనుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఎకరా స్థలంలో కొత్త చెరువుల నిర్మాణం జరగనుంది. నీటి ఒరవ ఉన్న ప్రాంతంలో ఇలాంటి వాటిని తవ్వనున్నారు. కొత్త చెరువుల తవ్వకానికి స్థలం దొరకని చోట ఉన్న పాతవి ఆధునీకరిస్తున్నారు. ఇప్పటికే 50 నుంచి 100 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువులను ఈ కార్యక్రమం కింద ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల పరిధిలోని 96 చెరువులను అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ పనులకు సంబం«ధించిన ప్రతిపాదనలు సైతం జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు. ఇప్పటికే 86 చెరువులకు జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. మిగిలిన వాటిని త్వరలోనే మంజూరు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో జంగిల్ క్లియరెన్స్, పూడికతీత, బౌండరీల నిర్మాణం, చెరువు సరిహద్దు వెంబడి మొక్కల పెంపకం చేపట్టనున్నారు. ప్రభుత్వం పూడికతీతలో భాగంగా తవ్వే మట్టిని అవసరమైన రైతులు తమ సొంత ఖర్చులతో పొలాలకు తరలించుకునే వెసలుబాటు కల్పించారు. చెరువు కమిటీల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. రూ. 8.24 కోట్ల నిధులతో చెరువుల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే 81 చెరువుల పరిధిలో పనులు మొదలయ్యాయి. మిగిలిన చోట త్వరలోనే మొదలు కానున్నాయి. ఉపాధి హామీ కూలీలతోనే చెరువుల నిర్మాణ పనులు జరగనున్నాయి. కూలీల కోసం రూ. 7.47 కోట్ల నిధులు వెచ్చించనున్నారు. మెటీరియల్ కాంపోనెంట్ కింద మరో రూ. 77.296 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే పనులు మొదలుకాగా 2022 ఆగస్టు నాటికి కొన్ని చెరువు పనులను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత 2023 ఆగస్టు నాటికి మిగిలిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చెరువుల అభివృద్ధితో జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. దీంతోపాటు పెద్ద ఎత్తున భూగర్బ జలాలు పెంపొందనున్నాయి. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో చెరువుల నిర్మాణ పనులు జరగనున్నాయి. 8అటవీశాఖ పరిధిలో 126 పనులు అమృత్ సరోవర్‌లో భాగంగా అటవీశాఖ పరిధిలో పెద్ద ఎత్తున పనులు చేపట్టనున్నారు. ప్రధానంగా అట్లూరు, సిద్దవటం, కాశినాయన, సీకే దిన్నె, పెండ్లిమర్రి మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఇప్పటికే 16 ట్యాంకులను గుర్తించారు. ఇవి కాకుండా మరో 110 పర్కులేషన్, మినీ పర్కులేషన్ ట్యాంకులను సైతం గుర్తించారు. వీటికి సంబంధించి అటవీశాఖ అంచనాలను రూపొందించి జిల్లా కలెక్టర్‌కు పంపనుంది. అనంతరం సదరు పనులను మంజూరు చేయనున్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతోనే ఈ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం సుమారు రూ. 3 కోట్లకు పైగా నిధులను వెచ్చించనున్నారు. జిల్లాలో చెరువుల అభివృద్ధిపై ప్రభుత్వం శ్రీకారం చుట్టడం, తద్వారా ఉపాధి హామి కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించే చర్యలు చేపట్టడంతో రైతులు, కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు అమృత సరోవర్ పథకం కింద ఉపాధి హామీ నిధులతో జిల్లాలో 96 చెరువులను అభివృద్ది చేస్తున్నాం. ఎకరా విస్తీర్ణంలో కొత్తవి నిర్మిస్తున్నాం. స్థలం అందుబాటులో లేని దగ్గర ఉన్న పాత చెరువులను అభివృద్ధి చేస్తున్నాము. వీలైనంత త్వరగా చెరువుల పనులను పూర్తి చేయనున్నాం. దీనివల్ల మరింత ఆయకట్టు సాగులోకి రానుంది. – విజయరామరాజు, జిల్లా కలెక్టర్ ఉపాధిహామీ నిధులతో చెరువుల అభివృద్ధి పనులు ప్రభుత్వం అమృత్ సరోవర్ కింద కొత్త చెరువుల నిర్మాణంతోపాటు పాతవి అభివృద్ది చేస్తోంది.డ్వామా ఆధ్వర్యంలో ఉపాధి కూలీల ద్వారా ఈ పనులు చేపట్టాం. ఇందుకోసం రూ. 8.24 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తాం. చెరువుల అభివృద్ధితో భూగర్భజలాలు పెరగనున్నాయి. – యదుభూషణరెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా, కడప -
కరువుపై మీనమేషాలెందుకు?
► కేంద్రప్రభుత్వ నిధులుఖర్చుపెట్టండి ► ఉపాధి నిధులను ఇతర పథకాలకు వాడొద్దు ► రైతులకు ఉచితంగా పశుగ్రాసం పంపిణీచేయాలి ► బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి మహబూబ్‌నగర్ న్యూటౌన్/ నారాయణపేట : రాష్ట్రంలో కరువు కాటేస్తున్నా.. ఏటేటా సాగువిస్తీర్ణం తగ్గుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన జిల్లాకేం ద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నారాయణపేటలో జరిగిన జిల్లాస్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కరువుతో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 40 లక్షల మంది వలస లు పోయారని, 14 లక్షల ఎకారాల్లో పంటలు ఎండిపోయాయని తెలిపారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ఉచితంగా పశుగ్రాసం వంటి కార్యక్రమాలు చేస్తుంటే ఇక్కడి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కరువు నివారణకు కేంద్ర ప్రభుత్వం రూ. 300 కోట్లు విడుదల చేసినా ఖర్చుపెట్టకుండా మీనమేషాలు లెక్కిస్తుండటం సరైంది కాదన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రెండు నెలల కూలీ పెండిం గులో పెట్టి నిధులను ఇతర కార్యక్రమాలకు వాడుకుంటుందని, గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తే అభివృద్ధికి ఖర్చు చేయకుండా ఆదాయాన్ని పెంచుకునేం దుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. రైతు ఆత్మహత్యలు, వడదెబ్బ మృతులసంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా ముఖ్యమంత్రి వాటికోసం సమయం ఇవ్వడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా, రాష్ట్ర నాయకులు రతంగ్‌పాండురెడ్డి, నాగూరావు నామాజీ, ఆచారి, పద్మజారెడ్డి, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సిద్ధాంతాలే ముఖ్యం ప్రతి కార్యకర్త పదవుల కోసం కాకుండా దేశ అభ్యున్నతి, నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తూ కేంద్రపభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణపేటలో నియోజకవర్గ పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం స్థానిక జీపీ శెట్టి ఫక్షన్హాల్లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్, ఉపాధిహామీ, అటల్ఫెన్షన్, బేటి బచావో... పడావో, జన్‌ధన్‌యోజన వంటి పథకాలను తీసుకొచ్చిందని, వాటిని ప్రజలు సద్వినియోగించుకునేలా చూడాలని కోరారు. పంచాయితీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రధాని ఈనెల 14 నుంచి 24 వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని, అంబేద్కర్ జయంతి జరుపుకోవాలని కోరారు. -
చెత్తకు చెల్లు
సాక్షి, కర్నూలు: గ్రామాల్లో చెత్త నిల్వ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. పల్లెల్లో చెత్త తొలగింపు పెద్ద సమస్యగా మారింది. తాజా నిర్ణయంతో ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఏర్పడింది. ఇప్పటి వరకు నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లోనే చెత్త నిల్వ కేంద్రాలు(డంపింగ్ యార్డులు) ఉండగా.. తాజాగా గ్రామాల్లోనూ ఏర్పాటు చేస్తుండటంతో ప్రజలకు ఊరట లభించనుంది. ప్రత్యేక చర్యలు చేపట్టినా గ్రామాల్లో ఎప్పటికప్పుడు చెత్త పేరుకుపోతుండటంతో తరలింపు ప్రక్రియకు పంచాయతీలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. పంచాయతీలకు నిధుల మంజూరు కూడా అంతంతమాత్రమే కావడంతో సర్పంచ్‌లు ప్రజల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవడం పరిపాటి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సర్పంచ్‌లపై భారం కాస్త తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేవిధంగా పల్లెల్లో ప్రస్తుతం సేకరిస్తున్న చెత్తను సమీపంలోని చెరువులు, కుంటలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో వేస్తున్నారు. తద్వారా నీరు రంగు మారడంతో పాటు కలుషితమై వ్యాధుల వ్యాప్తికి కారణమవుతోంది. నిల్వ కేంద్రాల ఏర్పాటుతో ఈ సమస్యలకూ పరిష్కారం లభించనుంది. ఉపాధి నిధులతో... ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పని కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. జిల్లాలోని 783 గ్రామ పంచాయతీలు, రెండు వేలకు పైగా అనుబంధ గ్రామాలకు తాజా ప్రభుత్వ నిర్ణయం మేలు చేకూర్చనుంది. మొదట మండల కేంద్రాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఇక్కడ ఎదురయ్యే సమస్యల పరిష్కారంతో గ్రామాల్లో మరింత పక్కాగా పథకం అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. తద్వారా కూలీలకు నిరంతరం పని లభించడమే కాకుండా చెత్త తొలగింపుతో గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడనుంది. తాజా నిర్ణయంలో భాగంగా గ్రామ శివారులోని ఖాళీ పంచాయతీ స్థలంలో ఓ పెద్ద గుంత తవ్వి ఉంచుతారు. గ్రామంలోని చెత్తను ఉపాధి కూలీల ద్వారా అక్కడికి తరలించి నిల్వ చేయనున్నారు.