enceladus
-
ఇక్కడ గ్రహాంతరవాసులు ఉండొచ్చు..!
మనం నివసిస్తున్న భూమికి ఓ చంద్రుడు ఉన్నట్లే.. శనిగ్రహానికీ ఎన్ సెలాడస్ అనే ఒక చంద్రుడు ఉన్నాడు. దానిమీద నీళ్లు ఉన్నట్లు కూడా తేలింది. ఇప్పుడు ఆ చంద్రుడి మీద గ్రహాంతరవాసులు ఉండే అవకాశం కచ్చితంగా ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చెబుతోంది. ఎన్ సెలాడస్ మీద ఉన్న మంచు కింద నీళ్లు ఉన్నట్లు గుర్తించింది. అక్కడి నమూనాలను సేకరించి పరిశీలించగా, అందులో 98 శాతం నీళ్లు ఉన్నట్లు తేలింది. మిగిలిన 2 శాతం కూడా హైడ్రోజన్ , కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లాంటి వాయువులు ఉన్నాయని చెప్పారు. వీటన్నింటిని బట్టి చూస్తే అక్కడ జీవం ఉందని తెలుస్తోందని పరిశోధనలకు నేతృత్వం వహించిన సౌత్‌వెస్ట్ రీసెర్చ్ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్త హంటర్ వైట్ తెలిపారు. బహుశా తాము మళ్లీ అక్కడకు వెళ్లి జీవానికి సంబంధించిన ఆనవాళ్లనూ చూడాల్సి ఉందని చెప్పారు. అసలు వేరే గ్రహం మీద జీవాన్ని కనుక్కోవడమే చాలా ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. వాస్తవానికి మన చంద్రుడితో పోలిస్తే ఎన్ సెలాడస్ చాలా చిన్నది. చంద్రుడిలో సుమారు 15 శాతం పరిమాణంలో మాత్రమే ఉండే ఎన్ సెలాడస్ మీద జీవానికి కావల్సిన రసాయన ఇంధనం ఉందన్న నిర్ధారణ భూగ్రహానికి వెలుపల జీవం మీద జరుగుతున్న పరిశోధనలో మైలురాయి అని ఆమె చెప్పారు. -
గ్రహాంతర జీవులు ఉండొచ్చు: నాసా
మనం నివసిస్తున్న భూమికి ఓ చంద్రుడు ఉన్నట్లే.. శనిగ్రహానికి కూడా ఎన్సెలాడస్ అనే ఒక చంద్రుడు ఉన్నాడు. దానిమీద నీళ్లు ఉన్నట్లు కూడా తేలింది. ఇప్పుడు ఆ చంద్రుడి మీద గ్రహాంతర వాసులు ఉండే అవకాశం కచ్చితంగా ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చెబుతోంది. శనిగ్రహాన్ని పరిశీలించేందుకు నాసా ఎప్పటినుంచో దృష్టి కేంద్రీకరించింది. ఎన్సెలాడస్ మీద ఉన్న మంచు కింద నీళ్లు ఉన్నట్లు గుర్తించింది. అక్కడి నమూనాలను సేకరించి పరిశీలించగా, అందులో 98 శాతం నీళ్లు ఉన్నట్లు తేలింది. మిగిలిన 2 శాతం కూడా హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లాంటి వాయువులు ఉన్నాయని చెప్పారు. వీటన్నింటిని బట్టి చూస్తే అక్కడ జీవం ఉందని తెలుస్తోందని, సాధారణ జీవులు మీథేన్‌ను తీసుకుని కార్బన్ డయాక్సైడ్ను వదులుతాయని కూడా శాస్త్రవేత్తలు వివరించారు. సూక్ష్మజీవులు ఉపయోగించుకునే రసాయన ఇంధన వనరులు అక్కడ ఇప్పటికే కనిపించాయని, అయితే అక్కడ ప్రస్తుతానికి ఫాస్పరస్, సల్ఫర్ మాత్రం కనిపించలేదని పరిశోధనలకు నేతృత్వం వహించిన సౌత్‌వెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త హంటర్ వైట్ తెలిపారు. బహుశా అవి చాలా తక్కువమొత్తంలో ఉండటం వల్లే కనపడకపోవచ్చని, తాము మళ్లీ అక్కడకు వెళ్లి జీవానికి సంబంధించిన ఆనవాళ్లను కూడా చూడాల్సి ఉందని చెప్పారు. ఎన్సెలాడస్ మీద బ్యాక్టీరియా లాంటి చిన్న జీవులు ఉండే అవకాశం ఉందని, అసలు వేరే గ్రహం మీద జీవాన్ని కనుక్కోవడమే చాలా ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. భూమ్మీద జీవానికి కావల్సినవన్నీ ఎలా ఉన్నాయో.. శనిగ్రహపు చంద్రుడి మీద కూడా అచ్చం అలాగే ఉన్నాయని నాసా శాస్త్రవేత్త లిండా స్పిల్కర్ వివరించారు. వాస్తవానికి మన చంద్రుడితో పోలిస్తే ఎన్సెలాడస్ చాలా చిన్నది. చంద్రుడిలో సుమారు 15 శాతం పరిమాణంలో మాత్రమే ఉంటుంది. అంత చిన్న చంద్రుడి మీద జీవానికి కావల్సిన రసాయన ఇంధనం ఉందన్న నిర్ధారణ భూగ్రహానికి వెలుపల జీవం మీద జరుగుతున్న పరిశోధనలో చాలా పెద్ద మైలురాయి అని ఆమె చెప్పారు. -
శని ఉపగ్రహంపై భారీ సముద్రం
వాషింగ్టన్: శనిగ్రహం ఉపగ్రహమైన ‘ఎన్సెలాడస్’ మొత్తం నీటితో నిండి ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసా పంపిన కాసిని వ్యోమనౌక ‘ఎన్సెలాడస్’ను పలుమార్లు సమీపం నుంచి పరిశీలించింది. కేవలం 500 కి.మీ. వ్యాసం ఉన్న ‘ఎన్సెలాడస్’.. 35 నుంచి 40 కి.మీ. మందంతో దట్టమైన మంచుపొరతో కప్పబడి ఉంటుంది. అయితే దీని దక్షిణ ధ్రువం వద్ద ఉన్న పగుళ్ల నుంచి పెద్ద మొత్తంలో నీటి ఆవిరి, మంచు కణాలు, కొన్ని సాధారణ మూలకాల కణాలు బయటకు వెదజల్లుతుండడాన్ని కాసిని తీసిన చిత్రాల్లో గుర్తించారు. అంతేగాకుండా ‘ఎన్సెలాడస్’ శని చుట్టూ పరిభ్రమిస్తున్నప్పుడు కొన్ని ప్రదేశాల్లో కొద్దిగావేగం పెరుగుతోందని, మరికొన్ని సార్లు వేగం స్వల్పంగా తగ్గుతోందని గమనించారు. -
శనిగ్రహం ‘చందమామ’లో సముద్రం!
వాషింగ్టన్: శనిగ్రహానికి సహజ ఉపగ్రహాల్లో ఒకటైన ‘ఎన్సెలడస్’ గర్భంలో ఓ సముద్రం ఉందట! ఎన్సెలడస్పై 40 కి.మీ. మందంలో పేరుకుపోయిన మంచు ఉపరితలం కింద 10 కి.మీ. లోతైన జలాశయం ఉందని, అందులో నీరు ద్రవరూపంలోనే ఉందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎన్సెలడస్ దక్షిణార్ధగోళంపై అక్కడక్కడా ఉన్న పొడవాటి నెర్రెల నుంచి తరచూ నీటి ఆవిరి, వాయువులు ఎగజిమ్ముతాయని, అందు వల్ల దాని గర్భంలో భారీ జలాశయం ఉండవచ్చని శాస్త్రవేత్తలు 2005లోనే అంచనా వేశారు. తాజాగా క్యాసినీ ఉపగ్రహం ఎన్సెలడస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు గురుత్వాకర్షణ ప్రభావం, సమాచార ప్రసార వ్యవస్థలో జరిగిన మార్పులను బట్టి.. అక్కడ సముద్రం ఉందని నిర్ధారించారు. ఆ సముద్రంలో సూక్ష్మజీవులు కూడా మనుగడ సాగించేందుకు అవకాశముందనీ, మన సౌరకుటుంబంలో భూమి తర్వాత జీవం ఉండేందుకు ఎక్కువ అవకాశాలున్న ఖగోళ వస్తువు ఇదేననీ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అన్నట్టూ.. మన భూమికైతే ఒకే చందమామ ఉంది కానీ.. శనిగ్రహానికి మాత్రం.. చిన్నా, చితకా మొత్తం 62 చందమామలున్నాయి తెలుసా..!