'ఉగాది నుంచి ఇంటింటికీ ఉచిత పూజలు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఉగాది నుంచి ఇంటింటికీ ఏడు ఉచిత పూజలు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు శనివారం వెల్లడించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పూజలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పిల్లలు పుట్టినప్పుడు, శ్రీమంతాలు, వివాహాలు, చనిపోయిన సందర్భాల్లో పండితులే ఇంటికి వచ్చి పూజలు నిర్వహిస్తారన్నారు. ఆగస్టు 12 నుండి 28 వరకు కృష్ణా పుష్కరాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.