ఇంజనీంగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం విడుదల చేసింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి షెడ్యూల్ను ప్రకటించారు. జూన్ 12 నుంచి 21 వరకు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. జూన్ 16 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు.
ఈ నెల 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్లను మార్చుకొనేందుకు అవకాశం ఉందన్నారు. జూన్ 28న విద్యార్థులకు ఇంజనీరింగ్ సీట్లు కేటాయిస్తారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు 21 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పాపిరెడ్డి తెలిపారు. ఆయా కాలేజీల్లో విద్యార్థుల ప్రవేశానికి జూలై 3 వరకు గడువు విధించినట్ల షెడ్యూల్లో ప్రకటించారు.