ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్ : ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా కళాశాలల ఎంపికకు ఆదివారం వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. జిల్లాలోని నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల పరిధిలో తొలిరోజు 240 మంది విద్యార్థులు కళాశాలల్లో సీట్ల కోసం ఆప్షన్లు ఇచ్చుకున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు 1,264 మంది హాజరయ్యారు. గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు 322, వెబ్ కౌన్సెలింగ్‌కు 87 మంది హాజరయ్యారు.
నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు 312, వెబ్ కౌన్సెలింగ్‌కు 20, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు 305, వెబ్ కౌన్సెలింగ్‌కు 88, ఏఎన్‌యూలో సర్టిఫికెట్ల పరిశీలనకు 325, వెబ్ కౌన్సెలింగ్‌కు 45 మంది హాజరయ్యారు.
నేటి కౌన్సెలింగ్
సోమవారం జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 45,001 ర్యాంకు నుంచి 48,800 వరకూ, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 48,801 ర్యాంకు నుంచి 52,500 వరకూ, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 52,501 ర్యాంకు నుంచి 56,300 వరకూ, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో 56,301 ర్యాంకు నుంచి 60,000 వరకూ హాజరుకావాలి.