english mediam
-
పొలిటికల్ కామెంట్: తమ పిల్లలు మాత్రమే ఇంగ్లీషు మీడియంలో చదవాలా..?
-
9 నుంచి ‘మన బస్తీ.. మన బడి’ పనులు
సాక్షి,హైదరాబాద్: జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 9 నుంచి ‘మన బస్తీ – మన బడి’ పనులను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సోమవారం ఆయన మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి జిల్లాలో ‘మన బస్తీ – మన బడి ’పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం తో పాటు సమగ్రమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘మన ఊరు –మన బడి’, ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందుకోసం 11 మంది మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,065 పాఠశాలలను గుర్తించి రూ.7,289.54 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 239 పాఠశాలలను ఎంపిక చేశారన్నారు. వీటికి ఎస్టిమేషన్లను కూడా సిద్ధం చేసినందున ఈ నెల 9 వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పనులను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు.. ప్రధానంగా ఆయా పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం, తాగునీటి వసతి, విద్యార్ధులు, ఉపాధ్యాయులకు సరిపడా ఫర్నిచర్, పాఠశాల భవనాలకు రంగులు వేయడం, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, గ్రీన్ చాక్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, కాంపౌండ్ వాల్స్ నిర్మాణం తదితర మౌలిక సౌకర్యాలు కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామనేలా వాటిని అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. గతంలో మాదిరిగా కాకుండా విద్యార్థుల కొలతలకు అనుగుణంగా యూనిఫాం కుట్టించి అందజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అన్ని స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం వచ్చే విద్యా సంవత్సరం (జూన్ 2022) నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ‘మన బస్తీ – మన బడి’ పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత డిప్యూటీ డీఈవోల పై ఉంటుందని, ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, వసతులను కల్పించడంపై శ్రద్ధ చూపాలని ఆదేశించారు. వికలాంగ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల వారిగా సిబ్బంది, ఉపాద్యాయుల ఖాళీలకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించాలన్నారు. అధికారులు అందజేసే నివేదికను మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని రెడ్ క్రాస్ సొసైటీ స్కూల్లో సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ సమావేశం దృష్టికి తీసుకు రాగా, త్వరలో స్కూల్ ను సందర్శించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన క్రీడా సామాగ్రిని ప్రభుత్వం అందజేస్తామన్నారు. సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు ప్రభాకర్, స్టీఫెన్ సన్, సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ శర్మన్, విద్యాశాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. (చదవండి: అర్జున్‌రెడ్డి, తరుణ్‌రెడ్డి.. వీళ్లిద్దరూ మామూళ్లోలు కాదండోయ్!) -
ఆత్మవిశ్వాసం కోసమే ఆంగ్లమాధ్యమ చదువులు
కన్యాశుల్కం నాటకంలో గురువు గిరీశం, శిష్యుడు వెంకటేశం పాత్రలు మన కింకా జ్ఞాపకం వుండే ఉంటాయి. శిష్యుడు వెంకటేశం తన తల్లిదండ్రులు అగ్నిహోత్రావధానులు, వెంకమ్మల ముందర ఇంగ్లిష్ పరిజ్ఞానం ప్రదర్శిం చటం కోసం గురుశిష్యులు ఇద్దరూ ‘ట్వింకిల్ టింక్విల్ లిటిల్ స్టార్‘ అని ఏదో ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నట్లుగా నాటకం ఆడటం... దాన్ని తల్లీ తండ్రీ అబ్బురంగా చూడటం ఇప్పటికీ ఈనాటి పెద్దల్లో చాలామందికి గుర్తుండే ఉంటుంది. వందేళ్ల క్రితమే ఇంగ్లిష్ (దొరల) భాషకు ఎంత క్రేజ్ ఉందో చెప్పటానికే ఈ ప్రస్తావన తప్ప, తెలుగు భాషను తక్కువ చేసి చూడటానికి మాత్రం కాదు. మాతృ భాషల ఎదుగుదలకు ఇంగ్లిషు అవరోధంగా మారిందన్నా, మాతృ భాషలు సంకరంగా మారుతున్నాయన్నా, శతాబ్ది పైగా ఎన్ని భాషా ఉద్యమాలు జరిగినా కూడా... ఇంగ్లిష్ భాషా ప్రాబల్యం దినదిన ప్రవర్ధమానంగా తన ప్రభావం పెంచుకుం టూనే ఉంది. గ్లోబలైజేషన్ ప్రభావం ఆంగ్ల భాషా ప్రభావాన్ని పెంచిందే తప్ప తగ్గించలేదు సరిగదా... విదేశాల్లో ఉద్యోగాల అవకాశాల కోసం మన యువత లక్షలాదిగా ఎగబాకటం మన కళ్ళ ముందున్న సజీవ చిత్రాలే! కానీ సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బడుగు బలహీన వర్గాల వారికి ఈ కాన్వెంట్ చదువులు నేటికీ అందని ద్రాక్ష పండ్లే. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చిన్న చిన్న కాన్వెంట్స్ సైతం ఇంగ్లిష్ విద్యా బోధనకే అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. గత ప్రభుత్వం హేతుబద్ధంగా క్షేత్ర స్థాయిలో విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా దిశగా విద్యా విధానాలు అమలుచేయకపోవడం వాస్తవం. కానీ ప్రస్తుతం ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంగ్లిష్ మీడియంతోపాటు తప్పని సరిగా ఒక తెలుగు సబ్జెక్టు అమలుపై కొందరు అనవసర రాద్దాంతం చేయటం విడ్డూరమే! ఇది బడుగు బలహీన వర్గాలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల చదువులకు దూరంచేయటం కాదా? ‘చదువుకోలేము! చదువు కొనలేమని’ దిగులుపడే తల్లిదండ్రులకు, విద్యార్థులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లిష్ మీడియం బడుల నిర్వహణా నిర్ణయం నిజంగా ఒక గొప్ప సంస్కరణే అని అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. దీంట్లో మాతృభాషకు అన్యాయం అనే మాటే లేదు, ఉన్నత చదువులు చదవాలనే విద్యార్థుల ఆలోచనలకు విఘాతమే లేదు, పైగా, చదవలేము, చదువు కొనలేమనే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనస్సులను ఆత్మన్యూనత నుండి ఆత్మవిశ్వాసంతో ఇది బలపరుస్తుంది. అందుకే నేటి ఏపీలో మాతృభాషకు విఘాతం కలుగనివ్వని ఇంగ్లిష్ మీడియం చదువుల బడులు ‘అందని మామిడి పండు’ కాదు ఈ నాటి ఈ చదువుల తల్లి, అందరికీ అందే మామిడి పండే’ అనేది ప్రతి ఒక్కరూ ఆహ్వానించే పరిణామమే! ఇది కచ్చితంగా ఆర్థికంగా వెనుకబడిన వారి పాలిట కల్పతరువే! విద్యా, వైద్యం, న్యాయం ప్రభుత్వాల అధీనంలో ఉంటేనే కదా ప్రజా క్షేమం పది కాలాల పాటు పరిఢవిల్లుతుందని పెద్దల మాట! అందులో మొదటిదైన చదువుకు సంబంధించి, ఏపీలో దాదాపు 45,000 పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 15,000కు పైగా పాఠశాలలు వేలాది కోట్ల రూపాయల ఖర్చుతో కొత్త సొబగులు దిద్దుకొని విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపటానికి స్వర్ణ వాద్యాలు సంరావిస్తూ సిద్ధమయ్యాయి. అలాగే రెండవ విడతలో మరో 15,000 ప్రభుత్వ పాఠశాలలు సిద్ధం కానున్నాయి. ఎటువంటి రాజకీయ సంకుచిత విమర్శలూ, హేళనలూ, ఎత్తిపొడుపు మాటలూ. అపసవ్య వార్తలు తమ పిల్లల అభివృద్ధిని కాంక్షించే తల్లిదండ్రుల మీద కనీసం ప్రభావం చూపలేదు సరి కదా.. ప్రభుత్వం చేతల్లో చేసి చూపిస్తున్న అభివృద్ధి బాటవైపే తమ పిల్లలను మళ్లిస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది! ఒక నూతన శకానికి ద్వారాలు తెరిచి, లక్షలాది విద్యార్థుల భవితవ్యానికి అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలలో ఈ విద్యాసంవత్సరంలో సీట్లు అయిపోయాయనే బోర్డులు కూడా కనిపిస్తున్నాయనే వార్తలు ఈ సందర్భంగా కొసమెరుపు! -అమరనాధ్ జాగర్లపూడి వ్యాసకర్త కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, ఫ్రీలాన్స్ రైటర్ మొబైల్ : 98495 45257 -
ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై సుప్రీంకోర్టు విచారణ
న్యూఢిల్లీ : ఏపీలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రతివాదులకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. జీ.ఓ 84పై హైకోర్టు ఇచ్చిన స్టేను ఏపీ ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. 95 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కోరుకోవటం సర్వేలో వెల్లడైందని, ఇంగ్లీష్ మీడియంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ( తల్లిదండ్రుల ఓటు ఇంగ్లిష్ మీడియానికే ) త్వరలో పాఠశాలలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో స్టేను తొలగించాలని విన్నవించారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, మండలానికి ఒక తెలుగు మీడియం పాఠశాల ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వం వాదనలను ఆలకించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. -
ఇంగ్లీష్ మీడియంపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుండి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని, ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ కొనసాగించాలని నిర్ణయించింది. తెలుగు మీడియం చదవాలనుకునే పిల్లల కోసం మండలానికి ఒక తెలుగు మీడియం స్కూలును ఏర్పాటు చేయనుంది. ఉర్థు, ఒరియా, కన్నడ, తమిళ మీడియం స్కూళ్లను యథాతథంగా కొనసాగిస్తూ ప్రతి మీడియం స్కూల్లోనూ తెలుగును తప్పనిసరి చేయాలని ఆదేశాలిచ్చింది. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు బస్సు ఛార్జీలు కూడా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
నేను మొదట్నుంచీ ఇంగ్లిషే : లోకేశ్
మంగళగిరి : తాను తొలినుంచీ ఇంగ్లిష్ మీడియంలోనే చదువుకున్నానని ఎమ్మెల్సీ నారా లోకేశ్ తెలిపారు. పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టింది తమ ప్రభుత్వమేనని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, మాతృభాషను కొనసాగించాలని కోరుతున్నామని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేశ్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులపై బలవంతంగా ఇంగ్లిష్ రుద్దడం సరికాదని అన్నారు. రెండు భాషలను కొనసాగించి, ఎంచుకునే అవకాశం తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఇవ్వాలని సూచిస్తున్నామన్నారు. -
‘ఇంగ్లిష్’ను వద్దంటున్నది కుహనా రాజకీయ నేతలే
సాక్షి, అమలాపురం : ఆంగ్ల బోధనను అడ్డుకుంటోంది కుహనా రాజకీయ నేతలేనని, ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లిష్ బోధన అమలును మేధావులందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు, ఉభయ రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్ అధ్యక్షతన బుధవారం ఉదయం మేధావుల సమావేశానికి సూర్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నీట్, ఐఐటీ, ఐఐఎం వంటి జాతీయ పోటీ పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా చేసేందుకు కొంత కాలంగా ఓ కుట్ర జరుగుతోందన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ప్రతి విద్యార్థి జాతీయ పోటీ పరీక్షలను ఇంగ్లిష్ పరంగా సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రాథమిక స్థాయి నుంచి ఆ బోధనను అందుబాటులో తీసుకువస్తున్నారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రెగ్యులేటరీ యాక్ట్ పేరుకే అమలు చేసి డీమ్డ్ యూనివర్సిటీలు, కార్పొరేట్ విద్యా సంస్థలకు అధిక ఫీజుల వసూళ్లకు మరింత కళ్లాలు ఇచ్చిందని ఆరోపించారు. ఆ విద్యా సంస్థలకే ఫీజుల దోపిడీకి పెద్ద పీట వేసిందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి సభకు అధిక సంఖ్యలో తరలిరావాలి ముమ్మిడివరం నియోజకవర్గ పర్యటనకు గురువారం ఉదయం ముఖ్యమంత్రి జగన్ వస్తున్న సందర్భంగా అక్కడ జరిగే సభకు శెట్టిబలిజ సామాజిక వర్గీయులు తరలిరావాలని సూర్యనారాయణరావు పిలుపునిచ్చారు. జగన్‌కు శెట్టిబలిజలు భారీ ఎత్తున స్వాగతం పలకాలని ఆయన సూచించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు మట్టపర్తి నాగేంద్ర, గుత్తుల శ్రీనివాసరావు, చప్పడి శోభన్‌బాబు, ఖాదర్, చీకురుమిల్లి కిరణ్‌కుమార్, అడపా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో ఇంగ్లీష్ క్లాసులు
వేసవిలో విద్యార్థులకు సెలవులు ఇస్తారు. కానీ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ఖాన్ కెమెరా ముందు ‘ఇంగ్లీష్ మీడియం’ క్లాసులను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. ఇర్ఫాన్‌ఖాన్, సాబా క్వామర్, దీపక్ డోబ్రియల్, షాయన్న పటేల్ ముఖ్య తారలుగా రూపొందిన ‘హిందీ మీడియం’ చిత్రం గతేడాది బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ అయింది. సాకేత్ చక్రవర్తి దర్శకుడు. ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనున్నట్లు ఆ మధ్య బాగానే ప్రచారం జరిగింది. అయితే ఇర్ఫాన్‌ఖాన్ క్యాన్సర్ చికిత్స కోసం లండన్ వెళ్లడంతో ‘హిందీ మీడియం’ సీక్వెల్ ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఆయన ముంబైకి తిరిగిరావడంతో సీక్వెల్‌పై మళ్లీ ప్రచారం ఊపందుకుంది. ఇర్ఫాన్ నటించేందుకు ఓకే చెప్పారని, సమ్మర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్. ఈ చిత్రానికి హోమి అడజానియా దర్శకత్వం వహిస్తారట. ఇందులో కథానాయిక పాత్ర కోసం రాధికా ఆప్టేను సంప్రదించగా ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాకు ‘ఇంగ్లీష్ మీడియం’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారని వినికిడి. ఇందులో ఇర్ఫాన్ కూతురిగా ‘పటఖా’ ఫేమ్ రాధిక మాదన్ కనిపిస్తారని సమాచారం. -
ఎవరేది అడిగినా ఇచ్చేయడమేనా?
సందర్భం మహాత్మా గాంధీ, సర్వేపల్లి రాధా కృష్ణన్, డా. సీహెచ్ హనుమంతరావు గారి లాంటి ఎందరో విజ్ఞులు, మేధావులు మాతృభాషలో విద్యాబోధన జరి గితేనే బాగుంటుందని దానికనుకూ లంగా ఎన్నో వ్యాసాలు రాశారు. కానీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలుగు మాధ్యమమే బాగుంటుందని నచ్చజెప్పకుండా, ‘‘వారు అడుగుతు న్నారు కనుక తెలుగు మాధ్యమాన్ని తీసివేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నాము’’ అంటూ ప్రభుత్వం వ్యవహరి స్తోంది. ఎవరు ఏ మాధ్యమంలో చదవదలచుకుంటే వారికి ఆ మాధ్యమమే ఇస్తామని అనడం సామాజిక న్యాయానికి, ‘‘సామా జిక హక్కు’’కు పూర్తిగా వ్యతిరేకం. ఈ నిర్ణయం కొందరికి మేలు చేసేదే కానీ మొత్తం సమాజానికి మేలు చేసేది కాదు. పాశ్చాత్య విద్యా విధానంలో ఆంగ్ల మాధ్యమం ద్వారా బోధన అనేది తగిన విద్యా విషయక వాతావరణం, క్రమశిక్షణ, మౌలిక వసతులు, బోధనా సిబ్బంది, నిధులు మున్నగునవి విద్యా సంస్థలకు సమకూర్చడం, సమ్మెలు–ఉద్యమాలు లేకుండా విద్యా సంవత్సరం సాఫీగా సాగే పరిస్థితులు వగైరా కల్పించడం లాంటి అనేకానేక అంశాలతో కూడినది. మరి మన విద్యా సంస్థల్లో, ముఖ్యంగా మన ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో అలాంటివన్నీ ఉన్నాయా? మరి పాశ్చాత్య దేశాలలోని విద్యా సంస్థల్లో వలె మెరుగైన విద్యా విధానాలను, అవసరాలను సమకూర్చకుండా దానిలోని ఒక్క అంశాన్నే (ఆంగ్ల మాధ్యమం) విడిగా తీసికొని ప్రవేశపెడితే అది ప్రభుత్వం వాంఛించే ఫలితాలనిస్తుందా మరి? ఒకప్పుడు ఇలాగే పాశ్చాత్య విద్యా విధానంలోని ఒకానొక అంశం మాత్రమే అయిన అంతర్గత మూల్యాంకనాన్ని (ఇంటర్నల్ ఎవాల్యుయేషన్) అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. కానీ, తక్కిన అంశాలు లేనందువలన అది ఘోరంగా విఫలమయింది. మిగతా మార్పులేవీ చేయకుండా ఈ ఒక్క మార్పునే చేబట్టడం వ్యర్థమని దానిని విశ్వవిద్యాలయాలు హడావుడిగా చెత్తబుట్టలో పారేశాయి. ఇప్పుడు మనం చేస్తున్న పని కూడా అలాంటిదే కదా? ప్రతి విద్యాసంస్థలో, ఆ సంస్థ ఏ స్థాయికి చెందిందో బేరీజు వేయకుండా ఆంగ్ల మాధ్యమాన్ని దానిలో ప్రవేశపెట్టి తిరిగి మనం అలాంటి పొరపాటే చేస్తున్నట్లు లెక్క. దీనివలన విద్యా నాణ్యత తరిగి, నిరుద్యోగం పెరిగి, వెంటనే కాకున్నా కొన్నాళ్లకైనా అసం తృప్తి, నిస్పృహ, నిరసన పెల్లుబికడం ఖాయం. తగినన్ని వసతులు కల్పిస్తూ మాతృభాషలో (లేదా ప్రాంతీయ భాషలో) విద్యా బోధన చేయటం ఉత్తమమయిందని అత్యధికుల అభిప్రాయం. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టదలచినా దానిని కొన్ని విద్యా సంస్థల్లో కొన్ని కోర్సుల్లో మాత్రమే ప్రవేశ పెడితే బాగుంటుందని; తొందరపడి అన్ని విద్యా సంస్థల్లో అన్ని కోర్సుల్లో ప్రవేశపెట్టి విఫలమవడం కంటే దశల వారీగా దానిని ప్రవేశపెడితే బాగుంటుందని అనుభవజ్ఞులు సూచిస్తున్నారు. ఈ విద్యావిషయాల గురించి ‘తెలుగు భాషా పరిరక్షణ సమితి’ కూడా అలాగే అభిప్రాయపడుతోంది. సమితి నిర్వహిం చిన ఎన్నో సదస్సుల్లో కూడా ఇదే అభిప్రాయం వెల్లడయింది, ఆ అభిప్రాయాన్ని అనుసరించి చర్యలు తీసుకోవడానికి ఇంకా వేళ మీరిపోలేదని ఈ వ్యాసం ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఆంగ్లంలో విద్యాబోధనతో సంభవించే కొన్ని ప్రమాదాలు : 1. ఒకేసారి ఇంగ్లిష్ భాష నేర్చుకోవడమంటే, దాని ద్వారా అన్ని సబ్జెక్ట్స్ చదువుకోవడమంటే ఎంతోమంది గ్రామీణుల, వెను కబడినవారి పిల్లలు వెనుకంజ వేయవచ్చు. 2. చేరినవారు మధ్య లోనే మానుకోవచ్చు 3. వారిలో చాలామంది ‘ఫెయిల్’ కావచ్చు 4. ఉత్తీర్ణులయిన వారిలో చాలామంది ఉన్నత చదువులకు, ఉన్నత ఉద్యోగాలకు పనికిరాకపోవచ్చు 5. ఆంగ్ల మాధ్యమం ద్వారా బోధించడానికి చాలా రోజుల వరకు తగినంతమంది అధ్యాప కులు లభించకపోవచ్చు 6. అదనంగా పుస్తకాలు, పత్రికలు మున్న గునవి ఇంగ్లిష్‌లో చదువజాలక, చదువనందున విద్యార్థులు వారి విద్యాప్రమాణాలు కోల్పోవచ్చు 7. విద్యాభారం చాలా పెరిగి పిల్లలు మానసిక ఒత్తిడికి గురై వారిలో కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవచ్చు. 8. ప్రభుత్వ రంగ విద్యాసంస్థల్లో ఉత్తీర్ణులు కానివారి సంఖ్య పెరగవచ్చు. దానివలన వారు ఉన్నత విద్య ప్రవే శాలకు మరియు ఉన్నత ఉద్యోగాలకు పనికిరాకుండా పోవచ్చు 9. తెలుగు ఒక భాషగా మాత్రమే నేర్పితే దానిని విద్యార్థులు అంతగా పట్టించుకోకపోవచ్చు. దానికి సంస్కృత భాషకు పట్టిన గతే పట్టవచ్చు 10. వసతుల, వనరుల, సౌకర్యాల వ్యత్యాసాల వలన విద్యాసంస్థల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైన విద్యా ప్రమాణాలు సంభవించవచ్చు. ఆంగ్లేయ మాధ్యమం ఇంటర్మీడియేట్ తదుపరి ప్రవేశపెట్టి సాంకేతిక విద్యలకు పరిమితం చేస్తే బాగుంటుందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లిష్ మీడియం వలన కష్టాల పాలయ్యేవారు చాలావరకు గ్రామీణ ప్రాంతాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకు చెందిన వారే. వారు ఆర్థికంగా, సాంఘి కంగా, సాంస్కృతికంగా ముందుండే నగరాల విద్యార్థులతో ఇంగ్లిష్ భాషలో పోటీ పడలేరు. అందువలన వారిపై పెట్టుబడి వ్యర్థమై వారి తల్లిదండ్రులు అప్పులపాలు కావచ్చు. వ్యాసకర్త గౌరవాధ్యక్షులు, తెలుగు భాషా పరిరక్షణ సమితి, తెలంగాణ రాష్ట్రం ‘ మొబైల్ : 98481 95959 డాక్టర్ వెల్చాల కొండలరావు -
‘ఆంగ్లా’నికి కట్టు‘బడి’..
♦ ‘సక్సెస్’తో కొత్త ఒరవడి ♦ ఆంగ్ల మాధ్యమానికి ఆహ్వానం ♦ బడుల రక్షణకు సర్కార్ యత్నాలు పాపన్నపేట: ఆంగ్ల మాధ్యమానికి పెరుగుతున్న ఆదరణను అనుకూలంగా మలుచుకుని సర్కార్ బడులను రక్షించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. 2016-17 విద్యా సంవత్సరంలో ఆసక్తిగల హెచ్ఎంలు, ఎస్ఎంసీలు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించుకోవడానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పాఠశాల విద్యా సంచాలకులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సక్సెస్ స్కూళ్లు సత్ఫలితాలు ఇస్తుండటంతో ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. జిల్లాలో సుమారు 2,900 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 6 నుంచి 10వ తరగతి వరకు సుమారు 168 సక్సెస్ పాఠశాలలు ఏర్పాటుచేసి, ఆంగ్ల మాద్యమంలో బోధన గావించారు. ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో సక్సెస్ పాఠశాలలు మెరుగైన ఉత్తీర్ణత శాతాన్ని సాధించాయి. అదనపు సౌకర్యాలు వద్దంటేనే.. ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో అదనపు సౌకర్యాలు కోరకుండా ఉంటే.. అక్కడ ఆంగ్ల మాద్యమాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఏ పాఠశాలలో అయితే ఆంగ్ల మాధ్యమాన్ని ఏర్పాటుచేయాలనుకున్నారో.. అక్కడ అదనపు గదులు, అదనపు టీచర్లు, అదనపు ఫర్నిచర్ కోరకూడదనే షరతును విధించారు. అలాంటి పాఠశాలల ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీల తీర్మానంలను జతచేసి ఆంగ్లమాధ్యమానికై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకు కొంతమంది ప్రధానోపాధ్యాయులు తమ సంసిద్ధతను తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రి ప్రైమరీ తరగతులుంటే సత్ఫలితాలు: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రి ప్రైమరీ తరగతులుంటే మంచి ఫలితాలు సాధించి ప్రభుత్వ బడులను కాపాడుకోవచ్చునని హెచ్ఎంలు భావిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంపై ఆసక్తి ఏర్పడిన నేటి తరుణంలో సామాన్యులు సైతం తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారు. అయితే మూడేళ్ల వయసులోనే నర్సరీలో చేరే చిన్నారులు 1వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చేరలేక అదే పాఠశాలలో తమ చదువులు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఐదేళ్ల వయస్సు వచ్చే వరకు నమోదు చేసుకునే అవకాశం లేనందున రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆంగ్ల మాధ్యమంలో ప్రిప్రైమరీ వ్యవస్థను ఏర్పాటుచేస్తే బడులు మూతపడకుండా ఉంటాయని అంటున్నారు. ప్రజలు ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల్లో చుక్కలన్నంటే ఫీజులు చెల్లించలేక అప్పులపాలవుతున్నారు. కనుక ఈ అవకాశాన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉపయోగించుకుంటే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.