English-Vinglish
-
‘మామ్’... శ్రీదేవి!
కొంతమంది తారలు ఏళ్ల తరబడి నటించినా బోర్ కొట్టరు. జీవితాంతం వాళ్లు నటించినా, చూడాలనుకునే ప్రేక్షకులు ఉంటారు. ఆ స్థాయి అభిమానం సంపాదించుకున్న తారల్లో శ్రీదేవి ఒకరు. పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన శ్రీదేవి దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత ‘ఇంగ్లిష్-వింగ్లిష్’ ఒప్పుకున్నప్పుడు ఆమె అభిమానులు సంబరపడిపోయారు. అన్నేళ్ల తర్వాత నటించినా శ్రీదేవి భేష్ అనిపించుకున్నారు. ఆ చిత్రం తర్వాత మళ్లీ చేస్తే మంచి సినిమానే చేయాలనుకున్న శ్రీదేవి ‘బాంబే టాకీస్’లో అతిథి పాత్ర చేశారు. గత ఏడాది తమిళ చిత్రం ‘పులి’లో మహారాణిగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా ‘మామ్’ అనే హిందీ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రవి ఉడయవర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల ఆరంభం కానుంది. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ అతిథి పాత్ర చేయనున్నారు. ఇది ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ అనీ, శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ నిర్మిస్తారనీ సమాచారం. సవతి తల్లి చుట్టూ తిరిగే ఈ చిత్ర కథలో కూతురి పాత్రకు కమల్‌హాసన్ రెండో కుమార్తె అక్షరా హాసన్‌ను తీసుకోవాలని అనుకుంటున్నట్లు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
పని మనిషి ఇంగ్లీష్-వింగ్లీష్ :చికాకులు హుష్!
ఆమె మాటలు విన్నవారందరూ కడుపుబ్బ నవ్వుకోవలసిందే. ఎప్పుడూ నవ్వకుడా భీష్మించుకుని కూర్చున్నవారైనా సరే మనసారా నవ్వితీరవలసిందే. ఆమె మాటలలో అంతటి శక్తి ఉంది. చికాకులతో ఉన్నవారికి ఆమె మాటలు మంచి మందులా పని చేస్తాయి. ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్న ఓ వీడియోలో ఓ పని మనిషి మాటలు ఎవరికైనా నవ్వు తెప్పిస్తాయి. అందుకు ఆమెకు అభినందనలు తెలుపవలసిందే. ఈ పని మనిషి మాట్లాడే ఇంగ్లీష్-వింగ్లీష్ చాలా వింతగా ఉంటుంది. తెలుగునే ఇంగ్లీష్ స్టైల్లో మాట్లాడుతుంది. ఆమె తన యజమానురాలుతో ముచ్చటించిన మాటలు మచ్చుకు కొన్ని: ఐ నో పనిచేసియా. టాబ్లెట్ మింగింగ్ యా. వాటర్‌తో తాగియా. వాట్ యా. బ్రెయిన్లో సెల్ నెంబర్ ఫీడింగ్ యా. మూవింగ్ చేస్తాను. కాజల్ అగర్వాల్ బాయ్ ఫ్రెండ్‌తో వచ్చిందియా. బ్యూటిఫుల్ కలర్.షి ఈస్ నథింత్ గొడుగు. షి జుట్టు కట్టింగ్ యా. షి ఈస్ నో శారీ. షి ఈస్ జీన్స్, టిషర్ట్. నాకు నచ్చినియా. ఓ మై గాడో, మైగాడో. మూవీస్‌లో నన్ను అడిగిండియా.... ఇలా సాగుతుంది ఆమె మాటల తీరు. వినవలసిందే గానీ రాయడం కుదరు. మన సినిమా దర్శకులు ఇంకా ఈ వీడియోని చూసినట్లు లేదు. వారు చూస్తే, ఆమెకు తప్పనిసరిగా తాము తీయబోయే సినిమాలో అవకాశం ఇస్తారు.ఆమెను సినిమాలోకి తీసుకుంటో మనకు ఓ కొత్త హాస్యనటి దొరికినట్లే. ఈ వీడియో ఫేస్బుక్లో పెట్టినవారికి అభినందనలు. మీరు కూడా ఈ వీడియోలు చూసి మనసారా నవ్వుకోండి. వీడియో - 1 Post by Sheila Chandrasekhar.