పని మనిషి ఇంగ్లీష్-వింగ్లీష్ :చికాకులు హుష్! | Female Maid English - Vinglish | Sakshi
Sakshi News home page

పని మనిషి ఇంగ్లీష్-వింగ్లీష్ :చికాకులు హుష్!

Published Wed, Sep 10 2014 1:47 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

పని మనిషి ఇంగ్లీష్-వింగ్లీష్ :చికాకులు హుష్! - Sakshi

పని మనిషి ఇంగ్లీష్-వింగ్లీష్ :చికాకులు హుష్!

ఆమె మాటలు విన్నవారందరూ కడుపుబ్బ నవ్వుకోవలసిందే. ఎప్పుడూ నవ్వకుడా భీష్మించుకుని కూర్చున్నవారైనా సరే  మనసారా నవ్వితీరవలసిందే.  ఆమె మాటలలో  అంతటి శక్తి ఉంది. చికాకులతో ఉన్నవారికి ఆమె మాటలు మంచి మందులా పని చేస్తాయి. ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్న ఓ వీడియోలో  ఓ పని మనిషి మాటలు ఎవరికైనా నవ్వు తెప్పిస్తాయి. అందుకు ఆమెకు అభినందనలు తెలుపవలసిందే. ఈ పని మనిషి మాట్లాడే ఇంగ్లీష్-వింగ్లీష్ చాలా వింతగా ఉంటుంది. తెలుగునే ఇంగ్లీష్ స్టైల్లో మాట్లాడుతుంది.

ఆమె తన యజమానురాలుతో ముచ్చటించిన మాటలు మచ్చుకు కొన్ని:   ఐ నో పనిచేసియా. టాబ్లెట్ మింగింగ్ యా. వాటర్తో తాగియా. వాట్ యా. బ్రెయిన్లో సెల్ నెంబర్ ఫీడింగ్ యా. మూవింగ్ చేస్తాను. కాజల్ అగర్వాల్ బాయ్ ఫ్రెండ్తో వచ్చిందియా. బ్యూటిఫుల్ కలర్.షి ఈస్ నథింత్ గొడుగు. షి జుట్టు కట్టింగ్ యా. షి ఈస్ నో శారీ. షి ఈస్ జీన్స్, టిషర్ట్. నాకు నచ్చినియా. ఓ మై గాడో, మైగాడో. మూవీస్లో నన్ను అడిగిండియా.... ఇలా సాగుతుంది ఆమె మాటల తీరు. వినవలసిందే గానీ రాయడం కుదరు.

మన సినిమా దర్శకులు ఇంకా ఈ వీడియోని చూసినట్లు లేదు. వారు చూస్తే, ఆమెకు తప్పనిసరిగా తాము తీయబోయే సినిమాలో అవకాశం ఇస్తారు.ఆమెను సినిమాలోకి తీసుకుంటో మనకు ఓ కొత్త హాస్యనటి దొరికినట్లే. ఈ వీడియో ఫేస్బుక్లో పెట్టినవారికి అభినందనలు. మీరు కూడా ఈ వీడియోలు చూసి మనసారా నవ్వుకోండి.
వీడియో - 1

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement