తెలంగాణ, ఏపీకి వేర్వేరు పర్యావరణ కమిటీలు
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పరిశ్రమలు, ప్రాజెక్టులకు పర్యావరణపరమైన అనుమతులు ఇచ్చేందుకుగాను వేర్వేరు పర్యావరణ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ‘బీ’ కేటగిరీ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులను ఇచ్చే రెండు కమిటీల కాలపరిమితి గతేడాది అక్టోబరు 25నే ముగిసింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో.. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత పర్యావరణ కమిటీల్లో సభ్యులుగా నియమించేందుకు నిపుణుల పేర్లను సూచిస్తామని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తమకు తెలిపిందని కేంద్ర పర్యావరణ శాఖ ఓ సర్క్యులర్లో వెల్లడించింది. ఇంతకుముందు ఏపీలో పర్యావరణ కమిటీలు లేని నేపథ్యంలో కేటగిరీ బీ ప్రాజెక్టులను కూడా కేటగిరీ ఏ కింద పరిగణించి తానే పర్యావరణ అనుమతులు జారీచేయాలని కేంద్రం నిర్ణయించింది.