ephedrine
-
పెళ్లి పత్రికల్లో మత్తు పదార్థాలు పెట్టి..
సాక్షి, బెంగళూరు : బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో భారీమొత్తంలో మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. పెళ్లిపత్రికల్లో రహస్యంగా తరలిస్తున్న రూ.5.05కోట్ల విలువైన ఎఫెడ్రిన్ అనే మత్తు మందును సీజ్ చేశారు. శనివారం 5.49 కేజీల డ్రగ్స్‌ను పెళ్లిపత్రికల్లో గుట్టుగా అమర్చి తరలిస్తుండగా కార్గో విభాగంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.మదురైకి చెందిన వ్యక్తి డ్రగ్స్ దాచిన 43 శుభలేఖలను ఆస్ట్రేలియాకు తరలిస్తున్నాడు. కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా పత్రికల మధ్య అమర్చిన ఎఫెడ్రిన్ ప్యాకెట్లు బయటపడ్డాయి. 18న రూ.5 కోట్ల డ్రగ్స్ పట్టివేత ఇదే కార్గో విభాగంలో ఈ నెల 18న బట్టలు కుట్టే యంత్రంలో రూ.5 కోట్ల ఖరీదైన ఎఫెడ్రిన్‌ను రవాణా చేస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడడం కలవరపరుస్తోంది. దీంతో కస్టమ్స్ అధికారులు మరింత లోతుగా తనిఖీలు చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లో నిందితులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. తరచుగా డ్రగ్స్ రవాణా కేసులు బయటపడడం చూస్తుంటే మత్తు రవాణాకు దుండగులు బెంగళూరు ఎయిర్‌పోర్టును ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల్లో తనిఖీలను ముమ్మరం చేయడంతో ఇక్కడి నుంచి స్మగ్లింగ్‌కు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం కార్గో నుంచి మలేషియా వెళ్తున్న లగేజిలో ఎపిడ్రిన్ అనే మత్తుపదార్థం(డ్రగ్) ఉన్న కస్టమ్స్ అధికారుల సోదాల్లో గురువారం బయటపడింది. ఈ డ్రగ్స్‌ను చిన్న పిల్లల బ్యాగులో పెట్టి అక్రమంగా రవాణా చేస్తున్నారు. 35 బ్యాగుల్లో ఉన్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో నార్కొటిక్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి సింగపూర్, హంకాంగ్, శ్రీలంక తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రాజేంద్రనగర్‌లో కిలో ఎపిడ్రిన్ పట్టివేత
హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. ముంబై కేంద్రంగా హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎపిడ్రిన్ అనే ప్రమాదకరమైన డ్రగ్‌ను నగరంలో విక్రయించేందుకు తరలిస్తుండగా.. రాజేంద్రనగర్ వద్ద స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న కిలో ఎపిడ్రిన్ డ్రగ్‌కు అంతర్జాతీయ మార్కెట్లో 10లక్షల రూపాయలకు పైగా ధర ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో తరచు హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా నైజీరియన్ ముఠాలు ఎక్కువగా ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.