రాజేంద్రనగర్లో కిలో ఎపిడ్రిన్ పట్టివేత | Police seize ephedrine at Rajendra Nagar | Sakshi
Sakshi News home page

రాజేంద్రనగర్లో కిలో ఎపిడ్రిన్ పట్టివేత

Published Fri, Nov 8 2013 6:21 PM | Last Updated on Fri, May 25 2018 2:11 PM

Police seize ephedrine at Rajendra Nagar

హైదరాబాద్‌లో మరో డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టయింది. ముంబై కేంద్రంగా హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎపిడ్రిన్‌ అనే ప్రమాదకరమైన డ్రగ్‌ను నగరంలో విక్రయించేందుకు తరలిస్తుండగా.. రాజేంద్రనగర్‌ వద్ద స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ పోలీసులు పట్టుకున్నారు.

ఈ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న కిలో ఎపిడ్రిన్‌ డ్రగ్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో 10లక్షల రూపాయలకు పైగా ధర ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో తరచు హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా నైజీరియన్ ముఠాలు ఎక్కువగా ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement