Epidemic season
-
శతాబ్దానికో మహమ్మారి!
ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల శతాబ్దానికో అంటువ్యాధి ప్రబలుతుందనేది ఓ నమ్మిక. గత ఘటనలను ఒకసారి అవలోకనం చేసుకుంటే ఇది నిజమేనని నమ్మేందుకు తగిన ఆధారాలున్నాయి. ప్రస్తుతం కోవిడ్(కరోనా వైరస్) మాదిరిగానే 1720, 1820, 1920లలో కూడా ప్రపంచాన్ని అంటువ్యాధులు కుదిపేశాయి. వేలాదిమందిని పొట్టనబెట్టుకున్నాయని పరిశోధకులంటున్నారు. దీనిని బట్టి చూస్తే, స్వార్థం కోసం ఎవరైనా కావాలనే వీటిని సృష్టించి జనంపైకి వదులుతున్నారా? అనే అనుమానం కూడా వస్తుంది. ఇంకా మున్ముందు ఎలాంటి వ్యాధులు వస్తాయోననే భయం కలగకమానదని ‘ఏలియన్ న్యూస్’ అనే వెబ్ మీడియా పేర్కొంది. 1720లో ప్లేగు 1720లలో యూరప్ ప్రజలను బ్యుబోనిక్ ప్లేగ్ కలవరపెట్టింది. ఫ్రాన్సులోని మర్సెయిల్స్లో బయటపడిన ఈ వ్యాధి ఒక్క ఆ నగరంలోనే 50వేల మందిని బలి తీసుకుంది. మొత్తమ్మీద ఫ్రాన్సు వ్యాప్తంగా లక్ష మంది ఈ వ్యాధితో చనిపోయారు. 1820లో కలరా యూరప్‌ను అతలాకుతలం చేసిన ప్లేగుకు వందేళ్లు పూర్తవుతుండగానే కలరా ఆసియా దేశాలను కబళించింది. ఫిలిప్పైన్స్, థాయ్‌లాండ్, ఇండోనేసియా దేశాల్లో ఈ వ్యాధి కూడా లక్ష మంది ఉసురుతీసింది. కలరా బ్యాక్టీరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారినపడ్డారు. 1920లో స్పానిష్ ఫ్లూ ఇటీవల కాలంలో ప్రపంచానికి బాగా పరిచయమైన పేరు స్పానిష్ ఫ్లూ. 100 కోట్ల మంది ఈ బారినపడగా ఒక కోటి మంది మృత్యువాతపడ్డారు. మానవ జాతి చరిత్రలోనే పెనువిషాదం మిగిల్చిన భయంకర వ్యాధి ఇది. 2020లో కోవిడ్ స్పానిష్ ఫ్లూ వచ్చిన వందేళ్ల తర్వాత చైనాలో కరోనా వైరస్ విజృంభించింది. రోజులు గడిచేకొద్దీ ఈ వ్యాధి వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయ సమాజాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. -
వైద్య నారాయణులేరీ...?
- పెదబయలు పీహెచ్సీలో వైద్యాధికారి కరువు - గోమంగి, రూడకోటకు ఇన్‌చార్జిలే దిక్కు - వారానికో రోజే వైద్యుల దర్శనం - మౌలిక సదుపాయాలు లేవు పెదబయలు : మన్యంలోని గిరిజనులకు వైద్యసేవలు మరింత చేరువగా అందించే లక్ష్యంగా ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు, మౌలిక సదుపాయాల కొరత పీడిస్తోంది. పెదబయలు పీహెచ్సీలో 10 రోజుల నుంచి వైద్యాధికారి లేరు. గోమంగి, రూడకోట పీహెచ్‌సీల్లో ఇన్చార్జి వైద్యులు ఉన్నారు. గోమంగి పీహెచ్సీ వైద్యాధికారి మూడు పీహెచ్‌సీల్లో, రూడకోట వైద్యాధికారి రెండు పీహెచ్‌సీల్లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఏ ఒక్క చోటా పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించే పరిస్థితి లేదు. ప్రస్తుత ఎపిడమిక్ సీజన్లో కూడా పీహెచ్సీ వైద్యులు లేకపోవడంతో మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెదబయలు పీహెచ్సీ స్లాబు నుంచి వర్షాలకు నీరు లీకేజీ అవుతుంది. రోగులకు సరిపడిన బెడ్లు, బెంచీ లు, రన్నింగ్ వాటర్ సదుపాయం వంటివి కానరావు. గోమంగి పీహెచ్సీలో ప్రారంభం నుంచి నీటి సదుపాయం, విద్యుత్ సదుపాయం లేదు. పూర్తి స్థాయి వైద్యాధికారి లేరు. రూడకోట పీహెచ్సీలో నీటి నీటి ఎద్దడి, పూర్తి స్థాయి వైద్యాధికారి, సిబ్బం ది కొరత ఉంది.ఆస్పత్రిలో స్టాఫ్‌నర్స్ , ఎల్టి మా త్రమే విధులు నిర్వహిస్తున్నారు. గత నెలలోనే పె దబయలు, మారుమూల రూడకోట పీహెచ్‌సీలకు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, ఐటీడీఏ పీవోను కలిసిన రూడకోట గ్రామస్తులు పూర్తి స్థాయి వైద్యాధికారిని నియమించాలని కోరా రు. దీనికి కలెక్టర్ స్పందించి వారం రోజుల్లో నియమిస్తానని హామీ ఇచ్చారు. అయితే మూడు వారాలు గడిచినా వైద్యాధికారి రాలేదు. ఇప్పటికైన అధికారులు స్పందించి మూడు పీహెచ్‌సీల్లో పూర్తి స్థాయి వైద్యులు, పీహెచ్‌సీల్లో మౌలిక సదుపాయాలు, కల్పించాలని మండల వాసులు కోరుతున్నారు. పూర్తి స్థాయి వైద్యుల్ని నియమించాలి పెదబయలు, గోమంగి, రూడకోట పీహెచ్‌సీల్లో ఎపిడమిక్ సీజన్లో వైద్యులు లేకపోవడం విచారకరం. అలాగే పీహెచ్‌సీల్లో రోగులకు కనీస సదుపాయాలు లేవు. సిబ్బంది కొరత ఉంది. 24 గంటల ఆస్పత్రిలో వైద్యాధికారి లేరు. రెండు రోజుల వ్యవధిలో వైద్యాధికారిని నియమిస్తామని ఐటీడీఏ పీవో హామీ ఇచ్చారు. వారం రోజులైనా వైద్యాధికారి రాలేదు. - సల్లంగి ఉమామహేశ్వరరావు, ఎంపీపీ, పెదబయలు మండలం -
విధులకు డుమ్మా కొడితే చర్యలు
వైద్యులకు కలెక్టర్ సౌరభ్‌గౌర్ హెచ్చరిక సీతంపేట, న్యూస్‌లైన్: వైద్యాధికారులు పీహెచ్‌సీల పని వేళల్లో విధులకు డుమ్మా కొడితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ హెచ్చరించారు. గురువారం ఐటీడీఏలో ఎస్పీహెచ్వోలు, ఐసీడీఎస్ పీవోలు, ఐకేపీ సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా పీహెచ్‌సీల్లో వైద్యులు విధులకు హాజరు కావడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై అటువంటి పరిస్థితి లేకుండా చూసుకోవాలన్నారు. ఎక్కడెక్కడ వైద్యపోస్టులు ఖాళీగా ఉన్నాయో వాటి భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రానున్న ఎపిడమిక్ సీజన్లో అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. డయేరియా ఇతర వ్యాధులతో ఎక్కడా మరణాలు ఉండకూడదన్నారు. హైరిస్క్ గ్రామాల్లో సింథటిక్ ఫైరాత్రిన్ పిచికారి జరగాలని, గిరిజన వసతిగృహాల్లో కూడా స్ప్రేయింగ్ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ ఆపరేషన్‌కు ఎన్ని కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయో వారికి శస్త్రచికిత్స చేసే ఏర్పాట్లు చేయాలన్నారు. మాతాశిశు మరణాలు లేకుండా చూడాలన్నారు. నిధులు దుర్వినియోగం చేస్తే క్రిమినల్ చర్యలు మండల మహిళా సమాఖ్య (ఎంఎంఎస్) నిధులను దుర్వినియోగం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఐకేపీ, ఎంపీడీవోలతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడారు. టీపీఎంయూ పరిధిలోని ఏడు మండలాల్లో ఐకేపీ పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఎంఎస్‌ల సమావేశానికి ఎంపీడీవోలు హాజరుకావాలన్నారు. పోషకాహార కేంద్రాల పనితీరు కూడా సక్రమంగా లేదని, దీనిపై దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో ఎన్.సత్యనారాయణకు సూచించారు. ఐకేపీ, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాని, ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజి లక్ష్యాలు పూర్తిచేయాలన్నారు. స్థానిక వైటీసీలో నిరుద్యోగ యువతకు ఎక్కువమందికి శిక్షణ ఇప్పించాలన్నారు. సమావేశంలో జేసీ వీరపాండ్యన్, డ్వామా పీడీ కల్యాణ్‌చక్రవర్తి, ఐసీడీఎస్ పీడీ చక్రధర్, డీఎంహెచ్‌వో గీతాంజిలి పాల్గొన్నారు.