విధులకు డుమ్మా కొడితే చర్యలు | If funds are abused take criminal acts | Sakshi
Sakshi News home page

విధులకు డుమ్మా కొడితే చర్యలు

Published Fri, May 23 2014 2:26 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

If funds are abused take criminal acts

వైద్యులకు కలెక్టర్ సౌరభ్‌గౌర్ హెచ్చరిక

సీతంపేట, న్యూస్‌లైన్: వైద్యాధికారులు పీహెచ్‌సీల పని వేళల్లో విధులకు డుమ్మా కొడితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ హెచ్చరించారు. గురువారం ఐటీడీఏలో ఎస్‌పీహెచ్‌వోలు, ఐసీడీఎస్ పీవోలు, ఐకేపీ సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా పీహెచ్‌సీల్లో వైద్యులు విధులకు హాజరు కావడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై అటువంటి పరిస్థితి లేకుండా చూసుకోవాలన్నారు. ఎక్కడెక్కడ వైద్యపోస్టులు ఖాళీగా ఉన్నాయో వాటి భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

రానున్న ఎపిడమిక్ సీజన్లో అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. డయేరియా ఇతర వ్యాధులతో ఎక్కడా మరణాలు ఉండకూడదన్నారు. హైరిస్క్ గ్రామాల్లో సింథటిక్ ఫైరాత్రిన్ పిచికారి జరగాలని, గిరిజన వసతిగృహాల్లో కూడా స్ప్రేయింగ్ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ ఆపరేషన్‌కు ఎన్ని కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయో వారికి శస్త్రచికిత్స చేసే ఏర్పాట్లు చేయాలన్నారు. మాతాశిశు మరణాలు లేకుండా చూడాలన్నారు.
 
నిధులు దుర్వినియోగం చేస్తే క్రిమినల్ చర్యలు
మండల మహిళా సమాఖ్య (ఎంఎంఎస్) నిధులను దుర్వినియోగం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఐకేపీ, ఎంపీడీవోలతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడారు. టీపీఎంయూ పరిధిలోని ఏడు మండలాల్లో  ఐకేపీ పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఎంఎస్‌ల సమావేశానికి ఎంపీడీవోలు హాజరుకావాలన్నారు. పోషకాహార కేంద్రాల పనితీరు కూడా సక్రమంగా లేదని, దీనిపై దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో ఎన్.సత్యనారాయణకు సూచించారు. ఐకేపీ, ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాని, ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజి లక్ష్యాలు పూర్తిచేయాలన్నారు. స్థానిక వైటీసీలో నిరుద్యోగ యువతకు ఎక్కువమందికి శిక్షణ ఇప్పించాలన్నారు. సమావేశంలో జేసీ వీరపాండ్యన్, డ్వామా పీడీ కల్యాణ్‌చక్రవర్తి, ఐసీడీఎస్ పీడీ చక్రధర్, డీఎంహెచ్‌వో గీతాంజిలి పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement