EPS-95
-
ఈపీఎస్ పెన్షనర్లకు శుభవార్త.. ఇక ముందుగానే ఖాతాలోకి పెన్షన్!
ఈపీఎస్-95 పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ శుభవార్త తెలిపింది. ఇక నుంచి ఈపీఎఫ్ పెన్షనర్లు ప్రతి నెలా చివరి రోజున పెన్షన్ పొందనున్నట్లు సంస్థ పేర్కొంది. పెన్షన్ కోసం పింఛనుదారులు ప్రతినెలా 1 లేదా 5వ తేదీ వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ నెల చివరిన రెండు రోజుల ముందుగానే పెన్షనర్ల బ్యాంకు ఖాతాలో డబ్బులో పడేలా పీఎఫ్ కమిసనర్ విశాల్ అగర్వాల్ ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకులకు విధి విధానాలను జారీ చేయాలని రీజనల్ పీఎఫ్ ఆఫీసులకు సూచించారు. పెన్షన్ చెల్లించే బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో ఇలా.. "పెన్షన్ డబ్బులు ప్రతినెలా 1 లేదా 5వ తేదీన కాకుండా నెలా చివరి రోజున(ఆ నెలకు ముందు) పెన్షన్ క్రెడిట్ చేయనున్నట్లు" ఉంది. చాలామంది పింఛనుదారులకు పెన్షన్ డబ్బులు గడువు తేదీన ఖాతాలో క్రెడిట్ కాకపోవడంతో ఈపీఎస్ పెన్షనర్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని పెన్షన్ డివిజన్ సమీక్షించింది. ఆర్బిఐ ఆదేశాలకు అనుగుణంగా అన్ని రీజనల్ ఆఫీసులు నెల చివరి పనిదినం నాడు లేదా అంతకు ముందు పెన్షనర్ ఖాతాలో నగదు క్రెడిట్ చేసే విధంగా బ్యాంకులకు సూచించాలని తెలిపింది. ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 80 లక్షల మంది పెన్షన్ దారులకు మేలు జరగనుంది. తాజా నిబంధనలతో వారికి ముందుగానే పెన్షన్ అకౌంట్లో జమ అవుతుంది. ఉద్యోగుల పెన్షన్ స్కీం 1995 (ఈపీఎస్-95) పెన్షనర్లు అందరూ కూడా పెన్షన్ పొందడం కోసం ప్రతి సంవత్సరం జీవన్ ప్రమాన్ పత్రం(జెపిపి) లేదా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక పెన్షన్ విషయంలో పెన్షన్దారులకు మేలు చేసేలా ఈపీఎఫ్ఓ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. కనీస పెన్షన్ పెంచే దిశగా ఆలోచిస్తోంది. (చదవండి: ప్లీజ్.. సాయం చేయండి: చైనా పంచన చేరిన తాలిబన్లు) -
పెన్షనర్లకు బంపర్ బొనాంజ
న్యూఢిల్లీ : పెన్షనర్లకు బంపర్ బొనాంజ దక్కబోతోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద నెలవారీ అందించే చెల్లింపులను ప్రభుత్వం రెట్టింపు చేయబోతోందని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి చెప్పారు. రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతుంది. దీంతో సుమారు 40 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. ఒకవేళ ఇది కనుక అమల్లోకి వస్తే, ప్రభుత్వంపై వార్షికంగా రూ.3000 కోట్ల భారం పడనుంది. ఈపీఎస్ కింద కనీస నెలవారీ పెన్షన్ వెయ్యి రూపాయలు ఇవ్వాలని 2014లో కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం దీని రెండింతలు చేస్తుండటంతో, ఇక నుంచి కనీసం రెండు వేల రూపాయలను పెన్షనర్లు అందుకోబోతున్నారు. ఈపీఎస్ పెన్షన్ రెండింతలు చేస్తున్న నేపథ్యంలో దీని ఖర్చును, లబ్దిదారుల సంఖ్యను లెక్కించాలని ఈపీఎఫ్ఓను కార్మిక మంత్రిత్వశాఖ ఆదేశించినట్టు సీనియర్ అధికారి చెప్పారు. ఈపీఎఫ్ఓ త్వరలోనే ఈ పెన్షన్ను రెండింతలు చేస్తూ తుది నిర్ణయం ప్రకటించనుందని తెలిపారు. ఈపీఎస్-95 కింద 60 లక్షల మంది పెన్షనర్లున్నారు. వారిలో నెలవారీ రూ.1500 కంటే తక్కువ పెన్షన్ తీసుకుంటున్న వారు 40 లక్షల కంటే తక్కువే. వీరిలో కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ తీసుకునేది 18 లక్షలు మంది. కనీస నెలవారీ చెల్లింపులను రూ.3000-రూ.7500కు పెంచాలని ఎంతో కాలంగా ట్రేడ్ యూనియన్లు, ఆల్ ఇండియా ఈపీఎస్-95 పెన్షనర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. పార్లమెంటరీ ప్యానల్ కూడా ఈపీఎస్-95 అసెసీలకు అందించే నెలవారీ కనీస పెన్షన్ రూ.1000ను పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిత్యావసరాలు తీర్చేలా సామాజిక భద్రత ప్రయోజనాలుండాలని తెలిపింది. ఈపీఎఫ్ స్కీమ్ కింద సభ్యులైన ఎంప్లాయీస్ ఆటోమేటిక్గా ఈపీఎస్ స్కీమ్ కింద ఎన్రోల్ అవుతారు. -
నెలవారీ కనీస పెన్షన్ రూ.7500...
సాక్షి, న్యూఢిల్లీ : పెన్షనర్ల బాడీలో సుమారు లక్ష మంది ఫించన్దారులు గురువారం పార్లమెంట్ వరకు ఆందోళన యాత్ర చేపట్టబోతున్నారు. వీరి డిమాండ్లను నెరవేర్చాలంటూ కోరుతూ వీరు ఈ ఆందోళన చేపడుతున్నారు. దీనిలో కనీస పెన్షన్ రూ.7,500కు పెంచాలని ప్రధానమైన డిమాండ్. దేశవ్యాప్తంగా ఉన్న పదవీ విరమణ ఉద్యోగులకు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995(ఈపీఎస్-95) కింద కనీస పెన్షన్ రూ.7500కు పెంచాలని ఈపీఎస్-95 జాతీయ ఆందోళన కమిటీ కోరుతోంది. ప్రస్తుతం ఫించన్దారులకు నెలవారీ పెన్షన్ రూ.1000గానే ఉంది. కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ప్రధాన కార్యాలయం వల్ల ఈపీఎస్-95లోని సభ్యులందరూ మూడు రోజుల నిరాహార దీక్ష చేపడుతున్నామని, ఒకవేళ తమ డిమాండ్లను నెరవేర్చకపోతే, డిసెంబర్ 7న రామ్లీలా గ్రౌండ్ నుంచి పార్లమెంట్ వరకు ఆందోళన యాత్ర చేపట్టనున్నట్టు సోమవారం ఈపీఎస్-95 చీఫ్ కో-ఆర్డినేటర్ వీరేంద్ర సింగ్ తెలిపారు. ఈపీఎస్-95 కింద సుమారు 60 లక్షల మంది పెన్షనర్లున్నారు. వీరిలో 40 లక్షల మంది నెలకు రూ.1500 కంటే తక్కువ పెన్షనే పొందుతున్నారు. మిగతా వారు గరిష్టంగా రూ.2000 నుంచి రూ.2500 మధ్యలో పెన్షన్ అందుతోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రన్ చేసే సామాజిక భద్రత పథకాల్లో ఈపీఎస్-95 కూడా ఒకటి. తమ ఈ సమస్య రెండేళ్ల నుంచి చర్చనీయాంశంగానే ఉందని పెన్షనర్ల బాడీ తెలిపింది. -
వారంలోగా అమల్లోకి వెయ్యి పెన్షన్
న్యూఢిల్లీ: భవిష్యనిధి వినియోగదారులు ఈ వారంలోనే నెలకు వెయ్యి రూపాయల కనీస పింఛన్ పొందనున్నారు. ఈ మేరకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీంతో దాదాపు 28 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. వీరికి ప్రస్తుతం రూ. వెయ్యి కన్నా తక్కువ పెన్షన్ అందుతోంది. ఏప్రిల్ 1 నుంచి అమలయ్యేలా నెలకు వెయ్యి రూపాయల పింఛన్ అందించాలని గత యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనివల్ల భవిష్యనిధి సంస్థపై రూ.1,217 కోట్ల అదనపు భారం పడనుంది. అయితే ఇటీవలి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం అమలు కాలేదు. తాజాగా దీనికి సంబంధించి కేంద్ర కార్మిక శాఖ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశమున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే వేతన పరిమితిని రూ.6,500 నుంచి రూ. 15వేలకు పెంచడం, ఈపీఎఫ్వోకు సంస్థలు చెల్లించే పాలనా చార్జీలను తగ్గించడం వంటి నిర్ణయాలను కూడా కేంద్రం నోటిఫై చేయనుంది. దీంతో ఈ వారంలోనే ఈ నిర్ణయాలు అమలయ్యే అవకాశముంది.