ప్రియురాలు 'నో' చెప్పిందని ఫేస్బుక్ లైవ్లో..
ఉస్మానియే: 'మన ప్రేమ వీరగాథ. ఒకరికోసం ఒకరం ఎప్పుడూ కన్నీళ్లు కార్చలేదు. నిజంగా నువ్వు నన్ను వీడి పోతున్నావా? నువ్వు లేకుంటే నేను కాలిపోనా?' అంటూ ఫేస్బుక్ లైవ్లో ప్రియురాలికి కవిత వినిపించిన ప్రియుడు.. తుపాకితో తనను తాను కాల్చుకుని ప్రాణాలు వదిలాడు. టర్కీలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేస్ బుక్ వినియోగదారుల్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది.
ఎర్డొగాన్ సెరెన్ అనే 22 ఏళ్ల యువకుడు టర్కీ దక్షిణ ప్రాంతంలోని ఉస్మానియే ఫ్రావిన్స్ లో కుటుంబంతో కలిసి ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నాడు. శుక్రవారం ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తనను ఎవరూ గుర్తించడం లేదని, ప్రేమించిన అమ్మాయీ తిరస్కరించిందని చెప్పుకొచ్చాడు. ప్రేయసి దూరమైతేగనుక చనిపోతానని ఫ్రెండ్స్ తో చాలా సార్లు చెప్పానని, అయితే ఎవ్వరూ తన మాటలను నమ్మేవారు కాదని, తనది నిజమైన ప్రేమ అని నిరూపించుకునేందుకే ఈ పని చేస్తున్నానంటూ ఎర్డొగాన్ కడుపులో తుపాకితో కాల్చుకున్నాడు. కాల్పుల శబ్ధం తర్వాత ఫేస్ బుక్ లైవ్ ఆగిపోయింది. తుపాకి పేలుడు శబ్దం విన్న కుటుంబసభ్యులు పరుగుపరుగున అతని గదికి వెళ్లేసరి రక్తపు మడుగులో కనిపించాడు. ఆసుపత్రికి తరలించిన కొద్ది గంటలకే ఎర్డొగాన్ ప్రాణాలు విడిచాడు. లైవ్ లో ప్రసారమైన సంచలనాత్మక దృశ్యాలను తొలిగించినట్లు ఫేస్ బుక్ సంస్థ ప్రకటించింది.