కోల్గేట్ నుంచి ‘పెయిన్ ఔట్’ ఉత్పత్తి
హైదరాబాద్: కోల్గేట్ పామోలివ్ (ఇండియా) తాజాగా ‘పెయిన్ ఔట్’ ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకువచ్చింది. నొప్పి ఉన్న పంటిపై ఒక చుక్క ‘పెయిన్ ఔట్’ను ఉంచితే తాత్కాలికంగా తక్షణ ఉపశమనం పొందొచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చాలా మంది పంటి నొప్పితో బాధపడుతున్నారని, ఇది ఎటువంటి ముందస్తు సూచన లేకుండా వస్తుందని, అలాంటి సమయాల్లో ‘పెయిన్ ఔట్’ ప్రాథమిక నొప్పి నివారణ కోసం ఉపయోగపడుతుందని పేర్కొంది. వినియోగదారులకు మరింత చేరువకావడానికి ‘పెయిన్ ఔట్’ ఉత్పత్తి తమకెంతో ఉపయోగపడుతుందని కోల్గేట్ పామోలివ్ (ఇండియా) మార్కెటింగ్ డెరైక్టర్ ఎరిక్ జంబర్ట్ తెలిపారు.