Erode district
-
కుప్పకూలిన భవనం.. అర్థరాత్రి ఆర్తనాదాలు
సాక్షి, చెన్నై: పంటలను సంతలో అమ్ముకునేందుకు వచ్చిన రైతులు ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఈరోడ్ జిల్లా అందియూరులోని రథం వీధిలో ప్రతి సోమవారం సంత జరుగుతుంది. రైతులు పంటలను అమ్ముకోవడానికి ఇక్కడికి వస్తారు. ఈ క్రమంలో బర్గూర్ అటవీ గ్రామ రైతులు ఏడుగురు ఆదివారం రాత్రి అందియూరు చేరుకున్నారు. ఓ ఎలక్ట్రిక్ దుకాణం వద్ద నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఆ భవనం కూలింది. స్థానికులు ఆందోళనతో పరుగులు తీశారు. శిథిలాల కింద మృతదేహాలు.... సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. చీకటి కావడంతో శిథిలాలు మీద పడటంతో మృతదేహాలను వెలికి తీయడం కష్టతరమైంది. ప్రొక్లయినర్ వాహనాలను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. బర్గూర్ తట్టకలైకు చెందిన సిద్ధన్(51), చిన్న సొంగాలల్తైకు చెందిన మామహాదేవన్ (48), చిన్న పయ్యన్ (27) మృతదేహాలను వెలికి తీశారు. తీవ్రంగా గాయపడిన రాజేష్(30), శివమూర్తి (45), మహేంద్రన్ (17)తో పాటు మరొకరిని అందిరయూరు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఈరోడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమ్తితం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, చెన్నై : కూలిలను తరలిస్తున్న వాహనం అందియూరు కొండల్లో ఆదివారం ఉదయం బొల్తా పడింది. ఓవర్ లోడింగ్‌తో వెళ్తున్న ఈ వాహనం అదుపు తప్పి బొల్తా పడటంతో నలుగురు కూలీలు సంఘటనా స్థలంలో మరణించారు. మరో 11 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈరోడ్ జిల్లా అందయూరు సమీపంలోని బర్గూర్ కొండ మార్గంలో ప్రైవేటు వ్యక్తులకు చెందిన అనేక తోటలు ఉన్నాయి. ఇక్కడ పనిచేసే కూలీలను ప్రతి రోజూ వాహనాల్లో తరలిస్తుంటారు. ఆదివారం ఉదయం తంబురెడ్డి పట్టి గ్రామానికి చెందిన పదిహేను మంది కూలీలలతో టాటా సుమో వాహనంలో బయలు దేరింది. సామర్థ్యానికి మించి ఓవర్ లోడింగ్‌తో కొండ మార్గంలో వెళ్తున్న ఈ చిన్న వాహనం మణియాచ్చి పల్లం వద్ద అదుపు తప్పింది. కొండ మీద నుంచి ఫల్టీ కొడుతూ, కిందున్న రోడ్డు మీద అడ్డంగా వచ్చి పడింది. ఆ వాహనంలో ఉన్న కూలీలు చెల్లా చెదురయ్యారు. దట్టమైన పొదళ్లతో నిండిన ఈ మార్గంలో ఎవరు ఎక్కడ పడ్డారో అన్నది అంతు చిక్కని పరిస్థితి. అటు వైపుగా వచ్చిన వాహన దారులు 108కు సమాచారం ఇచ్చారు. అయితే, కొండ మార్గంలోకి అంబులెన్స్ రావడం కష్టతరంగా మారింది. అతి కష్టం మీద అక్కడికి చేరుకున్న అంబులెన్స్ వాహనాలు, పోలీసు వాహనాల్లో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం అందియూరు, బర్గూర్ ఆస్పత్రులకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఈరోడ్‌లోని పలు ప్రైవేటు ఆస్పత్రులకు గాయపడ్డ వాళ్లను తరలించారు. అయితే, సంఘటనా స్థలంలోనే తంబురెడ్డి పట్టి గ్రామంకు చెందిన దేవరాజ్(45), చిక్కన్న(45), తోటప్పి (45), జగన్(35)లు మరణించారు. మిగిలిన 11 మంది తీవ్ర చికిత్స సాగుతున్నది. ఈ ప్రమాద సమాచారంతో తంబురెడ్డి పట్టి లో విషాదం నెలకొంది. -
మహిళా ఉద్యోగినితో రాసక్రీడలు
ఇరువురి సస్పెన్షన్ టీనగర్(తమిళనాడు): సహకారం సంఘం ప్రాంగణంలో మహిళా ఉద్యోగినితో అధికారి రాసక్రీడలకు పాల్పడడంతో ఇరువురిని సస్పెండ్ చేశారు. పెరుందురై యూనియన్ పరిధిలోని నల్లాంపట్టి పట్టణ పంచాయతీలో ప్రాథమిక సహకార రుణ సంఘం పనిచేస్తోంది. ఈ సంఘం కార్యదర్శిగా గోపాలస్వామి పనిచేస్తున్నారు. ఆయన ఇదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళతో సంఘం కార్యాలయ ప్రాంగణంలో రాసక్రీడలకు పాల్పడుతున్నట్లు పలు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంఘం అధ్యక్షుడు సుబ్రమణి ఈరోడ్ జిల్లా సహకార సంఘం డిప్యూటీ రిజిస్ట్రార్ మణికి అధికారులు ఉత్తర్వులిచ్చారు. విచారణలో ఇరువురి సంజాయిషీలు ఆమోదయోగ్యంగా లేనందున వారిద్దరిని సస్పెండ్ చేశారు. ఇదిలావుండగా వారిరువురూ అసభ్యంగా వ్యవహరించిన వీడియో ఆధారాలు వెల్లడి కావడంతో వారిపై చర్య తీసుకున్నారు.