మహిళా ఉద్యోగినితో రాసక్రీడలు | erode cooperative society secretary suspension | Sakshi
Sakshi News home page

మహిళా ఉద్యోగినితో రాసక్రీడలు

Published Wed, May 17 2017 4:20 PM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM

మహిళా ఉద్యోగినితో రాసక్రీడలు

మహిళా ఉద్యోగినితో రాసక్రీడలు

ఇరువురి సస్పెన్షన్‌

టీనగర్(తమిళనాడు)‌: సహకారం సంఘం ప్రాంగణంలో మహిళా ఉద్యోగినితో అధికారి రాసక్రీడలకు పాల్పడడంతో ఇరువురిని సస్పెండ్‌ చేశారు. పెరుందురై యూనియన్‌ పరిధిలోని నల్లాంపట్టి పట్టణ పంచాయతీలో ప్రాథమిక సహకార రుణ సంఘం పనిచేస్తోంది. ఈ సంఘం కార్యదర్శిగా గోపాలస్వామి పనిచేస్తున్నారు. ఆయన ఇదే కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళతో సంఘం కార్యాలయ ప్రాంగణంలో రాసక్రీడలకు పాల్పడుతున్నట్లు పలు ఫిర్యాదులు అందాయి.

దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంఘం అధ్యక్షుడు సుబ్రమణి ఈరోడ్‌ జిల్లా సహకార సంఘం డిప్యూటీ రిజిస్ట్రార్‌ మణికి అధికారులు ఉత్తర్వులిచ్చారు. విచారణలో ఇరువురి సంజాయిషీలు ఆమోదయోగ్యంగా లేనందున వారిద్దరిని సస్పెండ్‌ చేశారు. ఇదిలావుండగా వారిరువురూ అసభ్యంగా వ్యవహరించిన వీడియో ఆధారాలు వెల్లడి కావడంతో వారిపై చర్య తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement