రుమటాయిడ్ ఆర్థరైటిస్
శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో జీవక్రియల మార్పుల వలన, జన్యుపరమైన మార్పుల వలన వ చ్చే కీళ్ళజబ్బులలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి. ప్రపంచంలో 0.5 శాతం నుండి 1 శాతం వరకు ఈ జబ్బుతో బాధపడుతున్నారు. 15 సం॥వయసు గల వారిలో ఈ జబ్బు రావడం చాలా అరుదు. 20 సం॥నుండి 80 సం॥మధ్య వయసు వారిలో వచ్చే అవకాశం చాలా ఎక్కువ. పురుషులలో కంటే స్త్రీలలో మూడింతలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది.
కారణాలు: శరీరంలోని జీవక్రియల అసమతుల్యత వలన, రోగ నిరోధక వ్యవస్థలోని మార్పుల వలన జబ్బు వస్తుంది. దీనితోపాటు శారీరక, మానసిక ఒత్తిడి కూడా ఒక కారణం. మానసిక ఒత్తిడి వలన జన్యుపరమైన మార్పులు సంభవించి ఈ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరైన ఆరోగ్య పద్ధతులు పాటించనివారు, ధూమపానం, మద్యపానం చేసేవారిలో ఈ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ.
లక్షణాలు: ఈ కీళ్ళ జబ్బు వలన కీళ్లలో సైనవియల్ మెంబ్రేన్ దెబ్బతింటుంది. కీళ్ళలో అనవసరమైన ఫైబ్రస్ టిష్యూ పేరుకుపోతుంది. దానిని ఫ్యానస్ అంటారు. ఈ ప్యానస్ అనే చెడు పదార్థం వలన కీళ్ళలో కార్టిలేజ్ దెబ్బతింటుంది. కీళ్లలో వాపులు తరచు వస్తూ పోతూ ఉంటాయి. ఈ జబ్బుతో లక్షణాలు కొన్నిసార్లు అధికం అవడం, కొన్నిసార్లు తాత్కాలికంగా ఉపశమనం లభించడం జరుగుతుంటుంది. లక్షణాలు అధికం అయినపుడు జ్వరం, కీళ్లలో వాపులు, కీళ్ళు ఎరుపెక్కడం, కీళ్ళు బిగుసుకు పోవడం, తీవ్రమైన నొప్పితో కదలికలు తగ్గిపోతాయి. ఆకలి తగ్గినపుడు రుమాటాయిడ్ ఆర్థరైటిస్ చేతి మణికట్టుకీళ్ళు, చేతివేళ్ళు మోచేతికీళ్ళు, మోకాళ్ళు, ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ ఆర్థరైటిస్ కేవలం కీళ్ళు దెబ్బతినడమే కాకుండా, శరీరంలో ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి. ఊపిరితిత్తులలోని పైపొర, గుండె పైపొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. తద్వారా గుండెనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. తరచుగా ఊపిరితిత్తులలో నెమ్ము కారణంగా తుమ్ములు రావడం, దగ్గురావడం జరుగుతుంది. రక్తకణాల సంఖ్య పడిపోయి అనీమియాకి కారణం అవుతుంది. ప్లీహం వాపు వస్తుంది. కళ్లు, నోరు పొడిబారిపోతాయి. చర్మం కిందిభాగంలో గుళికల్లాంటి ఆకారాలు ఏర్పడతాయి. వీటిని రుమటాయిడ్ నాడ్యుల్స్ అంటారు.
వ్యాధి నిర్ధారణ: రక్తంలోని యాంటీబాడిస్ కనుగొనే పరీక్ష రుమటాయిడ్ ఫ్యాక్టర్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. అలాగే యాంటీ సీసీపీ యాంటి సిట్రులినేటెడ్, ఫెస్టైడ్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చును. ఏఎన్ఏ పరీక్ష ద్వారా కూడా నిర్ధారించవచ్చును.
కీళ్ళని ఎక్స్రే తీయించి, ఎముకలలో ఎరోషన్స్ గుర్తించి నిర్ధారించవచ్చును. సాధారణ పరీక్షలు సీబీపీ, ఈఎస్ఆర్, సీఆర్పీ పరీక్షలు కూడా వ్యాధిని నిర్ధారించడంలో సహాయపడతాయి.
జాగ్రత్తలు: ఇలాంటి కీళ్ళజబ్బుల బారిన పడకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలి. సరైన పోషకాహారం తీసుకోవాలి. ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక, మానసిక ఒత్తిళ్లని తగ్గించుకోవడానికి ప్రతినిత్యం యోగా, ధ్యానం చేయాలి.
హోమియో వైద్యం
రోగి మానసిక, శారీరక లక్షణాలను అనుసరించి హోమియోవైద్యం ఇవ్వడం జరుగుతుంది.
లెడంపాల్, బ్రయోనియా, రస్టాక్స్, డల్కెమరా, కాల్సికమ్, బెంజోయిక్ ఆసిడ్, కాలిమూర్, పల్సటిల్లా తదితర మందులు ఉపకరిస్తాయి.
డాక్టర్ మురళి అంకిరెడ్డి,
ఎం.డి (హోమియో),
స్టార్ హోమియోపతి,
సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి,
విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ,
రాజమండ్రి, హనుమకొండ-వరంగల్, కర్ణాటక
ఫోన్: 7416 107 107 / 7416 102 102
www.starhomeo.com
E-mail: info@starhomeopathy.com