తాగి విమానంలో రచ్చ చేసిన 'నీలి' నటి!
1970, 80 దశకాల్లో తన నీలిచిత్రాలతో హాలీవుడ్‌ను ఒక ఊపు ఉపేసిన శృంగార తార హర్లీ మేక్‌బ్రైడ్ తాజాగా విమానంలో రభస సృష్టించింది. పూర్తిగా మద్యం మత్తులో జోగుతూ ఆమె రచ్చరచ్చ చేయడంతో గాలిలో ఎగురుతున్న విమానాన్ని అత్యవసరంగా దింపాల్సి వచ్చింది. న్యూయార్క్ నుంచి ఫ్రాన్స్ వెళుతున్న బోయింగ్ 777 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అప్పటికే మద్యం మత్తులో ఉన్న 67 ఏళ్ల హర్లీ మళ్లీ మద్యం ఇవ్వాల్సిందిగా విమానం సిబ్బందిని కోరింది. ఇందుకు వారు నిరాకరించడంతో ఆమె వీరంగం వేసింది. దీంతో ఆమెను విమానం సిబ్బంది కూర్చికి ప్లాస్టిక్‌తో కట్టేసి.. అత్యవసరంగా విమానాన్ని దింపేశారు. విమానంలో గలాటా సృష్టించినందుకు తాజాగా ఆమెకు కోర్టు 19,700 పౌండ్లు (రూ. 18.94 లక్షల) జరిమానా విధించింది.
1970 దశకంలో శృంగార రస నీలి చిత్రాలతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న హర్లీ 'యంగ్ లేడీ చాటర్లీ' వంటి సినిమాలతో ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుంది. ఆమె 'లాండ్ అండ్ ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్' నటుడు రిచర్డ్ బ్లెజర్ను పెళ్లాడింది. ఇటీవల తన సోదరుడు చనిపోయివడంతో అతని అంత్యక్రియల్లో పాల్గొనడానికి న్యూయార్క్ వచ్చింది. అనంతరం తిరిగి ఫ్రాన్స్‌కు వెళుతుండగా విమానం ఎక్కడానికి ముందే మద్యాన్ని సేవించిన ఆమె.. ఎక్కిన తర్వాత లిక్కర్ కోసం గొడవ చేయడం పెద్ద గలాటానే రేపింది.