తిరుమల యాత్రను ప్రారంభించిన ఆకేపాటి
కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఎరుకల సంఘం తిరుమల పాదయాత్రను జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆదివారం కడప నగరంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజంపేట పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనివాసరెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. గత ఏడేళ్లుగా జిల్లాలోని ఎరుకుల సంఘం నాయకులు, కార్యకర్తలు తిరుమల పాదయాత్ర చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి ఎరుకుల సంఘం నాయకులు, కార్యకర్తలు భారీగా హజరయ్యారు.