వయాగ్రాతో మలేరియాకు చెక్!
లండన్: నపుంసకత్వాన్ని నిరోధించేందుకు సామర్థవంతమైన జౌషధంగా పరిగణించబడుతున్న 'వయాగ్రా' మలేరియాకు చెక్ పెట్టగలదట. మలేరియాను వ్యాపింపజేసే పరాన్నజీవిని అడ్డుకునే శక్తి వయాగ్రాకు ఉందని పరిశోధనలో తేలింది. మలేరియా వ్యాధి కారకం ఎరిత్రోసైట్ ను పెడసరంగా మార్చడం ద్వారా రక్తంలో దాన్ని చలనాన్ని తగ్గిస్తుందని వెల్లడైంది.
లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ భాగస్వామ్యంతో పారీస్ లోని కొచిన్ ఇన్ స్టిట్యూట్, పాశ్చర్ ఇన్ స్టిట్యూట్ సైంటిస్టులు ఈ ఆశ్చర్యకర పరిశోధన చేశారు. మలేరియాకు కారణమైన ప్లాస్మోడియం పాల్సిపేరం పరాన్నజీవి.. మనుషులు, ఆడ అనాఫిలిస్ దోమలో జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. అనాఫిలిస్ దోమ కుట్టినప్పుడు ఇది మనిషి రక్తంలోకి ప్రవేశిస్తుంది. అయితే మలేరియా పరాన్నజీవిని అడ్డుకునే శక్తి వయాగ్రాకు ఉందని పరిశోధనలో తేలడంతో భవిష్యత్ లో దీన్ని మలేరియా నివారణ ఔషధంగా వాడే అవకాశాలున్నాయి.