భారీ కుంభకోణంలో మాజీ సీఈవో
భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త పైభారీకుంభకోణానికి పాల్పడిన ఆరోపణలు నమోదయ్యాయి. ఇన్వెస్టర్లను మోసం చేసి 30 మిలియన్ డాలర్ల కుంభకోణానికి పాల్పడిన కేసులో ఎసెక్స్ హోల్డింగ్స్ ఇంక్ మాజీ సీఈవో నవీన్ శంకర్ సుబ్రమణ్యం జేవియర్ (44) పై దాదాపు రెండు వందలకోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. సెప్టెంబర్ 2011, మే 2014 కాలంలో 100 చిలీలో సుగర్ రవాణా, సరఫరా, ఐరన్ ఓర్ మైనింగ్ వ్యాపార నిమిత్తం పెట్టుబడిదారుల నుంచి 29 మిలియన్లకు పైగా డాలర్లను అక్రమంగా వసూలు చేశాడనీ, తప్పుడు ఆర్థిక ప్రకటనలు, నకిలీ పత్రాలు, తప్పుడు వాగ్దానాల ద్వారా ఎసెక్స్ హోల్డింగ్స్ పెట్టుబడులు సాధించాడని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
ఈ మొత్తాన్ని విలాసవంతమైన జీవితం, లగ్జరీ వాహనాలు, వివాహ ఖర్చులు, అతని భార్య ఖరీదైన నగల, కాస్మొటిక్ సర్జరీలు లాంటి ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించినట్టు న్యాయ శాఖ వ్యాఖ్యానించింది. అలాగే కొత్తపెట్టుబడిదారుల పెట్టుబడులను పాత పెట్టుబడిదారులు చెల్లించడానికి ఉపయోగించిందని దక్షిణ కెరొలిన కో ఆర్డినేషన్ కౌన్సిల్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ పేర్కొంది. వ్యాపార కాంట్రాక్ట్ లను పొందడానికి, ఫేక్ బ్యాంక్ స్టేట్ మెంట్లు, తప్పుడు కాంట్రాక్టర్ ఇన్ వోయిస్ లు సమర్పించి అక్రమాలకు పాల్పడ్డాడని వాదించింది. దీంతో గరిష్టంగా ఇరవై సంవత్సరాల శిక్షతోపాటు, జరిమానా 250,000 డాలర్లు (రూ.16,755,000 ) వరకు జరిమానాను విధించే అవకాశం ఉందని తెలిపారు.