జేసీ ప్రోద్బలంతోనే ఎస్సీలపై దాడులు
అనంతపురం టవర్‌క్లాక్: ఎంపీ జేసీ దివాకరరెడ్డి ప్రోద్బలంతోనే పీర్ల పండుగ సందర్భంగా కిష్టిపాడులో ఎస్సీలపై దాడులు జరిగాయని దళిత, ప్రజా సంఘాల నాయకులు నారాయణస్వామి, ఓబులేసు ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. దాడులకు బాధ్యులను గుర్తించినట్లు చెప్పారు.
గ్రామంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులను ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, ఎస్సీ సంక్షేమ సంఘం, రజక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, దళిత సంక్షేమ పోరాట సంఘం నేతలు పలు అంశాలపై చర్చించారు. ఈనెల 24న పెద్దవడుగూరు నుంచి కిష్టిపాడుకు పాదయాత్రగా వెళ్లి గ్రామంలోని బాధితులను పరామర్శించాలని తీర్మానించారు. అదేరోజు బహిరంగ సభ నిర్వహించి ఎస్సీల్లో మనోధైర్యం నింపాలని నిర్ణరుుంచారు.
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి, కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరన్న మాట్లాడుతూ ఎస్సీల్లో చైతన్యాన్ని చూసి ఓర్వలేకే జేసీ దాడులు చేరుుంచారని ఆరోపించారు. దాడి చేసిన వారిని వదిలి బాధిత ఎస్సీలపై కేసులు బనారుుంచడంపై ఓబులేసు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు ఎత్తివేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
విశ్రాంత డీఎస్పీ హరికిషన్ తదితరులు మాట్లాడారు. అనంతరం దళిత సంఘీభావ సమితిని ఏర్పాటు చేశారు. సమావేశంలో వివిధ సంఘాన నేతలు ఆశావాది జగజ్జీవన్‌రావు, మారెప్ప, నల్లప్ప, పుష్పరాజ్, జెన్నే ఆనంద్, రాజగోపాల్, ప్రభాకర్, ఇంతియాజ్, వెంకటేషు, కిష్టిపాడు గ్రామస్తులు పాల్గొన్నారు.