దుగరాజపట్నం పోర్టుపై నివేదిక సిద్ధం
వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి సాంకేతిక, ఆర్థిక యోగ్యత నివేదిక (ఫీజిబిలిటీ రిపోర్ట్) సిద్ధమైందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సాగరమాల కార్యక్రమం కింద కొత్త పోర్టుల ప్రతిపాదన, ఏర్పాటు, నిర్మాణంలో ఉన్న పోర్టులకు సంబంధించిన వివరాలను అందించాల్సిందిగా రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సోమవారం కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఏపీలోని దుగరాజపట్నం, పశ్చిమ బెంగాల్లోని సాగర్, మహారాష్ట్రలోని వధవన్, తమిళనాడులోని ఈనాయంలలో ప్రధాన నౌకాశ్రయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది.