ESUBABU
-
క్రీస్తు బలియాగం వెనుకున్న పరమార్థం ఇదే..!
క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానాల వెనుక దేవుని దివ్య సంకల్పం ఉంది. దీన్నే సువార్త అంటారు. సువార్త దేవుని సంకల్పంతో ఎప్పుడూ ముడిపడే ఉంటుంది. పూర్వపు దేవుని సంకల్పం చెప్పక దాన్ని దాటవేసే సువార్త అసలు లెస్సయైన లేఖనానుసార సువార్తగా ఎప్పటికీ కానేరదు. సువార్త పుట్టుకకు ఆయువుపట్టు వంటి దేవుని ప్రణాళికను చాలా పకడ్బందీగా, పటిష్టంగా వివరించకున్ననూ అది సువార్త కాదు. సత్యవాక్యం అనే రక్షణ భాగ్యపు సువార్త ప్రకటన అపొస్తలుల బోధకు లోబడే ఉండి తీరాలి. వారపు ప్రప్రథమ దినం అనే ప్రతి ఆదివారం నాడు యెడతెగక దేవుని ఆరాధనలో భాగంగా జరిగే రొట్టె విరుచుట అనేది క్రీస్తు బలియాగానికి గుర్తు. క్రీస్తు పస్కా బలి పశువుగా, వధకు సిద్ధమైన గొఱె -
జీజీహెచ్ బాలుడి ఆచూకీ లభ్యం
గుంటూరు : గుంటూరు జీజీహెచ్ లో బుధవారం అపహరణకు గురైన తొమ్మిది నెలల బాలుడు ఏసుబాబు ఆచూకీ లభ్యమైంది. నగరంలోని అరండల్పేటలో బాలుడు ఉన్నట్లు గుర్తించారు. బాలుడి అమ్మమ్మ కళ్లుగప్పి ఓ మహిళ బాబును ఎత్తుకెళ్లింది. ఈ విషయంపై మంత్రి కామినేని ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు వేగంగా విచారణ జరిపారు. దీంతో ఏసు బాబు ఆచూకీ గురువారం ఉదయం కనుగొన్నట్టు గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు. -
ఎస్ఐలను తొలగించాలంటూ గ్రామస్తుల ధర్నా
విశాఖ జిల్లా కొయ్యూరు, మంప పోలీస్ స్టేషన్ల ఎస్ఐలను తొలగించాలని కోరుతూ మండలంలోని ప్రజలు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మండల కేంద్రమైన కొయ్యూరుతోపాటు, ఇదే మండలంలోని మంప ఎస్ఐలు అమాయకులను చితకబాదుతున్నారని, వారిని తొలగించాలని కోరుతూ సుమారు 150 మంది తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఇదే విషయమై బాధితులు కొన్ని రోజుల కింద నర్సీపట్నం ఏఎస్పీ ఏసుబాబుకు వినతిపత్రం ఇచ్చారు. విచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇవ్వగా, ఇంతవరకూ చర్యలు లేకపోవడంతో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. -
కన్నతండ్రే కాలయముడు
నందివాడ, న్యూస్లైన్ : పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత పిల్లాడు పుడితే ఇన్నాళ్లూ పుట్టని బిడ్డ ఇప్పుడెలా పుట్టాడనే అనుమానంతో ఓ చిన్నారిని తండ్రి హత్య చేశాడు. ఏడేళ్ల క్రితం ఆగిరిపల్లి మండలం కాములూరు గ్రామానికి చెందిన రత్నకుమారికి నందివాడ మండలం రుద్రపాక శివారు గాజులపాడు గ్రామానికి చెందిన ఏసుబాబుతో వివాహం జరిగింది. కొద్ది రోజులకు అధిక కట్నం తీసుకురావాలని భార్యను వేధించడం ప్రారంభించాడు. రత్నకుమారి పుట్టింటికి వెళ్లి డబ్బు తీసుకు వస్తున్నా కట్నదాహం తీరలేదు. మూడేళ్ల కిందట ఒక మగబిడ్డకు రత్నకుమారి జన్మనిచ్చింది. అప్పడే ఏసుబాబు మనసులో అనుమాన విష బీజం మొలకెత్తింది. ఇన్నాళ్లు పుట్టని పిల్లాడు ఇప్పుడు ఎలా పుట్టాడంటూ భార్యను అనుమానిం చాడు. ఈ నెల 14న రత్నకుమారి పుట్టింటికి వెళ్లింది. బిడ్డ ఏనోష్బాబును పంపించకుండా తన వద్దే ఉంచుకున్నాడు. ఈ నెల 22న వచ్చి రత్నకుమారి తన బిడ్డను తనతో పాటు పంపాలని కోరింది. గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టడంతో రెండు రోజుల తరువాత పంపిస్తానని చెప్పడంతో నిజమేననుకొని వెనుతిరిగింది. 24న తేదీ ఉదయం 11గంటల సమయంలో ఇంటి పక్కనే ఉన్న పచారీ కొట్టులో నుంచి కేకులు కొన్నాడు. కేకులో ఎలుకల మందు కలిపి కొడుకుకి తినిపించాడు. ఆ తరువాత తను కూడా తిన్నాడు. తండ్రీకొడుకులు అపస్మారకస్థితిలో ఉండటం చూసి స్థానికులు గుడివాడ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో చిన్నారి చనిపోయాడు. రూరల్ సీఐ జనార్దనరావు గాజులపాడు గ్రామం వెళ్లి విచారించారు. గుడివాడ ఏరియా ఆసుపత్రిలో బుధవారం ఉదయం చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తండ్రి ఏసుబాబు గుడివాడ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.