జీజీహెచ్ బాలుడి ఆచూకీ లభ్యం
Published Thu, Jan 21 2016 11:36 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
గుంటూరు : గుంటూరు జీజీహెచ్ లో బుధవారం అపహరణకు గురైన తొమ్మిది నెలల బాలుడు ఏసుబాబు ఆచూకీ లభ్యమైంది. నగరంలోని అరండల్‌పేటలో బాలుడు ఉన్నట్లు గుర్తించారు. బాలుడి అమ్మమ్మ కళ్లుగప్పి ఓ మహిళ బాబును ఎత్తుకెళ్లింది. ఈ విషయంపై మంత్రి కామినేని ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు వేగంగా విచారణ జరిపారు. దీంతో ఏసు బాబు ఆచూకీ గురువారం ఉదయం కనుగొన్నట్టు గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు.
Advertisement
Advertisement