కన్నతండ్రే కాలయముడు | Kannatandre kalayamudu | Sakshi
Sakshi News home page

కన్నతండ్రే కాలయముడు

Published Thu, Feb 27 2014 1:30 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

కన్నతండ్రే కాలయముడు - Sakshi

కన్నతండ్రే కాలయముడు

నందివాడ, న్యూస్‌లైన్ : పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత పిల్లాడు పుడితే ఇన్నాళ్లూ పుట్టని బిడ్డ ఇప్పుడెలా పుట్టాడనే అనుమానంతో ఓ చిన్నారిని తండ్రి హత్య చేశాడు.  ఏడేళ్ల క్రితం ఆగిరిపల్లి మండలం కాములూరు గ్రామానికి చెందిన రత్నకుమారికి నందివాడ మండలం రుద్రపాక శివారు గాజులపాడు గ్రామానికి చెందిన  ఏసుబాబుతో వివాహం జరిగింది.     కొద్ది రోజులకు  అధిక కట్నం తీసుకురావాలని భార్యను వేధించడం ప్రారంభించాడు.  రత్నకుమారి పుట్టింటికి వెళ్లి డబ్బు తీసుకు వస్తున్నా  కట్నదాహం తీరలేదు.

మూడేళ్ల కిందట  ఒక మగబిడ్డకు రత్నకుమారి జన్మనిచ్చింది. అప్పడే ఏసుబాబు మనసులో అనుమాన విష బీజం మొలకెత్తింది. ఇన్నాళ్లు పుట్టని పిల్లాడు ఇప్పుడు ఎలా పుట్టాడంటూ భార్యను అనుమానిం చాడు.   ఈ నెల 14న  రత్నకుమారి పుట్టింటికి వెళ్లింది. బిడ్డ ఏనోష్‌బాబును పంపించకుండా తన వద్దే ఉంచుకున్నాడు. ఈ నెల 22న వచ్చి రత్నకుమారి  తన బిడ్డను తనతో పాటు పంపాలని కోరింది. గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టడంతో రెండు రోజుల తరువాత పంపిస్తానని చెప్పడంతో నిజమేననుకొని వెనుతిరిగింది.

24న తేదీ ఉదయం 11గంటల సమయంలో ఇంటి పక్కనే ఉన్న పచారీ కొట్టులో నుంచి కేకులు కొన్నాడు. కేకులో  ఎలుకల మందు కలిపి  కొడుకుకి తినిపించాడు. ఆ తరువాత తను కూడా తిన్నాడు.  తండ్రీకొడుకులు  అపస్మారకస్థితిలో ఉండటం చూసి  స్థానికులు గుడివాడ  లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో చిన్నారి చనిపోయాడు.  రూరల్ సీఐ జనార్దనరావు గాజులపాడు గ్రామం వెళ్లి విచారించారు. గుడివాడ ఏరియా ఆసుపత్రిలో బుధవారం ఉదయం చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.  తండ్రి ఏసుబాబు గుడివాడ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement