ఎస్‌ఐలను తొలగించాలంటూ గ్రామస్తుల ధర్నా | Villagers protest the removal of the SI | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐలను తొలగించాలంటూ గ్రామస్తుల ధర్నా

Published Wed, Dec 30 2015 1:58 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

Villagers protest the removal of the SI

విశాఖ జిల్లా కొయ్యూరు, మంప పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలను తొలగించాలని కోరుతూ మండలంలోని ప్రజలు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మండల కేంద్రమైన కొయ్యూరుతోపాటు, ఇదే మండలంలోని మంప ఎస్‌ఐలు అమాయకులను చితకబాదుతున్నారని, వారిని తొలగించాలని కోరుతూ సుమారు 150 మంది తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఇదే విషయమై బాధితులు కొన్ని రోజుల కింద నర్సీపట్నం ఏఎస్‌పీ ఏసుబాబుకు వినతిపత్రం ఇచ్చారు. విచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇవ్వగా, ఇంతవరకూ చర్యలు లేకపోవడంతో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement