యూటీఎఫ్ నాయకుడు మృతి
అనంతపురం ఎడ్యుకేషన్ : గార్లదిన్నె మండలం కొప్పలకొండ పాఠశాల ఉపాధ్యాయుడు, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) గార్లదిన్నె మండల శాఖ నాయకుడు ఈశ్వరయ్య(46) గుండెపోటుతో మంగళవారం మతి చెందారు. అనంతపురం పాతూరు ఎల్లమ్మగుడి సమీపంలో ఉంటున్న ఆయన రాత్రి ఇంట్లోనే నిద్రపోయారు. తెల్లవారుజామునే లేచి నీళ్లు కూడా పట్టారు. తర్వాత ఛాతిలో నొప్పంటూ కుటుంబ సభ్యులకు చెప్పి కుప్పకూలిపోయారు.
వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తాడిమర్రి మండలం పూల ఓబయ్యపల్లి ఆయన స్వగ్రామం. విషయం తెలిసిన వెంటనే ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు ఇక్కడికి చేరుకున్నారు. ఈశ్వరయ్య మతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన మతి తీరని లోటని యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రమణయ్య, గార్లదిన్నె మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు శేషప్ప, సరళ, జిల్లా కార్యదర్శి రూత్, ఆచారి, రామకష్ణ అన్నారు.