అధికారికంగా ఈశ్వరీబాయి వర్ధంతి: కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఈశ్వరీబాయి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈశ్వరీబాయి కుమార్తె, కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి ఈ అంశంపై సోమవారం సచివాలయంలో సీఎం కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి 1969లో జరిగిన పోరాటంలో ఈశ్వరీబాయి చేసిన ప్రసంగాలు తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయని చెప్పారు. ఆమె వర్ధంతిని ఫిబ్రవరి 24న అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో పొందుపరుస్తామని వెల్లడించారు. కాగా, ఈశ్వరీబాయి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎం ప్రకటించడంపై గీతారెడ్డి హర్షం వ్యక్తంచేశారు. కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.