Ethyl Alcohol
-
రష్యాలో బాత్‌లోషన్ తాగి 49 మంది మృతి
-
రష్యాలో బాత్‌లోషన్ తాగి 49 మంది మృతి
మాస్కో: స్నానానికి ఉపయోగించే బాత్‌లోషన్ లో ఆల్కహాల్ ఎక్కువగా కలిసిఉంటుందని నమ్మి దాన్ని తాగి 49 మంది మద్యపానప్రియులు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన సోమవారం రష్యాలోని ఇర్కుట్సక్ నగరంలో జరిగింది. మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. రష్యాలో తాగుడుకు బానిసైన వారిలో దాదాపు 20శాతం మంది(1.2కోట్ల జనాభా) ఆల్కాహాల్ కలసిన గృహోపకరణ ద్రవాలు, ఔషధాలు, పరిమళద్రవ్యాలను మత్తుకోసం వినియోగిస్తున్నారు. 49 మంది మరణించంతో ఇర్కుట్సక్ సిటీలో అత్యవసర పరిస్థితిని విధించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావించి అధికారులు ప్రతీ అపార్ట్మెంటు, ఇంటిని సోదా చేస్తున్నారు. బాత్‌లోషన్ లో ఇథైల్ ఆల్కాహల్కు బదులుగా విషతుల్యమైన మిథనాల్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాత్‌లోషన్ బాటిళ్లపై ‘ఆల్కహాల్ వాటా 93 శాతం’ అని రాసి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. -
తోకచుక్క నుంచి మద్యం ఉత్పత్తి!
న్యూయార్క్: ఆల్కహాల్ ఆంతరిక్షంలోనూ ఉత్పత్తవుతోందని ఫ్రాన్స్‌లోని ప్యారిస్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. లవ్‌జాయ్ అనే తోకచుక్క సెకెనుకు 500 బాటిళ్ల ఆల్కహాల్‌ను అంతరిక్షంలోకి విడిచిపెడుతోందట. ఒక తోకచుక్కపై ఇథైల్ ఆల్కహాల్‌ను కనుగొనడం ఇదే మొదటిసారి. అతిశీతల వాతావరణం ఉండే లవ్‌జాయ్ ఈ ఏడాది జనవరి 30న సూర్యునికి దగ్గరగా వచ్చింది. సూర్యుని వేడిమికి ఇది సెకెనుకు 20 టన్నుల నీటి ఆవిరిని రోదసిలో విడుదల చేసింది. దీనిలో 500 బాటిళ్లకు సమానమైన ఇథైల్ ఆల్కహాల్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో తోకచుక్కపై జీవం ఉనికికి అవసరమైన కర్బన పరమాణువులు ఉన్నట్లు తేలిందన్నారు. ప్రకాశవంతమైన ఈ తోకచుక్కను స్పెయిన్‌ని నవేదా పర్వతాల్లో ఉన్న టెలిస్కోప్ ద్వారా పరిశీలించారు. భూమిలాంటి గ్రహం నుంచి విడివడిన పదార్థమే తోకచుక్కగా రూపాంతరం చెందిందని విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు ఉన్నాయనే వాదనకు మద్దతు లభించిందని శాస్త్రవేత్తలు తెలిపారు.