రష్యాలో బాత్‌లోషన్ తాగి 49 మంది మృతి | 49 people died in Russia drinking batlosan | Sakshi
Sakshi News home page

రష్యాలో బాత్‌లోషన్ తాగి 49 మంది మృతి

Published Tue, Dec 20 2016 3:57 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM

49 people died in Russia drinking batlosan

మాస్కో: స్నానానికి ఉపయోగించే బాత్‌లోషన్ లో ఆల్కహాల్‌ ఎక్కువగా కలిసిఉంటుందని నమ్మి దాన్ని తాగి 49 మంది మద్యపానప్రియులు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన సోమవారం రష్యాలోని ఇర్కుట్‌సక్‌ నగరంలో జరిగింది. మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. రష్యాలో తాగుడుకు బానిసైన వారిలో దాదాపు 20శాతం మంది(1.2కోట్ల జనాభా) ఆల్కాహాల్‌ కలసిన గృహోపకరణ ద్రవాలు, ఔషధాలు, పరిమళద్రవ్యాలను మత్తుకోసం వినియోగిస్తున్నారు.

49 మంది మరణించంతో ఇర్కుట్‌సక్‌ సిటీలో అత్యవసర పరిస్థితిని విధించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావించి అధికారులు ప్రతీ అపార్ట్‌మెంటు, ఇంటిని సోదా చేస్తున్నారు. బాత్‌లోషన్ లో ఇథైల్‌ ఆల్కాహల్‌కు బదులుగా విషతుల్యమైన మిథనాల్‌ ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాత్‌లోషన్  బాటిళ్లపై ‘ఆల్కహాల్‌ వాటా 93 శాతం’ అని రాసి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement