breaking news
EU leaders
-
ఉక్రెయిన్ను ఇరుకున పెట్టిన పుతిన్.. జెలెన్స్కీతో ట్రంప్ కీలక భేటీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం(అమెరికా కాలమానం ప్రకారం) జెలెన్స్కీతో వైట్‌హౌస్‌లో భేటీ కానున్నారు. పుతిన్‌తో భేటీ వివరాలు, ప్రతిపాదనలను ఆయన ముందుంచనున్నారు. భేటీ విజయవంతమైతే ఈయూ దేశాల అగ్ర నేతలతోనూ ట్రంప్, జెలెన్స్కీ సమావేశం అవుతారు. ఈ నేపథ్యంలో యుద్ధం ఎలా మొదలైందో ఓసారి గుర్తు తెచ్చుకోవాలని జెలెన్స్కీకి ట్రంప్ సూచించినట్టు సమాచారం. ఇక, శాంతి ఒప్పందానికి పుతిన్.. ట్విస్ట్ ఇస్తూ కీలక ప్రతిపాదన చేసినట్టు తెలిసింది.డోన్బాస్ ఇచ్చేయండి..డోన్బాస్ తూర్పు ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్పై పుతిన్ అజమాయిషీ కోరుతున్నట్టు జెలెన్స్కీకి ట్రంప్ చెప్పారని సమాచారం. అవిచ్చేస్తే యుద్ధం ఆపేస్తానని పుతిన్ ప్రతిపాదించినట్టు వివరించారు. అందుకు జెలెన్స్కీ ఒప్పుకోలేదని తెలుస్తోంది. సోమవారం ముఖాముఖిలో ఇందుకు జెలెన్స్కీని ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నారు. తూర్పు డోన్బాస్ అంశమే శాంతి ఒప్పందానికి కీలకమని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. తూర్పు డోన్బాస్ను ఇచ్చేశాక పుతిన్ తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేసినా, తమపై రష్యా భావి దండయాత్రకు అదే కారణంగా మారవచ్చ అనేది జెలెన్స్కీ ఆందోళనగా కనిపిస్తోంది.మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్‌తో భేటీకి ఒంటరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పంపేందుకు ఐరోపా నేతలు భయపడుతున్నారు. ఫిబ్రవరిలో ట్రంప్‌ను కలిసేందుకు అమెరికా వెళ్లిన జెలెన్స్కీకి వైట్‌హౌస్‌లో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. మూడో ప్రపంచయుద్ధం వచ్చేలా చేయొద్దంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ ఆ భేటీలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఈసారి జెలెన్స్కీకి తోడుగా బ్రిటన్ ప్రధాని స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ తదితరులు పాల్గొంటారు. ఇక, ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకున్నా అదే తరహాలో రక్షణ హామీ ఇచ్చేందుకు ట్రంప్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్టు ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్ లేయిన్ చెప్పారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్ మధ్య రెండున్నర గంటలకు పైగా జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. -
మళ్లీ ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ చర్చలు... ఈసారి ఈయూ నాయకుల ఎంట్రీ
Talks between Ukraine and Russia resumed: ఉక్రెయిన్ పై రష్యా పోరు సాగిస్తూనే ఉంది. వైమానికి క్షిపణి దాడులతో ఉక్రెయిన్‌ని రూపు రేకలు తుడుచు పెట్టుకు పోయేలా రష్యా దురాక్రమణకు యత్నిస్తోంది. ఆ దిశగా ఒక్కోక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ పౌరులు, ఆసుపత్రుల పైన నిర్థాక్షిణ్యంగా దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో కాల్పలు విరమణ, బలగాలు వెనక్కు మళ్లించే దిశగా రష్యా ఉక్రెయిన్ల మధ్య మళ్లీ చర్చలు పునః ప్రారంభమయ్యాయని ఉక్రెయిన్ ప్రతినిధి మైఖైలో పోడోల్యాక్ చెప్పారు. అంతేకాదు మూడు యూరోపియన్ యూనియన్ దేశాల నాయకులు ఉన్నత అధికారులను కలవడానికి కైవ్‌కు వెళ్తున్నారు. దీంతో కాల్పులు విరమణ నిమిత్తం ఉక్రెయిన్ రాజధానిలో 36 గంటల కర్ఫ్యూ విధించిందని తెలిపారు. ఉక్రెయిన్ స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం యూరోపియన్ యూనియన్ నిస్సందేహమైన మద్దతును వ్యక్తపరచడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశం అని చెక్ ప్రధాన మంత్రి పీటర్ ఫియాలా ట్విట్టర్లో తెలిపారు. ఈ పర్యటనలో స్లోవేనియాకు చెందిన జానెజ్ జాన్సా, పోలాండ్‌కు చెందిన మాటెస్జ్ మోరావికీ, పోలాండ్ యొక్క వాస్తవాధీన నాయకుడైన జరోస్లావ్ కాజిన్స్కీతో కలిసి ఉక్రెయిన్ పర్యటనకు వచ్చారు. ఈ భీకరమైన యుద్ధం ఐరోపాలో అత్యంత ఘోరమైన శరణార్థుల సంక్షోభాన్ని సృష్టించి, వందలాది మందిని పొట్టనబెట్టుకుంది. ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమన దాడి నేటికి 20 రోజుకి చేరుకుంది. (చదవండి: యుద్ధానికి రష్యా గుడ్ బై చెప్పనుందా?.. అదే కారణమా?) -
ఆర్టీసీ యాజమాన్యం, ఈయూ నేతల చర్చలు సఫలం
హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యం, ఈయూ నేతల మధ్య బుధవారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. తమ డిమాండ్లకు ఆర్టీసీ యాజమాన్యం సమ్మతించడంతో సమ్మె నిర్ణయాన్ని యూనియన్ నేతలు విరమించుకున్నారు. కార్మికుల సొసైటీ, డీఏ బకాయిల చెల్లింపునకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించింది. అంతేకాకుండా పండుగ అడ్వాన్స్‌లు కూడా చెల్లించేందుకు యాజమాన్యం అంగీకారం తెలిపింది. నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరిస్తామని ఉద్యోగ సంఘాలకు యాజమాన్యం హామీ ఇచ్చింది.