Europe refugee crisis
-
బోటుల్లో ఐరోపాకు చేరిన ఆఫ్రికా అక్రమ చొరబాటుదారులు
ఇటలీ: గడిచిన 24 గంటల్లో ఆసియా, ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల నుండి వేల సంఖ్యలో వలసదారులు బోటుల్లో ఐరోపాలోని ఆయా దేశాలకు చేరుకున్నట్లు తెలిపాయి ఇటలీ ఇమిగ్రేషన్ వర్గాలు. ఇటలీ ఇమిగ్రేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆఫ్రికా, ఆసియా దేశాలకు చెందిన శరణార్థులు పడవల్లో తమ దేశానికి చేరుకున్నారని తెలిపారు. కిక్కిరిసిన బోటులో ప్రయాణం చేసిన కారణంగా కొంతమంది బోటులోనే చనిపోగా మిగిలినవారు కాలాబ్రియా కోస్తాకు, లంపెడుసా తీరానికి చేరుకున్నారని అన్నారు. Meanwhile, another overloaded boatload of illegal immigrants from North Africa is making its way across the Mediterranean to Europe and the UK. pic.twitter.com/pDOagytGr6 — UK Justice Forum 🇬🇧 Latest Video News Updates! (@Justice_forum) June 29, 2023 ఇటీవలే భారీగా వలసదారులను ఎక్కుంచుకుని ఐరోపా వైపుగా వచ్చిన ఇలాంటి ఒక పడవ బోల్తాపడి నీటమునిగిన విషయం తెలిసిందే. తరచుగా ఈ ప్రమాదాలు జరుగుతున్నా కూడా అక్కడి అధికారులు వలసలను ఆపి ప్రమాదాలను నివారించే ప్రయత్నమైనా చేయడం లేదు. Boats full of African invaders landing straight onto the beach in Italy today. pic.twitter.com/ZaylKNpps6 — Faith (@Sarah77929529) June 28, 2023 ఇది కూడా చదవండి: నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్..! వీడియో బయటకు -
సంగీతకారుడి ఔదార్యం
అంతర్యుద్ధంలో నలిగిపోతున్న సిరియా నుంచి కుటుంబంతో సహా బయలుదేరి, ప్రమాదవశాత్తు మధ్యదరా సముద్రంలో ముగినిపోయి.. టర్కీ తీరంలో శవమై తేలిన మూడేళ్ల చిన్నారి అయిలన్ కుర్దీ ఫొటో ప్రపంచాన్ని కంటతడి పెడుతున్నది. యూరప్‌లోని పలు దేశాల్లోకి చొచ్చుకొచ్చిన శరణార్థుల సహాయం కోసం ఇప్పటికే పలువురు దాతలు భారీ విరళాలలను ప్రకటించారు. తాజాగా ప్రఖ్యాత బ్రిటిష్ సంగీతకారుడు బాబ్ గెల్డాఫ్.. కెంట్, లండన్ నగరాల్లోని తన ఇళ్లల్లో శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తానన్నారు. శుక్రవారం ఓ రేడియో ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోఈ ప్రకటన చేసిన ఆయన శరణార్థులను లోపలికి అనుమతించని దేశాలపై విరుచుకుపడ్డారు. 'శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తే కొత్త ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని పలు దేశాధినేతలు చెబుతున్నారు. కనీస మానవత్వం చూపని పక్షంలో మిగిలేది అపకీర్తే తప్ప మరోటికాదు. నావరకైతే చేతనైనంతలో సాయం చేయాలనుకుంటున్నా. కెంట్, లండన్లలోని నా ఇళ్లల్లో నాలుగు కుటుంబాలు హాయిగా ఉండొచ్చు. ఇవాళో, రేపో శరణార్థి శిబిరానికి వెళ్లి వారిని నా వెంట తీసుకొస్తా' అని బాబ్ చెప్పారు. సంగీతకారుడిగానేకాక, పలు సామాజిక, రాజకీయ కార్యాక్రమాల్లోనూ బాబ్ పాల్గొంటారు. అంతర్యుద్ధంలో నలిగిపోతున్న సిరియా, లిబియా, యెమెన్ తదితర దేశాల నుంచి పలు మార్గాల ద్వారా యూరప్ నకు వచ్చిన శరణార్థుల సంఖ్య 1.5 లక్షలకు చేరింది.