విజయ్‌మాల్యాకు సుప్రీం అక్షింతలు
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌మాల్యాకు మరో కేసులో సోమవారం సుప్రీంకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. అత్యున్నత న్యాయస్థానం ఆయన వ్యవహారశైలిపై తీవ్ర వ్యాఖ్యలు సైతం చేసింది. వివరాల్లోకి వెళితే... విదేశీ మారక ద్రవ్య (ఫెరా) నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఒక కేసులో ట్రైల్ కోర్ట్ క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయాలని మాల్యా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా న్యాయ ప్రక్రియ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారని మొట్టికాయలు వేసింది. అనవసరంగా పిటిషన్ వేశారని పేర్కొంటూ... ఇందుకు రూ.10 లక్షల జరిమానా విధించింది.