ఎవరెస్ట్ ఎక్కినా.. ర్యాగింగ్ బాధ తప్పలేదు
హైదరాబాద్: అతను ఎవరెస్ట్ ఎక్కి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు, కానీ ర్యాగింగ్ మహమ్మారి నుంచి తప్పించుకోలేక పోయాడు. ఇటీవలే ఎవరెస్ట్ అధిరోహించిన డిగ్రీ విద్యార్థి ఆనంద్ను ర్యాగింగ్ పేరుతో సీనియర్లు వేధించారు. ఈ సంఘటన నిజాం కాలేజీలో బుధవారం చోటు చేసుకుంది. బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న భరత్, శివ తనను ర్యాగింగ్ చేసినట్టు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్కు ఆనంద్ ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.
దీని పై విచారణ చేయాలని అబిడ్స్ సీఐని ప్రవీణ్ కుమార్ ఆదేశించారు.