everyday
-
Handloom Every Day Challenge: చేనేతకు ‘ఐఏఎస్ బ్రాండ్’..
ఏదైనా బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలన్నా.. దానిని ప్రజల్లోకి తీసికెళ్లి సేల్ చేయాలన్నా ఆయా సంస్థలు సెలబ్రిటీలను ఎంచుకుంటారు. వారి ద్వారా అయితేనే ప్రొడక్ట్ డిమాండ్ పెరుగుతుందనే నమ్మకం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రభుత్వ పరిధిలోని చేనేత రంగాన్ని ప్రమోట్ చేసేందుకు స్వయానా ఐఏఎస్ అ«ధికారులు రంగంలోకి దిగారు. చేనేతలోని పలు రకాల చీరెలను ధరించి వాటి విశిష్టతను సోషల్ మీడియా ద్వారా వివరిస్తున్నారు. నచ్చిన చీరలో ఫొటో దిగి దానిని ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో చేనేతకు భారీ డిమాండ్ పెరిగింది. చేనేతను ప్రోత్సహించేందుకు, కార్మికులకు సేల్స్‌ను పెంచేందుకు స్వయానా రంగంలోకి దిగారు ముఖ్యమంత్రి కార్యాలయపు కార్యదర్శి స్మిత సభర్వాల్. ఇటీవల చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. తెలంగాణలోని పలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు తమ తమ ట్విట్టర్ అకౌంట్లలో పోస్టులు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారి ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. సై ్టలిష్ లుక్‌లో ఛాలెంజ్ చేసిన స్మిత సబర్వాల్ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయపు అధికారిణి స్మిత సభర్వాల్ ఓ చక్కటి చేనేత చీరను ధరించి ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఈ చీరలో ఎంతో స్టయిలిష్ లుక్‌లో ఉన్నారు మేడం..’ అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్మిత ఆ పోస్ట్ ద్వారా హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చేనేతవస్త్రాన్ని ధరించాలంటూ ఛాలెంజ్ విసిరారు. ఇలా ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు తమకు నచ్చిన చేనేత వస్త్రాల్లో సోషల్ మీడియాలో సందడి చేశారు. దేశం మొత్తం ఫిదా స్మిత సబర్వాల్ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారిలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ఐటీ శాఖ సెక్రటరీ జయేష్ రంజన్, నారాయణఖేడ్ జిల్లా కలెక్టర్ హరిచందన, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శిక్తా పట్నాయక్, యాదాద్రి జిల్లా కలెక్టర్ ప్రమీలా సత్పతి, ఐపీఎస్ అధికారిణులు శిఖాగోయల్, స్వాతిలక్రా తదితరులు వారికి నచ్చిన చేనేత చీరలను ధరించి ప్రతి ఛాలెంజ్‌ను విసరడం విశేషం. వీరి ఛాలెంజ్‌లు, డ్రస్సింగ్ సెన్స్‌కు ఫిదా అయిన నెటిజన్లు లైక్‌లు కొడుతూ కామెంట్స్‌తో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వీరే కాదు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు సైతం ఈ ఛాలెంజ్‌లో పాల్గొని తమ తమ రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలను ప్రచారం చేశారు. వీరి ప్రచారంతో చేనేతకు ఊరట లభించడంతో పాటు అమ్మకాలు సైతం ఊపందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద మనదేశం లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు స్వదేశీ బ్రాండ్‌కు అంబాసిడర్లుగా మారి ప్రపంచవ్యాప్తంగా నయా ట్రెండ్‌ను సృష్టించడం అభినందనీయం. – చైతన్య వంపుగాని, సాక్షి -
ఎవరెడీకి డాబర్ ఓపెన్ ఆఫర్
కోల్‌కతా: డ్రై సెల్ బ్యాటరీల కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్‌లో పూర్తిస్థాయి యాజమాన్య నియంత్రణకు వీలుగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ప్రమోటర్లు తాజాగా ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. కంపెనీ టేకోవర్ నిబంధనలకు అనుగుణంగా 26 శాతం అదనపు వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేశారు. ఇందుకు షేరుకి రూ. 320 ధర చెల్లించనున్నట్లు వెల్లడించారు. బీఎం ఖైతాన్ గ్రూప్ నిర్వహణలోని ఎవరెడీ కొనుగోలుకి డాబర్ ప్రమోటర్లు బర్మన్ కుటుంబం ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. 5.26 శాతం అదనపు వాటా కొనుగోలు ద్వారా ఎవరెడీలో బర్మన్ కుటుంబ వాటా 25.11 శాతానికి చేరింది. దీంతో ఓపెన్ ఆఫర్‌కు డాబర్ తెరతీసింది. ప్రస్తుతం ఎవరెడీలో ఖైతాన్ కుటుంబానికి 4.84 శాతం వాటా మాత్రమే ఉంది. పరిస్థితులను గమనిస్తున్నాం ఎవరెడీలో పెట్టుబడులను పర్యవేక్షిస్తున్న డాబర్ కుటుంబంలోని మోహిత్ బర్మన్ కంపెనీ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొన్నారు. కంపెనీని దారిలో పెట్టేందుకు ఇదే సరైన సమయమని తెలియజేశారు. ఎవరెడీ బ్రాండుకు భారీ అవకాశాలున్నట్లు అభిప్రాయపడ్డారు. కంపెనీకి విలువ జోడింపును చేపడుతామని, తద్వారా బిజినెస్‌ను మరోస్థాయికి తీసుకెళ్లగలమని వ్యాఖ్యానించారు. ఎవరెడీ కొనుగోలులో డాబర్ ఇండియా ప్రత్యక్షంగా పాల్లొనకపోవడం గమనార్హం! ఎవరెడీ ప్రమోటర్లు బీఎం ఖైతాన్ కుటుంబం మెక్నల్లీ భారత్ ఇంజినీరింగ్ రుణ చెల్లింపులకు, ఇతర రుణాలకుగాను కంపెనీ షేర్లను తనఖాలో ఉంచుతూ వచ్చారు. అయితే చెల్లింపుల్లో విఫలంకావడంతో రుణదాత సంస్థలు వీటిని విక్రయిస్తూ వచ్చాయి. దీంతో ఖైతాన్ వాటా 44 శాతం నుంచి 4.8 శాతానికి క్షీణించింది. ఈ వార్తల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో డాబర్ ఇండియా షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 565కు చేరగా.. ఎవరెడీ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 375 వద్ద ముగిసింది. -
స్కూల్ కు 3 కిలోమీటర్లు ఈదుకుంటూ వెళ్తున్నాడు!
తిరువనంతపురం: కేరళలోని అలప్పుజాకు చెందిన ఓ కుర్రవాడు పాఠశాలకు ఈదుకుంటు వెళుతున్నాడు. మిగతా పిల్లలందరూ పడవ కోసం నది దాటడానికి ఒడ్డన ఆగి వేచి చూస్తుంటే అతను మాత్రం మూడు కిలోమీటర్ల పాటు ఈదుతూ వెళ్తాడు. ఉదయాన్నే అందరిలానే స్కూల్ కి ప్రయాణం అయ్యే అర్జున్ పాఠశాల పక్కన ఉన్న పూతోట్టలో ఉండటంతో ఆ ఊరి నుంచి తమ గ్రామానికి బ్రిడ్జి వేయాలని డిమాండ్ చేస్తూ రోజూ ఈదుకుంటూ పాఠశాలకు వెళ్తాడు. తన బ్యాగ్ లోనే స్విమ్ సూట్, కళ్లజోడును అందుబాటులో ఉంచుకునే అర్జున్ వెంబనాద్ నీటిలో ఏకధాటిగా మూడు కిలోమీటర్ల దూరాన్ని అవలీలగా ఈదేస్తున్నాడు. తమ గ్రామం పెరుంబలం నుంచి పూతోట్టకు ప్రభుత్వం బ్రిడ్జిని నిర్మించాలని కోరుతున్నాడు. పడవల్లో రోజూ స్కూల్ కు వెళుతుంట ఆలస్యం అవుతుందని దీంతో టీచర్లు శిక్షిస్తున్నట్లు చెప్పాడు. కొన్ని పడవలు మరీ చిన్నగా ఉంటాయి. కానీ, నదిని దాటడానికి మాత్రం ఎక్కువ మంది వేచిచూస్తుంటారు.. దీంతో చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఆవేదన వెలిబుచ్చాడు. దాదాపు పదివేల మంది జనాభా ఉండే పెరుంబలం గ్రామ పంచాయితీ గత పాతికేళ్లుగా 700 మీటర్ల బ్రిడ్జిని నిర్మించాలని కోరుతూనే ఉంది. అత్యవసర సమయంలో టైంకి వైద్యం అందకా గత ఏడాది దాదాపు 50 మందికి పైగా గ్రామస్థులు మరణించారు. గ్రామం నుంచి వైద్యం కోసం వెళ్లాలంటే గంటన్నరకు పైగా సమయం పడుతుందని మరో విద్యార్ధి అభిలాష్ తెలిపాడు. అర్జున్ ఇలా ఈత కొట్టుకుంటూ నదిని దాటుతుండటం గ్రామస్థుల ద్వారా అధికారులకు తెలిసింది. 10 రోజుల సమయంలో గ్రామానికి వచ్చిన అధికారులు వారి బాధలను తెలుసుకున్నారు. కానీ, బ్రిడ్జి నిర్మాణంపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం నదిని దాటడానికి ఆరు పడవలు అందుబాటు ఉన్నాయని, అయితే ఇవి సరియైన కండీషన్ లో లేవని పంచాయితీ మెంబర్ శోభన చక్రపాణి తెలిపారు. అధికారులు వచ్చి గ్రామస్థులను కలవడంపై హర్షం వ్యక్తం చేసిన అర్జన్ ప్రస్తుతానికి ఈత కొట్టుకుంటూ స్కూల్ కు వెళ్లనని చెప్పాడు. ఒకవేళ బ్రిడ్జి నిర్మాణంపై ఎటువంటి ముందడుగు పడకపోయినా తాను మళ్లీ నదిలో నుంచి ఈదుకుంటూ వెళ్తానని తెలిపాడు.