evicted
-
ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయండి: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ వసతి గృహాలను ఖాళీ చేయాల్సిందిగా కళాకారులను కేంద్రం కోరింది. అందులో భాగంగా బుధవారం పద్మశ్రీ అవార్డు గ్రహీత ఒడిస్సీ డ్యాన్సర్ గురు మాయాధర్ రౌత్(90)ను అధికారులు వసతి గృహం నుంచి బయటకు పంపించేశారు. దీంతో ఆయన నిరాశ్రయులయ్యారు. వివరాల ప్రకారం.. దశాబ్దాల క్రితం ప్రముఖ కళాకారుల కోసం కేంద్రం ఢిల్లీలో వసతి గృహాలను అందించింది. కాగా, వసతి గృహాల్లో వారు ఉండటాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2014లో నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వారు ఇళ్లను ఖాళీ చేయాలని 2020లో నోటీసు జారీ చేసింది. దీంతో వారు కోర్టును ఆశ్రయించడంతో ఢిల్లీ హైకోర్టు కూడా ఎనిమిది కళాకారులు బంగ్లాలను ఏప్రిల్ 25వ తేదీలోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించుకుంటే చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో వారు ఖాళీ చేయకపోవడంతో గురు మాయాధర్ రౌత్‌ను వసతి గృహం నుంచి పంపించేశారు. ఈ సందర్భంగా గురు మాయాధర్ రౌత్ కూతురు మధుమితా రౌత్ మాట్లాడుతూ.. ఆ ఇంటిని తన తండ్రికి 25 ఏళ్ల క్రితం కేటాయించారని చెప్పింది. బలవంతంగా తమను బంగ్లా నుంచి బయటకు పంపిచేశారని ఆరోపించింది. పోలీసులు తమ వస్తువులను బయటకు విసిరేశారని విమర్శించారు. ఇదిలా ఉండగా.. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘‘28 మంది కళాకారులలో దాదాపు ఎనిమిది మందికి అనేకసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ తమ ప్రభుత్వ వసతి గృహాల నుండి బయటకు వెళ్లలేదు. దీంతో వారికి నోటీసులు ఇచ్చాము.’’ అని అన్నారు. -
పొలం వద్ద గుడారంలో తల్లితోపాటు మూడురోజులు పాటు..
-
కామాంధుల చేత చిక్కి.. కరోనా సోకి బిక్కుబిక్కు
సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆమె కామాంధుల బాధితురాలన్న కనికరంలేదు.. ఆమెకు కరోనా సోకిందన్న దయ లేదు.. ఆమెను తండావాసులు నిర్దాక్షిణ్యంగా వెలివేశారు. చుట్టూ కారుచీకటి.. చుట్టుపక్కల కానరాని మనిషి జాడ.. ఎటువైపు నుంచి ఏ అడవి జంతువు వచ్చి దాడి చేస్తుందోనన్న భయం.. మరోవైపు వర్షం.. రక్షణ ఇవ్వలేని గుడారం.. ఏం చేయాలో తెలియని అయోమయస్థితిలో మూడురోజులపాటు కొట్టుమిట్టాడింది ఓ అభాగ్యురాలు. ఈ హృదయ విదారకమైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రాశిగుట్ట తండాలో చోటుచేసుకుంది. వివరాలు... రాశిగుట్ట తండాకు చెందిన ఓ బాలిక గతనెల 18న లైంగికదాడికి గురైంది. బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా, నిందితులను అదే నెల 20న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం సిరిసిల్లలోని సఖీ కేంద్రంలో బాలికకు వసతి కల్పించారు. అక్కడ అనారోగ్యానికి గురికావడంతో మంగళవారం ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో అదేరోజు ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అప్పటికే తల్లికి కూడా కరోనా సోకింది. ఐసోలేషన్ కేంద్రంలో పట్టించుకునేవారు లేకపోవడంతో తల్లీకూతుళ్లు తండాకు చేరుకున్నారు. అప్పటికే సగం సచ్చి బతుకుతున్న ఆ కుటుంబంపట్ల సానుభూతి చూపకపోగా, తమకు కరోనా వస్తుందనే కారణంతో తండావాసులు వారిని వెలివేశారు. దీంతో ఊరుకు దూరంగా వారి సొంతపొలం వద్ద గుడారం ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ అక్కడే బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఈ విషయం మీడియాలో ప్రచారం కావడంతో స్పందించిన జిల్లా అధికారులు వెంటనే తండాకు చేరుకుని తల్లీకూతుళ్లను మళ్లీ సిరిసిల్లలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. చదవండి: మొక్కలు ఎందుకు ఎండిపోయాయ్.. కొత్తవి నాటండి: కేసీఆర్ -
టీషర్ట్ వేసుకొచ్చినందుకు అసెంబ్లీ నుండి గెంటేశారు..
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చూడసమా జీన్స్, టీషర్ట్ ధరించి రావడంతో ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాజేంద్ర త్రివేది అతన్ని అసెంబ్లీ నుండి బయటకు పంపించేశారు. గుజరాత్‌లోని సోమనాథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన విమల్ చూడసమా.. బ్లాక్ కలర్ టీషర్ట్ ధరించి అసెంబ్లీకి వచ్చారు. స్పీకర్ రాజేంద్ర త్రివేది ఎమ్మెల్యే డ్రస్ చేసుకున్న విధానంపై అభ్యంతరం చెప్పడంతో సభలో రగడ మొదలైంది. టీషర్ట్ ధరించి అసెంబ్లీకి రావొద్దనే చట్టాలేమైనా ఉన్నాయా..? ఉంటే అవి సభ ముందుకు తీసుకురావాలంటూ ఎమ్మెల్యే పట్టుబట్టడంతో స్పీకర్ ఆయనను మూడు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. తక్షణమే ఈ చర్య అమల్లోకి రావాలని స్పీకర్ ఆదేశించడంతో సదరు ఎమ్మెల్యేను సభ నుంచి బయటకు పంపించేశారు. కాగా, సభలో సభ్యులు సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండే దుస్తులు ధరించి అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ రాజేంద్ర త్రివేది బడ్జెట్ సమావేశాల తొలిరోజునే సభ్యులకు సూచించారు. అయితే, స్పీకర్ సూచనలను పక్కనపెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే టీషర్ట్, జీన్స్ ధరించి సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ వ్యవహారంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కలుగజేసుకుని ఎమ్మెల్యే సభ గౌరవాన్ని కాపాడేలా దుస్తులు ధరించి రావడం మంచిదని హితవు పలికారు. -
కొట్టి, తిట్టి లాగి పడేశారు- స్టాలిన్
-
కొట్టి, తిట్టి లాగి పడేశారు- స్టాలిన్
చెన్నై: డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ అసెంబ్లీ రగడపై తీవ్రంగా స్పందించారు. తమిళనాడు అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయుడికి తీరని అవమానం జరిగిందని ధ్వజమెత్తారు. స్పీకర్ సభా మర్యాదలు పాటించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. తన చిరిగిన చొక్కాను చూపిస్తూ కొట్టి, తిట్టి తమను బలవంతంగా బయటకు లాగిపడేశారని ఆరోపించారు. సభలో జరిగిన పరిణామాలు, పరిస్థితులను వివరించేందుకు గవర్నర్‌తో భేటీ కానున్నట్టు చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు. రహస్య ఓటింగ్ జరగాలని మరోసారి డిమాండ్ చేశారు. ఇందుకోసం అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తామని పేర్కొన్నారు. సభలోతీవ్రం గందరగోళ పరిస్థితుల మధ్య బయటికువచ్చిన డీఎంనే నేత స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను అవమానించారని మండిపడ్డారు. సభా మర్యాదలు పాటించలేదనిని మండిపడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నడుమ ప్రారంభంనుంచీ అసెంబ్లీలో రహస్య ఓటింగ్ పై రగడ నెలకొంది. దీంతో అసెంబ్లీ నుంచి డీఎంకే నేతలపై మార్షల్స్ రంగంలోకి దిగారు. ఒక్కొక్కర్నీ చేతులపై ఎత్తిపట్టుకునే బయటకు లాగి పడేశారు. కొంతమంది ఎమ్మెల్యే చొక్కాలు చిరిగా పోయాయి. పలువురికి గాయాలయ్యాయి. ముఖ్యంగా డీఏంకు నేత స్టాలిన్ కు చొక్కా చిరిగిపోయింది. దీంతో ఆందోళన మరింత ముదిరింది. డీఎంకే ఎమ్మెల్యేల బహిష్కరణ, స్పీకర్ పోడియం వద్ద స్టాలిన్ చేపట్టిన ధర్నా లాంటి ఉద్రిక్త పరిస్థితులమధ్య మార్షల్స్‌ను ఎమ్మెల్యేలను బయటకు లాగి పడేయడం కనిపించింది. దీంతో మరింత గందరగోళం చెలరేగింది.