కార్తీ చిదంబరంకు కాంగ్రెస్ షాక్
చెన్నె: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంకు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. ఆయనకు తమిళనాడు కాంగ్రెస్ శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇటీవల కాలంలో పార్టీకి, సీనియర్ నాయకుడు కామరాజ్ కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
పార్టీ హైకమాండ్ పై చేసిన వ్యాఖ్యలపై కూడా కార్తీని వివరణ అడిగామని టీఎన్ సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలన్ గోవన్ తెలిపారు. షోకాజ్ నోటీసుకు కార్తీ ఇచ్చే వివరణతో సంతృప్తి చెందకపోతే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించే అవకాశముందని చెప్పారు.