రాజ్‌పుత్ స్థానంలో మానవ్‌జిత్
రియో ఒలింపిక్స్‌కు భారత షూటింగ్ జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత షూటింగ్ జట్టును ప్రకటించారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో ‘రియో బెర్త్’ను దక్కించుకున్న సంజీవ్ రాజ్‌పుత్ భారత జట్టులో స్థానం కోల్పోయాడు. సెలక్షన్ ట్రయల్స్‌లో ట్రాప్ షూటర్ , ప్రపంచ మాజీ చాంపియన్ మానవ్‌జిత్ సింగ్ సంధూ నిలకడగా పాయింట్లు సాధించి రియో ఒలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. షూటింగ్లో భారత్ మొత్తం 12 బెర్త్‌లను సంపాదించింది. రాజ్‌పుత్ మినహా తమ కేటగిరీల్లో బెర్త్‌లను దక్కించుకున్న మిగతా 11 మంది షూటర్లు జాతీయ జట్టులోకి ఎంపికయ్యారు. హైదరాబాద్ నుంచి గగన్ నారంగ్, కైనన్ చెనాయ్ రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటారు.
రియో ఒలింపిక్స్‌కు భారత షూటింగ్ జట్టు: అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, చెయిన్ సింగ్, జీతూ రాయ్, గుర్ప్రీత్ సింగ్, ప్రకాశ్ నంజప్ప, మానవ్‌జిత్ సంధూ, కైనన్ చెనాయ్, మేరాజ్ అహ్మద్ ఖాన్, అపూర్వీ చండీలా, అయోనిక పాల్, హీనా సిద్ధూ.