EX-sarpanch
-
రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురం చైతన్య నగర్లో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేగింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి అంతయ్య(68) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేశారు. దీనికి రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యవహారాలే కారణమని అనుమానిస్తున్నారు. అతడి బంధువులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈయన దేవరకొండ సర్పంచ్‌గా కూడా పనిచేశారు. -
గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి
కర్నూలు: గుండెపోటుతో వ్యక్తి మరణించిన సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం అప్పలాపురం గ్రామంలో మంగళవారం తెళ్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామ మాజీ సర్పంచ్ పి.ప్రసాద్ రెడ్డి(42) సోమవారం అర్ధరాత్రి గుండెనొప్పితో బాధపడుతూ బనగానపల్లి ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ప్రసాద్ రెడ్డి మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన ప్రసాద్ రెడ్డి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఆ కోటి మాటేంటి..?
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: ‘ప్రజాధనాన్ని దిగమింగిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. క్రిమినల్ కేసులు పెట్టయినా తిన్న సొమ్ము కక్కిస్తాం, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు’ ఇవి రెండేళ్ల క్రితం జిల్లా పరిషత్ అధికారులు చేసిన వ్యాఖ్యలు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అధికారుల వైఖరిలో మార్పువచ్చింది. సొమ్ము దిగమింగిన మాజీ సర్పంచ్‌లపై కన్నెత్తయినా చూడడం లేదు. రికవరీ కావాల్సిన నిధుల గురించి ప్రశ్నిస్తే దాటవేసే ధోరణిలో సమాధానాలిస్తున్నారు. 2007 నుంచి 2011 సంవత్సరం వరకు పదవుల్లో ఉన్న సర్పంచుల్లో చాలామంది పనులు చేపట్టకుండానే నిధులు మింగేశారు. అప్పట్లో ఆడిట్ నిర్వహించిన బృందం జిల్లా వ్యాప్తంగా రూ.ఆరు కోట్ల మేర దుర్వినియోగం అయినట్టు గుర్తించి, పంచాయతీరాజ్ కమిషనర్‌కు నివేదిక అందించింది. ఆ నిధులను మాజీ సర్పంచ్ల నుంచి రికవరీ చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యనేత హుకుంతో వెనకడుగు రెండేళ్ల కాలంలో అధికారులు రూ. 6 కోట్లకు గాను రూ. 5 కోట్లను రికవరీ చేశారు. ఇంకా రూ.కోటి వరకు రికవరీ కాలేదు. మొదట్లో దూకుడుగా వ్యవహరించిన జిల్లా పరిషత్ అధికారులు కొంతమందిపై క్రిమినల్ కేసులు పెట్టారు. దీంతో భయపడిన అధికార పార్టీకి చెందిన మాజీ సర్పంచ్‌లు ఆ పార్టీ పెద్దలను ఆశ్రయించారు. పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత... ఆ మాజీ సర్పంచ్ల జోలికి వెళ్ల వద్దని హుకుం జారీచేనట్టు భోగట్టా. దీంతో జిల్లా పరిషత్ అధికారులు వెనక్కితగ్గారని వినికిడి. అధికార పార్టీ నేత ఆదేశాలను ధిక్కరిస్తే ఉద్యోగానికి ఎసరు వస్తుందని భయపడి చర్యలకు వెనుకాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వంద మంది మాజీ సర్పంచ్ల నుంచి నిధులు రికవరీ చేయూల్సి ఉంది. వీరిలో చీపురుపల్లి నియోజకవర్గంలో 40 మంది వరకు ఉన్నట్టు సమాచారం. వీరందరూ అధికార పార్టీకి చెందిన వారే. ఇదే విషయాన్ని జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి ఎన్.మోహన్‌రావు వద్ద‘ న్యూస్‌లైన్’ ప్రస్తావించగా రూ. కోటి వరకు నిధులు ఇంకా రికవరీ కావాల్సిన విషయం వాస్తమేనని, రికవరీ కోసం ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. త్వరలోనే రికవరీ చేస్తామని చెప్పారు. -
అనుమానం పెనుభూతమై..
మర్రిగూడ, న్యూస్‌లైన్: అనుమానం పెనుభూతమైంది .. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడిని దారుణంగా హతమార్చాడు. ఈఘటన మర్రిగూడ మండలం అంతంపేట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కట్టెల యాదయ్య (38) ఉదయం తన మోటార్‌సైకిల్‌పై బీసీ కాలనీకి వెళ్లాడు. కాలనీకి చెందిన గుర్రాల సోమమ్మ ఇంటిముందు బైక్‌ను ఆపి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన గొడ్డటి రాములు గొడ్డలితో వెనుకనుంచి యాదయ్యపై దాడి చేశాడు. ఒక్కసారిగా ఎంజరుగుతుందో అని తెలుసుకునేలోపే యాదయ్య మెడపై గొడ్డలితో వేటు వేశాడు. దీంతో అతడు కిందపడడం తో పలుమార్లు విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో యాదయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాతే రాము లు అక్కడి నుంచి పరారయ్యాడు. మూడు మాసాల క్రితమే.. మాజీ సర్పంచ్ యాదయ్య, బీసీ కా లనీకి చెందిన రాములు మధ్య ఉన్న తగాదాలు మూడు మాసాల క్రితమే బయటపడినట్టు తెలిసింది. గతంలో యాదయ్య సర్పంచ్‌గా పోటీచేసినప్పుడు రాములు పూర్తి మద్దతు ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాలకు మంచి సఖ్యత ఉంది. దీంతో యాదయ్య తరచు రాములు ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే యాదయ్య తన భార్య తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం రాములుకు కలి గింది. దీంతో అతడు యాదయ్యను ఇకపై బీసీ కాలనీకి రావొద్దని పలుమార్లు హెచ్చరించినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. రాములు మాటలను యాదయ్య పెడచెవిన పెటక బీసీ కాలనీకి వచ్చిపోతున్న నేపథ్యంలోనే పథకం ప్రకారం హత్య చేసినట్టు తెలుస్తోంది. వీధిన పడిన కుటుంబం మాజీ సర్పంచ్ యాదయ్య దారుణ హత్యకు గురవడంతో ఆయన కుటుం బం వీధిన పడింది. ఈయనకు భా ర్య, ఇద్దరు చిన్న వయస్సు కలిగిన కుమారులు ఉన్నారు. యాదయ్య ప్రస్తుతం కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈయన సర్పంచ్ పదవీ కాలం అయిపోయినప్పటి నుంచి పదేళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు నెలల కిత్రం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానంలో పోటీ చేసి ఓడిపోయాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యాద య్య దారుణ హత్యకు గురయ్యాడనే విషయాన్ని తెలుసుకుని దేవరకొండ డీఎస్పీ సోమశేఖర్, నాంపల్లి సీఐ శివరాంరెడ్డి, మర్రిగూడ, గుర్రంపోడ్, చింతపల్లి, నాంపల్లి మండలాల ఎస్ఐలు శంకర్‌రెడ్డి, గౌరినాయుడు, ధనుంజయ్‌గౌడ్, దీపన్నలు ఘటన స్థలానికి వచ్చారు. హత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి తీయమని మృతుడి బంధువులు తేల్చిచెప్పారు. నింది తుడు రాములును శిక్షించాలని డిమా ండ్ చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుని న్యాయం చేస్తామని డీఎస్పీ హామీమేరకు వారు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గ్రామంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.