exam completes
-
సజావుగా ఏపీపీఎస్సీ పరీక్ష
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన గ్రూప్–3 మెయిన్ పరీక్ష తొలిరోజు సజావుగా ముగిసింది. 12 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 1,735 మంది అభ్యర్థులకు గానూ 1,620 మంది హాజరయ్యారు. 115 మంది గైర్హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణి ఎస్ఎస్బీఎన్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ విజయకుమార్ 12 కేంద్రాలను తనిఖీ చేశారు. రెండో రోజు సోమవారం ఆరు కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 899 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. -
సజావుగా ఏపీసెట్
ఎస్కేయూ: ఏపీసెట్ (ఆంధ్రప్రదేశ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)–2017 ఆదివారం అనంతపురం నగరంలోని 13 కేంద్రాల్లో సజావుగా నిర్వహించినట్లు రీజనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎ.మల్లికార్జునరెడ్డి అన్నారు. మొత్తం 7,934 మంది అభ్యర్థులకు గాను 5,900 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. కాగా ఎస్కేయూ క్యాంపస్ కళాశాల, ఎస్వీ డిగ్రీ కళాశాల, ఎస్ఎస్బీఎన్ , అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల, ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను ఎస్కేయూ రెక్టార్ ప్రొఫెసర్ హెచ్.లజిపతిరాయ్, దూరవిద్య డైరెక్టర్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు, సెట్ రీజనల్ కో ఆర్డినేటర్ ఎ.మల్లిఖార్జునరెడ్డి తదితరులు పరిశీలించారు.