నేడు ఏఈ పోస్టులకు పరీక్ష
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిష¯Œన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు ఆదివారం జరగుతున్న పరీక్షను నగరంలో ఐదు కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలియజేశారు.