Excel
-
హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా భారీగా ఐటీ రైడ్స్
-
HYD: భారీ స్థాయిలో ఐటీ రైడ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఐటీ దాడుల పర్వం మొదలైంది. ఇందులో భాగంగా రాజధాని నగరంలో భారీ స్థాయిలో సోదాలకు ఇన్కమ్ ట్యాక్స్ శాఖ సిద్ధమైనట్లు తెలుస్తోంది. బుధవారం వేకువ జామునే ఐటీ రైడ్స్‌తో ఉత్కంఠకు తెర తీసింది ఆర్థిక విభాగం. హైదరాబాద్‌లోని ఐటీ ఆఫీస్ నుంచి బయల్దేరారు ఐటీ అధికారులు. సుమారు 40 కార్లు, మూడు సీఆర్పీఎఫ్ వెహికిల్స్ లో ఐటీ బృందాలు రైడ్స్‌కు బయలుదేరాయి. తాజా సమాచారం ప్రకారం.. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లక్ష్యంగా దాడులకు దిగినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఐకియా షోరూం పక్కన ఉన్న ఎక్సెల్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. 10:25AM ► ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై ఐటీ దాడులు సాగుతున్నాయి. బాచుపల్లిలోనూ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. అలాగే ఆరుగురు డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. 10:36AM ► 20 చోట్ల కొనసాగుతున్నాయి ఐటీ సోదాలు. ఆరుగురు డైరెక్టర్ల ఇళ్లతోపాటు చైర్మన్ సీఈఓ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఎక్సెల్ గ్రూప్ కి అనుబంధంగా ఉన్న మరొక 10 కంపెనీలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలితో పాటు మాదాపూర్ బాచుపల్లిలోని కార్యాలయాల్లో సోదాలు సాగుతున్నాయి. మరోవైపు రబ్బర్ ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్‌లో భారీగా తేడాలతో పాటు ట్యాక్స్ చెల్లింపు లో అవకతవకలు జరిగినట్లు సమాచారం అందుతోంది. 10:45AM ► సంగారెడ్డి లోని నాలుగు కంపెనీలో సోదాలు కొనసాగుతున్నాయి. నార్సింగ్ లోని ఆరు చోట్ల, బాచుపల్లి దుండిగల్ లోని 4 కంపెనీలలో సోదాలు నడుస్తున్నాయి. 11:31AM ► లండన్ నుంచి 500 కోట్ల ఫండ్ exel కంపెనీలలో పెట్టుబడి పెట్టినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈ క్రమంలో.. ఆ లెక్కపై ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. -
పతకాలు ‘దండి’గా!.. అంతర్జాతీయ పతకమే లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన యువ అథ్లెట్ దండి జ్యోతికశ్రీ మహిళల 400 మీటర్ల వ్యక్తిగత పరుగు విభాగంలో రికార్డులు సృష్టిస్తోంది. గత సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన తొలి అండర్–23 అథ్లెటిక్ చాంపియన్ షిప్లో 53.05 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణంతో మెరిసి యావత్తు క్రీడాలోకం దృష్టిని ఆకర్షించింది. జాతీయ స్థాయిలో ఏకంగా 18 పతకాలతో సత్తా చాటి భారత ఒలింపిక్ చాంప్ శిక్షణ జట్టులో స్థానం దక్కించుకుంది. చదవండి: ఆండ్రూ సైమండ్స్ గొప్ప ఆల్‌రౌండర్.. కానీ ఆ వివాదాల వల్లే.. 6 నెలలుగా త్రివేండ్రంలోని నేషనల్ అథ్లెటిక్ క్యాంపు (ఎన్ఏసీ)లో అంతర్జాతీయ కోచ్ గలీనా (రష్యా) పర్యవేక్షణలో తర్ఫీదు పొందుతోంది. ఈ ఏడాది చైనాలో జరగాల్సిన ఏషియన్స్లో గేమ్స్ వాయిదా పడటంతో జూలైలో ఇంగ్లాండ్‌లో జరిగే కామన్వెల్త్ పోటీలపై దృష్టి సారించింది. ముందుగా జూన్‌లో జరిగే ఇంటర్ స్టేట్ అథ్లెటిక్ చాంపియన్ షిప్లో విజయం సాధించి, అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 50 రోజుల క్యాంపులో భాగంగా టర్కీలో మెలకువలు నేర్చుకుంటోంది. శాయ్ సెంటర్లో శిక్షణ.. జ్యోతికశ్రీ 2016 నుంచి సుమారు నాలుగేళ్ల పాటు విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) సెంటర్లో చీఫ్ కోచ్ వినాయక ప్రసాద్ పర్యవేక్షణలో రాటుదేలింది. ఈ క్రమంలో 2017 బ్యాంకాక్‌లో జరిగిన రెండో ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో నాల్గవ స్థానంలో నిలిచింది. అదే ఏడాది కెన్యాలోని నైరోబి నగరంలో జరిగిన ప్రపంచ అండర్–18 చాంపియన్‌షిప్‌లో, 2016 టర్కీ దేశంలోని ట్రాబ్జోన్ నగరంలో వరల్డ్ స్కూల్ గేమ్స్ చాంపియన్ షిప్లో మెరుగైన ప్రదర్శన కనబరచడంతో పాటు జాతీయ పోటీల్లోనూ జూనియర్ విభాగంలో 400 మీటర్ల వ్యక్తిగత పరుగు, రిలే విభాగాల్లో కలిపి ఏకంగా 7 స్వర్ణాలు, 6 రజత, 3 కాంస్య పతకాలను ఒడిసిపట్టింది. ఏడాదిన్నర కిందట హైదరాబాద్‌లోని శాయ్ సెంటర్లో కోచ్ రమేష్ శిక్షణలో సీనియర్ విభాగంలోకి అడుగిడిన తర్వాత ఈ ఏడాది కాలికట్లో జరిగిన 25వ జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. తండ్రే తొలి గురువు.. జ్యోతికశ్రీ తండ్రి శ్రీనివాసరావు బీరువాలు తయారు చేసే వ్యాపారి. బాడీ బిల్డర్ కావాలని కలలు కన్న ఆయనకు ఆర్థిక ఇబ్బందులు లక్ష్యాన్ని దూరం చేశాయి. అయితే పాఠశాల పరుగు పోటీల్లో చిన్న కుమార్తె జ్యోతికశ్రీలో ప్రతిభను గమనించి క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఆయనే తొలి గురువుగా మారి నిత్యం దగ్గరుండి రన్నింగ్ ప్రాక్టీస్ చేయించేవారు. ఈ క్రమంలోనే 7వ తరగతిలోనే జ్యోతికశ్రీ రన్నింగ్‌పై మక్కువ పెంచుకుంది. తొలిసారిగా 2015 విశాఖలో జరిగిన జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ మీట్లో 1000 మీటర్ల విభాగంలో కాంస్యంతో అదరగొట్టింది. ఇక శాయ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న తరుణంలో జ్యోతికశ్రీ బయట హాస్టళ్లలో ఉండాల్సి వచ్చేది. ఈ క్రమంలో తండ్రి శ్రీనివాసరావు తనకు వచ్చే ఆదాయంలో నెలకు రూ.20 వేలకుపైగా జ్యోతికశ్రీ శిక్షణకు ఖర్చు చేసేవారు. రైలు ప్రయాణం చేస్తే అలసిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తన కుమార్తె పోటీలకు వెళ్లేటప్పుడు శ్రీనివాసరావు అప్పుచేసి మరీ విమాన టికెట్లు తీసేవారు. అంతర్జాతీయ పతకమే లక్ష్యం జూలైలో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించటంతోపాటు పతకం గెలవటమే లక్ష్యంగా సాధన చేస్తున్నాను. 400, 100 మీటర్ల పరుగు విభాగంలో ఒలింపిక్స్ కోసం సిద్ధం చేస్తున్న 8 మంది క్రీడాకారిణుల జట్టులో తెలుగు రాష్ట్రాల నుంచి నేను ఉండటం గర్వంగా ఉంది. ప్రస్తుతం నా టైమింగ్‌ను మరింత మెరుగుపరచుకుందేకు ప్రయత్నిస్తున్నాను. – దండి జ్యోతికశ్రీ, అథ్లెట్ -
ఆడుతూ..పాడుతూ కోట్లు సంపాదిస్తుంది..ఎలా అంటే?
డబ్బులు సంపాదించేందుకు కష్టపడుతున్నారా? అయితే కష్టపడొద్దు. ఇష్టపడండి. ఇష్టపడితే మీరు అనుకున్న విధంగా డబ్బులు సంపాదించవచ్చని చెబుతోంది ఓ యువతి. అంతేకాదు స్వతంత్రంగా డబ్బులు సంపాదించేందుకు ఎంఎన్సీ ఉద్యోగానికి రిజైన్ చేసింది. ఆడుతూ పాడుతూ కోట్లు సంపాదిస్తుంది. మైక్రోసాఫ్ట్ ఎక్స్ఎల్ వస్తే కోట్లు సంపాదించవచ్చని మీకు తెలుసా? ది ఎక్స్‌ప్రెస్ ప్రకారం 27 ఏళ్ల కాట్ నార్టన్ (@miss.excel) మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ను ఆన్లైన్లో నేర్పిస్తుంది. ఇందుకోసం ఏడాది క్రితం జాబ్‌కు రిజైన్ చేసి యూట్యూబ్‌లో వీడియోస్ అప్లోడ్ చేయడం ప్రారంభించింది. సీన్ కట్ చేస్తే ఏడాది తిరిగే సరికల్లా ఆమె నెలవారీ సంపాదన ఎంతో తెలుసా? అక్షరాల కోటి రూపాయలకు పై మాటే. అందరిలా కాట్ నార్టన్ కు ఎవరిమీద ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతకాలని, డబ్బులు సంపాదించాలని అనుకుంది. అనుకున్నట్లుగా గతేడాది నవంబర్‌లో యూట్యూబ్ తోపాటు ఇతర సోషల్ మీడియా నెట్ వర్క్‌లలో ఆన్లైన్ టుట్యూరియల్ను ప్రారంభించింది. యూజర్లు అట్రాక్ట్ అయ్యే విధంగా వివిధ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోలు చేసింది. పనిలో పనిగా అదే ఎక్స్ఎల్ టిప్స్‌ను ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ వీడియోలు అప్లోడ్ చేసింది. పెయిడ్ కోర్స్‌లను ప్రారంభించింది. అలా సరదాగా ప్రారంభమైన ట్యుటోరియల్ వీడియోలతో భారీ ఎత్తున సంపాదిస్తుంది. సుమారు నెలకు కోటిరూపాలయకు పైగా సంపాదిస్తున్నట్లు ది ఎక్స్ ప్రెస్ తన కథనంలో పేర్కొంది. చదవండి:ఇకపై వాట్సాప్ నుంచి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే? -
ఆఫీస్ 365కి 2.5 కోట్ల యూజర్లు
భారత్‌లో మైక్రోసాఫ్ట్ లక్ష్యమిది న్యూఢిల్లీ: క్లౌడ్ ఆధారిత ‘ఆఫీస్ 365 పర్సనల్’ భారత్‌లో 2.5 కోట్ల మంది వినియోగదార్లకు అందించడంపై దృష్టిపెట్టినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్ తదితర అప్లికేషన్లను ఉపయోగించేందుకు వీలుకల్పించే ఈ సాఫ్ట్‌వేర్‌కు వినియోగానికిగాను నెలకు రూ.330 చొప్పున చార్జీని వసూలు చేయనుంది. ‘చౌక సబ్స్క్రిప్షన్ ఆప్షన్‌తో లభించే ఈ ఆఫీస్ సూట్‌ను విండోస్/మ్యాక్ పీసీలలో వాడుకోవచ్చు. కాగా, మొబైల్ వెర్షన్స్(ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లలో)కు ఏడాదికి రూ.3,299 చొప్పున ఫీజు ఉంటుంది. రాబోయే ఏడాది కాలంలో భారత్‌లో ఈ సేవలకు 2.5 కోట్ల మంది యూజర్లను సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రధానంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదార్ల నుంచి అధిక సబ్స్క్రిప్షన్ లభిస్తుందని భావిస్తున్నాం’ అని మైక్రోసాఫ్ట్ కంట్రీ జనరల్ మేనేజర్(కన్సూమర్ చానల్స్ విభాగం) చక్రపాణి గొల్లపల్లి పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి సాధించిన ప్రొడక్ట్‌గా ఈ ఆఫీస్ 365 నిలుస్తోందని, అందుబాటులోకి తెచ్చిన కొద్దికాలంలోనే 2 బిలియన్ డాలర్లకుపైగా వ్యాపారాన్ని సాధించినట్లు కూడా ఆయన వెల్లడించారు. కాగా, మాల్స్‌లో నేవిగేషన్‌కు ఉపయోగపడే వెన్యూ మ్యాప్స్‌ను కూడా మైక్రోసాఫ్ట్ ఈ సందర్భంగా ప్రదర్శించింది. నోకియా మ్యాప్స్ అప్లికేషన్‌తో పాటు బింగ్ ద్వారా కూడా సంబంధిత డేటా లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టులతోపాటు దేశంలోని 120 మాల్స్‌కు సంబంధించిన డేటాను ఈ అప్లికేషన్లో పొందుపరిచినట్లు పేర్కొంది.