Excitement the competition
-
‘మహా’ సీఎంపై పీటముడి!
ముంబై: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలూ ఇందుకోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. ప్రస్తుత సీఎం, శివసేన (షిండే) అధినేత ఏక్నాథ్ షిండే మరోసారి అవకాశం ఆశిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కూడా తం ఆ పోస్టుపై కన్నేసినట్టు చెబుతున్నారు. బీజేపీ మాత్రం ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పార్టీ ముఖ్య నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న మహాయుతి ఎమ్మెల్యేల భేటీపైనే అందరి కళ్లూ నిలిచాయి. ఈ భేటీలోనే కొత్త సీఎంను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుత శాసనసభ గడువు మంగళవారంతో తీరనుంది. కనుక ఆలోపు కొత్త సర్కారు కొలువుదీరడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో కొత్త సీఎం ప్రమాణస్వీకారం మంగళవారం ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగే అవకాశముంది. మూడు పార్టీల అగ్రనేతలు ఆదివారం తమ ఎమ్మెల్యేలతో చర్చల్లో మునిగితేలారు. ఎన్సీపీ శాసనసభాపక్ష నాయకుడిగా అజిత్‌ను ఆ పార్టీ నూతన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. నూతన సీఎంను మహాయుతి నేతలతో కలిసి తమ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులే చెప్పారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి ఫడ్నవీస్‌కు కుల సమీకరణాలు ప్రతికూలంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానిదే అన్నింటా పైచేయి. ఇప్పటిదాకా సీఎంగా చేసిన వారిలో ఏకంగా 13 మంది ఆ సామాజికవర్గానికి చెందినవారే. ఈసారి కూడా తమ సామాజిక వర్గానికే సీఎం పీఠం దక్కాలని వారు ఆశిస్తున్నారు. ఫడ్నవీస్‌ను మరోసారి సీఎం చేయాలన్న ఆలోచనను చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మరాఠా వ్యతిరేకిగా ఆయనకున్న ఇమేజీని గుర్తు చేస్తున్నారు. మహారాష్ట్ర జనాభాలో మరాఠాలు 30 శాతం కాగా బ్రాహ్మణులు 10 శాతమున్నారు. మనోహర్ జోషీ తర్వాత మహారాష్ట్ర సీఎంగా చేసిన రెండో బ్రాహ్మణ నేతగా ఫడ్నవీస్ నిలిచారు. -
Viral Video: ఫుడ్ పెట్టబోతున్నారని.. ఎక్సయిట్మెంట్ తట్టుకోలేకపోతున్న కుక్క
-
చిత్రకుటీర్
‘‘రేపటి నుంచి ఈ షెడ్యూల్ షూటింగ్ మొత్తం చిత్రకుటీర్ స్టూడియోలో’’ చెప్పాడు ద్యుతికి ఆమె తండ్రి.ఆ క్షణం నుంచి ఆమె కాలు నేల మీద నిలవడం లేదు. ఎక్సైట్మెంట్తో ఆ రాత్రి నిద్ర కూడా పోలేదు. తనకు ఊహ తెలిసిననాటి నుంచి సినిమాలంటే పిచ్చి ఉండేది కాని నటి కావాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. చిత్రకుటీర్ స్టూడియో గురించి కథలు కథలుగా చెప్తూంటే వింటూ పెరిగింది. ఆ ప్రొడక్షన్ సినిమాలు దాదాపుగా చూసింది. ఎప్పటికైనా ఆ స్టూడియో చూడాలని ఆశ. తన భరతనాట్య ప్రదర్శనలు చూసిన ప్రతివాళ్లూ తండ్రికి సలహా ఇచ్చేవారు.. ‘‘అమ్మాయి చక్కగా ఉంది.. అభినయం అద్భుతం.. సినిమాల్లో ట్రై చేయలేకపోయారా?’’ అంటూ. చిత్రకుటీర్ మీదున్న ఆకర్షణతో తండ్రి చేసే ప్రయత్నాలకు అడ్డు చెప్పలేదు ధ్యుతి.ఫస్ట్ చాన్స్ తమిళ్లోనే వచ్చింది. యూరేకా అనుకుంది మనసులో. చాలా తమిళ సినిమాల ఇండోర్ షూటింగ్ అంతా చెన్నైలో ఉన్న చిత్రకుటీర్లోనే అవుతుంది కాబట్టి. తీరా తొలి క్లాప్ తర్వాత తెలిసిందేంటంటే ఆ సినిమా మొత్తం అవుట్డోరేనని. నీరసపడిపోయింది. ఆనక చేసిన మూడు తెలుగు సినిమాలూ చిత్రకుటీర్కు దూరంగానే పూర్తయ్యాయి. అయిదో సినిమా.. అదీ సెకండ్ షెడ్యూల్‌కి గానీ అవకాశం రాలేదు. చిత్రకుటీర్.. తనకే కాదు.. సినిమా రంగంలోని నటీనటులు అందరికీ ఇష్టమైన స్టూడియో. వావ్... ఆ ఉద్విగ్నతతోనే బలవంతంగా నిద్రలోకి జారుకుంది ద్యుతి. మరిచిపోనివ్వకుండా కలలోనూ కదలాడింది చిత్రకుటీర్. కొండలు.. కోనలు.. జలపాతాలు.. సెలయేర్లు.. పూల వనాలు.. దట్టమైన అడవులు.. రాజభవనాలు.. కోటలు.. మాంత్రికుల గుహలు.. దయ్యాల పొదలు.. గుళ్లు.. గోపురాలు.. మోడర్న్ కాలనీలు.. థియేటర్లు.. పార్క్‌లు.. ఫ్లై ఓవర్లు.. రైల్వే స్టేషన్.. ఒక్కటేమిటి.. చిన్న సైజు దేశాన్నే కట్టేశారు.విప్పారిన కళ్లు.. ఉప్పొంగిన మనసుతో... స్టూడియో అంతా తిరిగింది... ఆడింది... పాడింది.. ఆ అనుభూతిని ఆలింగనం చేసుకుంటూ.. ఓ చోట ఆగిపోయింది ద్యుతి... చప్పున లేచి కూర్చుంది. ‘‘అంత అందంగా ఊరించి ఇంత భయపెట్టిందేంటి? పాడు కల.. బాబోయ్..’’ అనుకుంటూ తన చేత్తో తనే వీపుని చరుచుకుంది... భయం పోవడానికి. ‘‘ఇంకా ఎంతసేపూ.. అవతల డైరెక్టర్ కేకలేస్తున్నాడు..’’ విసుక్కుంటూ అసిస్టెంట్ డైరెక్టర్.‘‘మేకప్.. అయిపోవచ్చింది..’’ అపాలజీ ఇస్తున్నట్టుగా ద్యుతి తండ్రి. ‘‘హీరో వచ్చే టైమ్‌కల్లా ఉండకపోతే.. ఈ రోజు సత్తెనాశ్...చెప్తున్నా...’’ హెచ్చరిస్తూ వెళ్లిపోయాడు అసిస్టెంట్ డైరెక్టర్.ధ్యుతి తండ్రీ అంతే హడావిడిగా మేకప్ రూమ్ వైపు పరిగెత్తాడు. తలుపు వేసి ఉంది. ‘‘ద్యుతీ... త్వరగా రా.. హీరో వచ్చేశారు’’తలుపుకొడుతూ చెప్పాడు. ‘‘అయిదు నిమిషాలు నాన్నా..’’ తలుపు తీయకుండానే జవాబు చెప్పింది ధ్యుతి. అయిదు నిమిషాలు అంది కాని.. అయిదు గంటలే పట్టేట్టుంది. ఇప్పుడప్పుడే అక్కణ్ణించి కదలాలని లేదు ద్యుతికి. గ్రీన్ రూమా ఇది? తాము ముస్తాబు కావడానికి దేవకాంతలు స్వయంగా డిజైన్ చేసుకున్నారేమో అన్నంత అద్భుతంగా ఉంది... అన్నీ అద్దాలే... గోడల్లేవ్. ఒకదాన్నిమించి ఒకటి... తనను అందంగా చూపించడానికి పోటీ పడుతున్నట్టున్నాయ్!అద్దాల ముందు రకరకాల పోజుల్లో నిలబడి తన సౌందర్యానికి తానే ముగ్ధురాలవుతోంది ద్యుతి...అభినయిస్తోంది... కెమెరా కన్ను కన్నా.. సిల్వర్ స్క్రీన్ కన్నా గొప్పగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి ఆ అద్దాలు.. నవ్వుతోంది.. ఏడుస్తోంది.. చిలిపిగా చూస్తోంది.. కొంటెగా కళ్లెగరేస్తోంది... బుంగమూతితో అలుగుతోంది.. కోపంగా కళ్లురుముతోంది.. ఒక్క అద్దం ముందు నిలబడి ఇస్తున్న ఎక్స్‌ప్రెషన్స్‌ను అన్ని అద్దాలు ప్రతిబింబింపజేస్తు్తన్నాయి.. ఆశ్చర్యంగా మెడను మాత్రమే తిప్పి వెనక ఉన్న అద్దాల్లోకి చూసింది.. వాటి ఎదురుగా నిలబడి ఉన్నట్లు తన ప్రతిబింబాన్ని చూపిస్తున్నాయి. మళ్లీ ముందుకు తిరిగింది.. తన వెనకాలో ఎందరో మనుషులున్నట్లు కనపడ్తోంది ప్రతి అద్దంలో. అందరూ ఆడవాళ్లే! పదహారేళ్ల అమ్మాయి నుంచి డెబ్భై ఏళ్ల వయసుదాకా ! ఓ అమ్మాయి ఏడుస్తోంది.. ఇంకో యువతి నవ్వుతోంది.. ఒకావిడ కోపంగా చూస్తోంది.. ఓ అమ్మ దీనంగా మొహం పెట్టింది.. ఇంకో అవ్వ జాలిపడ్తూన్నట్టు... చటుక్కున్న వెనక్కి తిరిగింది ద్యుతి.. ఎవ్వరూ లేరు.. మళ్లీ అద్దంలోకి చూసింది.. ఏడుస్తూ.. నవ్వుతూ.. కోపంగా.. దీనంగా.. జాలిపడుతూ.. ఆ స్త్రీలే! ఈసారి వాళ్ల వెనకాల రకరకాల వయస్సుల్లోని మగవాళ్లు గుంపులు గుంపులుగా! భృకుటి ముడి వేసి తీక్షణంగా చూస్తున్నారు.. ఆ మహిళలందరినీ కంట్రోల్ చేస్తున్నట్టుగా! ఒక్కో అద్దం ముందుకు పరిగెడ్తోంది ద్యుతి.. అన్ని అద్దాల్లో అవే ప్రతిబింబాలు... ఆమెను చుట్టిముట్టి... ట్రాలీలా తిరుగుతున్నట్టు... భరించలేక రెండు అరచేతులతో చెవులను మూసుకుంటూ తలవంచి కుర్చీలో కూలబడ్డది. కొన్ని క్షణాలకు శాంతించినట్టయి నెమ్మదిగా తల పైకెత్తింది...ఎదురుగా ఉన్న నిలువుటద్దంలో.. అచ్చం తనలాగే.. తనలాగే ఏంటి.. తనే! విరబోసుకున్న జుట్టును ముందుకు వేసుకొని.. అద్దంలోంచి బయటకు వచ్చి తన పాదాల మీద పడ్తోంది జుట్టు.. ఒళ్లు జలదరించినట్టయి చటుక్కున పాదాలను వెనక్కి లాక్కుంది.. ఆ చర్యకు అద్దంలోని «ఆమె నవ్వింది.. కనుబొమలెగరేస్తూ! అంతలోకే చేతులు చాచి.. తన చుబుకం పట్టుకొంది..‘‘ఏయ్.. ఎవరు నువ్వు?’’ అంటూ ఆ చేయిని తోసేయబోయింది..ద్యుతి. ఏ స్పర్శా తగలక చేయి గాల్లోనే ఆడింది. ఆ విసురికి ఎదురుగా ఉన్న అద్దానికి కొట్టుకొని దెబ్బ తగిలింది. ‘‘ప్చ్.. ప్చ్..ప్చ్.. పాపం’’ అంటూ వెటకారం చేస్తోంది అద్దంలోని ««ఆమె. ‘‘ఏయ్... ’’అరిచింది అహం దెబ్బతిన్న ద్యుతి. ‘‘ష్.. అరవకు.. నీ కేకలు ఈ గది దాటి మూడో చెవికి వినిపించవ్’’ కోపంగా అద్దంలోని బింబం. ఏడుపొస్తోంది ద్యుతికి.. కలా ? నిజమా? కలంటే గుర్తొకొచ్చింది.. రాత్రి కలలో.. ఇదే మేకప్ రూమ్.. ఈ మనుషులే.. !ఆ జ్ఞాపకానికి వెన్నులోంచి వణుకు.. లేచి నిలబడింది...వెంటనే ఎదురుగా ఉన్న అద్దంలోని ఆమె కూర్చుంది. ఇవతల ద్యుతికి షాక్.. అసంకల్పితంగానే తనూ కుర్చీలో కూర్చుంది అద్దంలోంచి చూపు మరల్చకుండానే. తక్షణమే అద్దంలోని «ఆమె నిలబడింది! ‘‘దేవుడా.... ఏంటిదంతా? నన్నెందుకు వేటాడుతున్నావ్? ఇందాకటి వాళ్లంతా ఎవరు? అసలు ఈ గది ఏంటి?’’ఏడుస్తోంది ద్యుతి. ‘‘హూ..దేవుడా? ఎక్కడా? ఇక్కడ దేవుళ్లుండరు. కన్నీళ్లు దాచుకో .. ముందు ముందు అవసరమవుతాయ్. ఏడుస్తూనే చావాలి కదా’’ అద్దంలోంచి.బిత్తరపోయింది ఆ మాటలకు ద్యుతి. ‘‘ఊ.. అవును. నీలాగే మేమంతా నటులమే. చిత్రకుటీర్ గురించి ఎన్నో డ్రీమ్స్‌తో వచ్చినవాళ్లమే. మా వెనకాల కనిపించిన మగవాళ్లంతా.. మమ్మల్ని వాడుకుని మా జీవితాల్ని ఇక్కడే సమాధి చేశారు. రేపు నీ గతీ అంతే! వెళ్లిపో.. ఇక్కడినుంచి కదులు.. వీళ్లంతా చెబితే నేను వినలేదు.నాలాగా.. వీళ్లందరిలా నువ్వు కావొద్దు.. పో... వెళ్లిపో! ’’ గద్దిస్తోంది అద్దంలోంచే తన పైపైకి వస్తూ ఆమె.చిగురుటాకులా వణికిపోతూ... ‘‘పోతా.. ఇప్పుడే వెళ్లిపోతా.. నన్నేం చేయొద్దు ప్లీజ్..’’ అని చేతులు జోడించి.. వెనక్కి తిరిగి.. తిరిగి ప్రాధేయ పడుతూ.. తలుపు తెరిచి..బయటకు పరిగెత్తింది ద్యుతి.గది అవతల సిగరేట్ కాలుస్తూ నిలబడ్డ ద్యుతి తండ్రికి తన కూతురు ఎందుకలా పరిగెడ్తోందో.. అర్థం కాలేదు. సిగరేట్ కిందపడేసి కాలితో నులిమి ‘‘ద్యుతీ.. ఆగు.. ఆగమ్మా.. ’’ అంటూ కూతురి వెనక పరుగులు తీశాడు. - సరస్వతి రమ -
ముగిసిన క్రీడా సంబరం
రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో రెండురోజులపాటు జరిగిన జిల్లా అంతర్ కళాశాలల ‘యువతరంగం క్రీడోత్సవాలు’ బుధవారం రాత్రి ముగిశాయి. రెండో రోజూ పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన 17 కళాశాలలల విద్యార్థులు నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. క్రీడాస్ఫూర్తినిచాటారు. విజేతలకు ముగింపు కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేశారు. రాజమండ్రి సిటీ : విద్యార్థులు చదువుతోపాటు ఆటలకూ ప్రాధాన్యం ఇవ్వాలని ఉన్నతవిద్యాశాఖ రీజనల్ జాయింట్ డెరైక్టర్ గంగేశ్వరరావు సూచించారు. బుధవారం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరిగిన జిల్లా అంతర కళాశాలల పోటీల ముగింపు కార్యక్రమంలో విజేతలకు ఆయన బహుమతులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు వివిధ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడల్లో సత్తాచాటారు. గెలుపే లక్ష్యంగా తలపడ్డారు. పోటీల్లో విజేతలు వీరే.. విజేతలు వీరే... పురుషల విభాగంలో.. బాడ్మింటన్‌లో విజేత అమలాపురం ఎప్కేబీఆర్, రన్నర్ కాకినాడ పీఆర్జేసీ కాలేజ్ * చెస్‌లో విజేత కాకినాడ పీఆర్‌జి కాలేజ్, రన్నర్ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ * వాలీబాల్‌లో విన్నర్ రాజమండ్రి ఎస్‌కేవీటీ కాలేజ్, రన్నర్ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ * ఖోఖోలో విన్నర్ కాకినాడ పీఆర్జీ కాలేజ్, రన్నర్ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ * కబడ్డీలో విన్నర్ ఎస్‌కేవీటీ రాజమండ్రి, రన్నర్ రాజమండ్రి ఏకేసీ కాలేజ్ మహిళల విభాగంలో.. * వాలీబాల్‌లో విన్నర్ రాజమండ్రి రాజ్యలక్ష్మి కాలేజీ, రన్నర్ రాజమండ్రి ఎస్‌కేవీటీ * కబడ్డీలో విన్నర్ కాకినాడ ఏఎస్డీ ఉమెన్స్, రన్నర్ రాజమండ్రి జీడీసీ * ఖోఖోలో విన్నర్ కాకినాడ ఆదిత్య కాలేజ్, రన్నర్ కాకినాడ ఏఎస్డీ కాలేజ్ * బాడ్మింటన్‌లో విన్నర్ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్, రన్నర్ కాకినాడ పీఆర్జీసీ కాలేజ్ * చెస్‌లో విన్నర్ కాకినాడ ఆదిత్యకాలేజ్, రన్నర్ రాజమండ్రి జీడీసీ కాలేజ్ అథ్లెటిక్స్ పురుషుల విభాగంలో * రన్నింగ్ 100 మిటర్ల విభాగంలో జి.ప్రసాద్, జి.వీరబాబు, యువరాజు హరీష్, 200 మీటర్ల విభాగంలో జి.ప్రసాద్, యువరాజ్ హరీష్ జి.వీరబాబు, * 400 మీటర్ల విభాగంలో కుమార్, దుర్గాప్రసాద్, గణేష్, 800 మీటర్ల విభాగంలో రమేష్, గణేష్, రామన్నదొర, 1500 మీటర్ల విభాగంలో సూర్యతేజ, రామన్నదొర, నరేష్, 5కిలో మీటర్ల విభాగంలో రమేష్ నరేష్, దుర్గాప్రసాద్ మొదటి మూడు స్థానాలను సాధించారు. * లాంగ్ జంప్‌లో కుమార్, నారాయణ, వేణు, హైజంప్‌లో మణికంఠ, జగ్గారావు, వేణుబాబు, షాట్‌పుట్‌లో పి.విజయకుమార్, చక్రధరరావు, వీరబాబు, డిస్కస్ త్రోలో విజయకుమార్, రాజేష్, వేణు తొలి మూడు స్థానాలు సాధించారు. అథ్లెటిక్స్ మహిళల విభాగంలో * రన్నింగ్ 100 మీటర్ల విభాగంలో దుర్గాభవానీ, పద్మ, ఉమామహేశ్వరి, 200 మీటర్ల విభాగంలో దుర్గాభవానీ, ఫణిశ్రీ, పద్మ, 400 మీటర్ల విభాగంలో ఉమామహేశ్వరి, ప్రియాంక, ప్రమీల, 800 మీటర్ల విభాగంలో ప్రియాంక, వీరల క్ష్మి, ఫణిశ్రీ, 1500 మీటర్ల విభాగంలో విజయకుమారి, దేవి, శాంతి, 3కిలో మీటర్ల విభాగంలో వనజాకుమారి, దేవి, శాంతి మొదటి మూడు స్థానాలు సాధించారు. * లాంగ్ జంప్‌లో దుర్గాభవానీ, నారాయణమ్మ, పద్మ, హైజంప్‌లో భాగ్యలక్ష్మి, బాల, పద్మ, షాట్‌పుట్‌లో, దుర్గాభవానీ, వరల క్ష్మి, కృష్ణవేణి, డిస్కస్‌త్రో విభాగంలో దుర్గాభవానీ, కృష్ణవేణి, మహాల క్ష్మి తొలి మూడు స్థానాలు సాధించారు. కబడ్డీ విజేత ప్రకటనపై రగడ పిఠాపురం క్రీడాకారుల ఆవేదన కబడ్డీ జేత ప్రకటనలో నెలకొన్న గందరగోళం రగడకు దారితీసింది. తమ కళాశాల క్రీడాకారులకు అన్యాయం చేశారని పిఠాపురం డిగ్రీ కళాశాల డిప్యూటీ ప్రిన్సిపాల్, ఇన్చార్జి పీడీ కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన కబడ్డీ సెమీ ఫైనల్స్‌లో రాజమండ్రి ఎస్‌కేవీటీ, పిఠాపురం డిగ్రీ కాలేజ్‌ల మధ్య పోరు సాగింది. ఓ దశలో పిఠాపురం జట్టు 39 పాయింట్లతో గెలుపొందిందని నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఎస్‌కేవీటీ క్రీడాకారులు, స్థానికులు అభ్యంతరం తెలపడంతో నిర్వాహకులు ఇంకా ఆట పూర్తికాలేదని వెల్లడించారు. దీంతో పిఠాపురం క్రీడాకారులు ఆందోళన చేశారు. స్థానికులు చుట్టుముట్టడంతో ఒత్తిడికి లోనై నిర్వాహకులు ఆట పూర్తికాలేదని చెప్పారని పిఠాపురం కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారావు, కెప్టెన్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు. స్కోర్ బోర్డులను మార్చేశారని ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతవిద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని కృష్ణారావు పేర్కొన్నారు. పోటీల నిర్వహణకు సరైన వసతులు కల్పించలేదని టెక్నికల్ కమిటి ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఈవిషయమై క్రీడల జిల్లా కో-ఆర్డినేటర్ అమ్మన్నచౌదరిని వివరణ కోరగా రాజమండ్రి-పిఠాపురం జట్లు 38-38 పాయింట్లు సాధించాయని, స్కోరర్ రాజమండ్రికి వేయాల్చిన పాయింటును పిఠాపురానికి వేశారని, దీంతో పిఠాపురం గెలిచినట్లు ముందు ప్రకటించారని, అయితే వెంటనే తప్పును గ్రహించి విషయాన్ని పిఠాపురం విద్యార్థులకు చెప్పే ప్రయత్నం చేశామని వివరించారు. టెక్నికల్ కమిటీకి కూడా నివేదించామని డ్రాగా ప్రకటి స్తామని లేదా మళ్లీ ఆట ఆడాలని సూచించామని, అయితే వారు వినలేదని, వెళ్లిపోయారని వెల్లడించారు. దీంతో విజేతగా ఎస్కేవీటీని ప్రకటించామన్నారు.