షోభాయ‘యానాం’
పట్టణంలో ప్రారంభమైన ఫల, పుష్ప ప్రదర్శన
అబ్బురపరుస్తున్న పుష్పాలు, కాయగూరలు
ప్రత్యేక ఆకర్షణగా ఎయిర్ బస్
ముమ్మిడివరం, తాళ్లరేవు :
రంగురంగుల పుష్పాలు, వివిధ రకాల వృక్షజాతులు, అబ్బురపరిచే కాయగూరలు, ఆకట్టుకునే కార్వింగ్ చిత్రాలతో యానాంలో ఫల, పుష్పప్రదర్శన కనువిందు చేస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న 18వ ఫలపుష్ప ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. సుమారు రూ.35లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో హైబ్రీడ్, దేశవాళీ జాతులకు చెందిన వేలాది పుష్పాలు, ప్రత్యేకతలు కలిగిన కాయగూరలతోపాటు పూణే, బెంగళూరుల నుంచి తీసుకువచ్చిన వివిధ రకాల గులాబీలు, ఆర్కిడ్స్ ఆకట్టుకోనున్నాయి. వివిధ రకాలైన బంతి, చామంతి, గులాబీలతో పాటు పోయి¯ŒSసెట్టియా, మినీ దాలియా, దాలియా, బెంగళూరు గులాబీలు, ఆఫ్రికా మేరిగోల్డ్, బోన్సాయ్, ఫైర్‌బెల్, తరూనియా, జర్బెరా, లిలియం, కార్నేషన్, డెండ్రోబియం, హెలికోనియా తదితర పుష్పజాతులను పొందుపరిచారు. రైతులు పండించిన భారీ గుమ్మడి, ఆనబ, కంద తదితర కాయగూరలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
అలరించిన కార్వింగ్ ఆకృతులు
ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన కార్వింగ్ చిత్రాలు చూపరులను ముచ్చట గొలుపుతున్నాయి. ముఖ్యంగా పురివిప్పిన నెమలి, పచ్చిమిరపలతో తయారు చేసిన హంసలు, గుమ్మడికాయ పుష్పాలు, గుమ్మడిపై చెక్కిన గాంధీ, అంబేడ్కర్ ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే పువ్వులతో చేసి బాతు అందరికీ స్వాగతం పలుకుతోంది.
ఆకట్టుకున్న ‘ఎయిర్‌బస్’
18వ ఫల పుష్ప ప్రదర్శనలో కార్నేష¯ŒS పుష్పాలతో రూపొందించిన ఎయిర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బెంగళూరుకు చెందిన డచ్ ఫ్లవర్స్ సంస్థ మేనేజర్ వరదరాజ¯ŒS పర్యవేక్షణలో ఈ ఎయిర్‌బస్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. టేకాఫ్ తీసుకుంటున్న ఏరోప్లే¯ŒS మాదిరిగా ఏర్పాటు చేస్తున్న ఈ ఎయిర్‌బస్ ఈ ఏడాది ఉత్సవాలకు ప్రత్యేక అకర్షణగా ఉంది. అలాగే ఈ సారి విభిన్న రీతిలో ఉన్న ఆర్నమెంటల్ క్రోటన్ల మొక్కలను ప్రదర్శనలో ఉంచారు. ఆయా ఏర్పాట్లను వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్ మురుగు¯ŒS నేతృత్వంలో అధికారులు చిక్కాల జోగి రాజు, ఐకే ఖా¯ŒSలు పర్యవేక్షిస్తున్నారు.